Delhi High Court Judge Issue: ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు - రాజ్యసభలోనూ చర్చ - విచారణ కమిటీ నియమించిన సీజేఐ
Justice Yashwant Varma: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలపై విచారణకు ముగ్గురు న్యాయమూర్తులతో కమిటీని సీజేఐ నియమించారు. మరో వైపు రాజ్యసభలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు.

CJI: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు బయటపడటంపై రాజ్యసభలోనూ ప్రస్తావించారు. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ జ్యూడషియల్ అకౌంటబులిటీపై తాను ఇచ్చిన నోటీసు పెండింగ్ లో ఉందని ఇప్పుడీ ఘటన జరిగినందున దానిపై స్పందించాలని కోరారు. గతంలో జైరాం రమేష్ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఒకర్ని అభిశంసించాలని నోటీసు ఇచ్చారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయట పడ్డాయని ఇది షాక్ కు గురి చేసే అంశమన్నారు. ఇదే విషయం రాజకీయ నేత, అధికారి లేదా పారిశ్రామిక వేత్త ఇంట్లో జరిగి ఉంటే వెంటనే అతన్ని టార్గెట్ చేసేవారన్నారు. అయితే ఈ విషయంలో ఓ నిర్మాణాత్మక విచారణ .. పారదర్శకంగా జరుగుతోందని జస్టిస్ ధన్ ఖడ్ తెలిపారు. ఓ న్యాయమూర్తి అభిశంసనకు సంబంధించి తనకు 55 మంది సభ్యుల సంతకాలతో నోటీసు అందిందన్నారు.
మరో వైపు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. జస్టిస్ యశ్వంత్ వర్మను మళ్లీ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేశారు. ఆయనను అక్కడి నుంచే ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేశారు. మళ్లీ పాత ప్రాంతానికి పంపారు. ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణకు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని కొలిజీయం నిర్ణయం తీసుకుంది. రాజీనామా చేయించాలని కొలిజియం సభ్యులు భావించినట్లుగా తెలుస్తోంది. అయితే జస్టిస్ యశ్వంత్ వర్మ ససేమిరా అనడంతో ముగ్గురు న్యాయమూర్తుల కమిటీని విచారణకు నియమించినట్లుగా తెలుస్తోంది.
జస్టిస్ యశ్వంత్ వర్మ ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. ఆయన ఇంట్లో ఇటీవల అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు.కుటంబసభ్యులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి ఫోన్ చేశారు. వారు వచ్చి మంటల్ని ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో మంటలు అంటుకున్న గదుల్లో ఉన్న సామాన్లను బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు. ఓ గదిలో వారికి నిండా పేల్చిన నోట్ల కట్టలు కనిపించాయి. దాంతో ఈ విషయాన్ని ఫైర్ సిబ్బంది ఉన్నతాధికారులకు నివేదించారు. మామూలుగా అయితే కొద్ది మొత్తం ఉంటే పట్టించుకునేవారు కాదు కానీ ఓ గది నిండా ఉండటంతో అధికారులు కూడా ఆశ్చర్యపోయారు.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు న్యాయ వ్యవస్థను కుదిపేశాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు వెంటనే చర్య తీసుకుని ఆయనను ఢిల్లీ నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. న్యాయమూర్తి ఇంట్లో ఇలా భారీగా నగదు దొరకడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని అధికారులు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సంజీవ్ ఖన్నాకు ఈ సమాచారం అందగానే, ఆయన వెంటనే కొలీజియం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తర్వతా జస్టిస్ యశ్వంత్ వర్మను బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా చేయమని సుప్రీంకోర్టు కోరే ఛాన్స్ ఉందని అంటున్నారు. రాజీనామా చేయడానికి వర్మ అంగీకరించకపోతే పార్లమెంట్ జోక్యం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదని భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

