IPL 2025 Fand Park: ఐపీఎల్ 2025 సీజన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్‌లు ఇవే
IPL 2025 Fand Park:ఐపీఎల్ 2025 శనివారం ధూంధాంలో ప్రారంభంకానుంది. సిక్సర్లు, ఫోర్లు వికెట్లే కాదు స్టేడియంలో హైడ్రా కూడా ఆకట్టుకుకోనుంది. దీని కోసం తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేశారు.

IPL 2025 Fand Park: క్రికెట్ అభిమానులకు కిక్ ఇచ్చే సమయం రానే వచ్చింది. శనివారం నుంచి ప్రతి రోజూ పండగే. రోజంతా అవే ఊసులు. ఆఫీస్ కాంటీనుల్లో బస్టాపుల్లో, సెలూన్ షాపుల్లో ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్. సోషల్ మీడియాలో సరే సరే. దీన్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది బీసీసీఐ. అందుకే ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ఫ్యాన్ పార్క్‌లు ఏర్పాటు చేస్తోంది. ఈసారి ఐపీఎల్ ఫ్యాన్ పార్క్‌లను 23 రాష్ట్రాల్లోని 50 నగరాల్లో ఏర్పాటు చేయనున్నారు.
IPL 2025 ఎడిషన్ మార్చి 22 ప్రారంభమై మే 25 వరకు సాగనుంది. ఈ మ్యాచ్‌లు జరిగే పది వారాల పాటు ఈ ఫ్యాన్ పార్క్‌లు క్రికెట్ అభిమానులను అలరించనున్నాయి. ఈశాన్యంలోని టిన్సుకియా (అస్సాం) నుంచి దక్షిణాన కొచ్చి (కేరళ) వరకు, ఉత్తరాన అమృత్సర్ (పంజాబ్) నుంచి పశ్చిమాన గోవా వరకు ప్యాన్స్ పార్క్‌లు ఏర్పాటు చేసింది. ఈ ఫ్యాన్ పార్కుల్లో మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారంతోపాటు అనేక ఎంటర్‌టైన్మెంట్ ఈవెంట్స్ ఆకట్టుకోనున్నాయి. సంగీతం, వినోదం, ఫుడ్ కోర్టులు, పిల్లల ఆట జోన్, వర్చువల్ బ్యాటింగ్ జోన్, నెట్స్ ద్వారా బౌలింగ్, ఫేస్-పెయింటింగ్ జోన్‌లు, రెప్లికా డగౌట్‌లు, చీర్-ఓ-మీటర్, 360 డిగ్రీల ఫోటోసహా ఫుల్ ప్యాక్‌తో ఈ ఫ్యాన్‌ప్యార్కులు సిద్ధమయ్యాయి.
తొలిసారిగా 2015లో ఈ ఫ్యాన్ పార్క్ కాన్సెప్టును ప్రారంభించారు. అప్పటి నుంచి క్రికెట్ అభిమానులకు అనేక అనుభూతులు పంచుతోంది. దేశంలోని ప్రతి మూలకు ఐపీఎల్ థ్రిల్‌ను తీసుకెళ్లడంలో విజయం సాధించింది. దీన్ని మరింత దూరం తీసుకెళ్లేందుకు ఇప్పుడు మరిన్ని నగరాల్లో విస్తరించింది.
ఈ సీజన్‌లో మొదటి ఫ్యాన్ పార్క్‌లు రోహ్‌తక్ (హర్యానా), బికనీర్ (రాజస్థాన్), గ్యాంగ్‌టక్ (సిక్కిం), కొచ్చి (కేరళ), కోయంబత్తూర్ (తమిళనాడు)లలో ప్రారంభమవుతాయి. వారాంతంలో వివిధ రాష్ట్రాల్లోని నగరాల్లో ఈ ఫ్యాన్ పార్క్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఎక్కువ మంది అభిమానులతో ఎంగేజ్ అయ్యేలా వీటిని ఏర్పాటు చేస్తున్నారు.
తొలిసారిగా ఈ సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఉంది. ఇప్పుడు మరొకటి యాడ్ చేశారు. తెలంగాణలో చూసుకుంటే రెండు ప్రాంతాల్లో ఈ ఫ్యాన్ పార్క్‌లు ఉన్నాయి. ఒకటి నిజామాబాద్‌లో ఉంటే రెండోది వరంగల్‌లో ఉంది. దిమాపూర్ (నాగాలాండ్), కారైకల్ (పుదుచ్చేరి), మంభుం, పురులియా (పశ్చిమ బెంగాల్), రోహ్‌తక్, టిన్సుకియాలలో కూడా తొలిసారి ఐపీఎల్ ఫ్యాన్ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నారు.
"ఐపీఎల్ టోర్నమెంట్‌ను భారతదేశంలోని ప్రతి అభిమానికి చేరువ చేసేందుకు IPL ఫ్యాన్ పార్కులదే కీలకపాత్ర" అని IPL ఛైర్మన్ అరుణ్ సింగ్ ధుమాల్ అన్నారు. దీన్ని వివిధ ప్రాంతాల్లో అచ్చం స్టేడియం అనుభూతి ఇచ్చేలా వీటిని రూపొందించామన్నారు. అక్కడు వచ్చిన అభిమానులు స్టేడియంలో ఉన్న ఫీలింగ్ కలిగించడమే తమ లక్ష్యమని అని అన్నారు. దీని వల్ల దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులతో ఐపీఎల్ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది అభిప్రాయపడ్డారు.
BCCI గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ... "IPL ఫ్యాన్ పార్కులను స్టేడియంలకు మించి అభిమానులను ఆకట్టుకునే చేయాలనే మా నిబద్ధతను నిదర్శనం. 2015లో ప్రారంభించినప్పటి నుంచి లక్షల మంది అభిమానులకు IPL థ్రిల్ అందించింది, మరపురాని అనుభవాలు కలిగించింది. ఈ సారి షెడ్యూల్ 50 నగరాలను కవర్ చేస్తున్నాం. IPL అనుభవాన్ని మరింత మంది అభిమానుల వద్దకు తీసుకెళ్లడానికి ఉత్సాహంగా ఉన్నాం. క్రికెట్ స్ఫూర్తి, IPL మాయాజాలం దేశంలోని ప్రతి మూలకు చేరుకుంటుందని ఆశిస్తున్నాన." అని తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

