Kiss Song: 'జాక్... వీడు కొంచెం క్రాక్'కు ముద్దు కష్టాలు... 'కిస్' సాంగ్‌లో 'డాకు మహారాజ్' ఉన్నాడని గమనించారా?
Kiss Song : సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న మూవీ 'జాక్'. తాజాగా 'కిస్' సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో 'డాకు మహారాజ్' కూడా ఉన్నాడన్న విషయాన్ని గమనించారా ?

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న రొమాంటిక్ మూవీ 'జాక్'. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీపై మంచి బజ్ ఉంది. గత ఏడాది 'టిల్లు స్క్వేర్'తో భారీ హిట్ అందుకున్న సిద్దు, 'బేబీ' చిత్రంతో వైష్ణవి చైతన్య మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ కలిసి జంటగా నటిస్తున్న సినిమా కావడంతో 'జాక్' మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. మార్చ్ 20న అంటే ఈరోజు 'జాక్' సినిమా నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు.
ముద్దు కోసం 'జాక్' తంటాలు
'జాక్' సినిమా నుంచి 'కిస్ సాంగ్' అనే రెండో పాటను తాజాగా రిలీజ్ చేశారు. ముందుగానే ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసి మంచి హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 'కిస్ సాంగ్' లిరికల్ వీడియోను వదిలారు. అందులో ముద్దు పెట్టుకోవడానికి ప్లేస్ కోసం వెతికే జంటతో ఈ సాంగ్ సాగగా, ఎక్కడికి వెళ్ళినా డిస్టర్బ్ కావడం కనిపిస్తోంది. అలాగే సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య మధ్య ఇందులో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి ఈ 'కిస్ పాట'కు మంచి మెలోడియస్ ట్యూన్స్ ను అందించారు. జావేద్ అలీ, అమల చేబోలు ఈ పాటను పాడగా, సనారే లిరిక్స్ అందించారు. అలాగే ఈ పాటకు రాజు సుందరం కొరియోగ్రఫీ చేశారు.
'కిస్ సాంగ్'లో 'డాకు మహారాజ్'
"హైదరాబాదులో నాకంటూ ఓ ప్లేస్ లేకపోవడమా?" అనే డైలాగ్ చెప్తూ వైష్ణవి చైతన్య చేయి పట్టుకుని సిద్దు లాక్కెళ్లడంతో పాట మొదలవుతుంది. కానీ ముద్దు పెట్టుకోవడానికి ఒక్క ప్రైవేట్ ప్లేస్ కూడా వీళ్లకు దొరకపోవడం ఆసక్తికరంగా అన్పిస్తోంది. ఇక సాంగ్ మొత్తం సరదాగా, మెలోడీ, రొమాంటిక్ గా ఉండడంతో యూత్ ని ఇట్టే అట్రాక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే 'కిస్ సాంగ్' లిరికల్ వీడియోలో 'డాకు మహారాజ్' దర్శనమిచ్చాడు. ముద్దు పెట్టుకోవడానికి ఒక ప్రైవేట్ ప్లేస్ ను వెతుకుతున్న తరుణంలోనే ఎవ్వరూ లేని ఓ థియేటర్లోకి వెళ్తారు సిద్దు, వైష్ణవి. అక్కడ జనాలు లేకపోవడంతో ముద్దు పెట్టుకుందామని అనుకునే లోపే సింహం లాంటి బాలయ్య గర్జన ఈ జంటను భయపెడుతుంది.
Also Read: ప్రకాష్ రాజ్... శ్యామల... బెట్టింగ్ యాప్స్ కేసులో జనసైనికుల టార్గెట్ వీళ్ళిద్దరే!
#KissSong Launch Event is live now 😍🫶🏻🔥
— SVCC (@SVCCofficial) March 20, 2025
Watch it here. https://t.co/esC0FwrIt2#JACK in cinemas from April 10th!!#SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz @sureshbobbili9 #AchuRajamani @SamCSmusic @JavedAli4u @Amalachebolu @__Sanare @SVCCofficial @JungleeMusicSTH… pic.twitter.com/iolZmM3EYs
ఇలా సిద్దు జొన్నలగడ్డ సినిమాలో బాలయ్య హీరోగా నటించిన 'డాకు మహారాజ్' సీన్ ఉండడం ఆసక్తికరంగా మారింది. నిజానికి చాలామంది ఈ విషయాన్ని గమనించలేదు. ఇక గమనించిన వారు విషయాన్ని బయట పెడుతూ సాంగ్ ను వైరల్ చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 10న 'జాక్' మూవీ థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, సురేష్ బొబ్బిలితో పాటు అచ్చు రాజమణి, సామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్టర్స్ గా వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

