Justice Yashwant Varma: హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో చెలరేగిన మంటలు - బయటపడ్డ నోట్ల కట్టలు
Justice Yashwant Varma: న్యాయ వ్యవస్థనే కుదిపేసిన ఘటన. ఓ న్యాయమూర్తి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు లభ్యం కావడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. దీంతో వెంటనే సుప్రీంకోర్టు చర్యలు ప్రారంభించింది.

Justice Yashwant Varma: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ప్రభుత్వ బంగ్లాలో మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పుతుండగా భారీగ నగదు బయటపడటం సంచలనం సృష్టించింది. ఇది దేశ న్యాయవ్యవస్థనే షేక్ చేసింది. దీంతో ఆయన్ని సుప్రీంకోర్టు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు న్యాయ వ్యవస్థను కుదిపేశాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు వెంటనే చర్య తీసుకుని ఆయనను ఢిల్లీ నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. ఆయన రాజీనామా కోరే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు కూడా త్వరలో దీనిపై ఉన్నత స్థాయి దర్యాప్తు ప్రారంభించవచ్చు.
జస్టిస్ వర్మ వేరే ప్రదేశంలో ఉన్న టైంలో ఆయన ఉండే ప్రభుత్వ బంగ్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు అగ్నిమాప సిబ్బందికి కాల్ చేశారు. విషయం చెప్పారు. ఢిల్లీకు చెందిన న్యాయమూర్తి ఇంట్లో అగ్ని ప్రమాదం అని తెలియడంతో వెంటనే స్పందించారు. వెంటనే వచ్చి మంటలు ఆర్పేశారు. వాళ్లతోపాటు పోలీసులు కూడా ప్రమాదం జరిగిన స్పాట్‌కు వచ్చారు.
మంటలు ఆర్పుతున్న టైంలో వాళ్లకు భారీగా నోట్ల కట్టల మూటలు లభ్యమయ్యాయి. వాటిని గుర్తించిన అగ్నిమాప సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతా కలిసి వాటిని బయటకు తీసుకొచ్చారు. దీంతో అసల గుట్టు వెలుగు చూసింది. నోట్లు కట్టలు ఎక్కువ ఉండటంతో విషయం ఉన్నతాధికారులకు చేరింది.
కొలీజియం సమావేశం
న్యాయమూర్తి ఇంట్లో ఇలా భారీగా నగదు దొరకడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని అధికారులు సుప్రీంకోర్టుకు తెలియజేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) సంజీవ్ ఖన్నాకు ఈ సమాచారం అందగానే, ఆయన వెంటనే కొలీజియం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తర్వతా జస్టిస్ యశ్వంత్ వర్మను బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు.
బదిలీ అనేది ప్రాథమిక చర్యగా సుప్రీంకోర్టు వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని తన స్థాయిలో సుప్రీంకోర్టు దర్యాప్తు చేయవచ్చు. దర్యాప్తులో జస్టిస్ యశ్వంత్ వర్మ తనను తాను కాపాడుకోలేకపోతే ఆయన పదవికే ముప్పు తప్పదనే టాక్ నడుస్తోంది.
రాజీనామా చేయమని సుప్రీంకోర్టు కోరే ఛాన్స్ ఉందని అంటున్నారు. రాజీనామా చేయడానికి వర్మ అంగీకరించకపోతే పార్లమెంట్ జోక్యం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. పార్లమెంటులో ఆయనపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం తొలగించవచ్చు. అంతరం ఇతర చర్యలు కూడా తీసుకోవచ్చు. అయితే, ఈ మొత్తం ప్రక్రియకు చాలా సమయం పడుతుంది.
1992లో న్యాయవాదిగా మారిన వర్మ
జస్టిస్ యశ్వంత్ వర్మ 1969 జనవరి 6న అలహాబాద్‌లో జన్మించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హన్స్‌రాజ్ కళాశాల నుంచి బి.కామ్ (ఆనర్స్) పూర్తి చేశారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్‌లోని రేవా విశ్వవిద్యాలయం నుంచి ఎల్‌ఎల్‌బి పట్టా పొందారు. ఆయన 1992 ఆగస్టు 8న న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు.
2006 నుంచి పదోన్నతులు
చాలా కాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన తర్వాత, కార్మిక & పారిశ్రామిక చట్టాలు, కార్పొరేట్ చట్టాలు, పన్నులు, సంబంధిత రంగాలలో నైపుణ్యాన్ని సంపాదించారు. దీని తరువాత, 2006 నుంచి అలహాబాద్ హైకోర్టులో ప్రత్యేక న్యాయవాదిగా కూడా పని చేశారు. 2012, 2013 మధ్య, ఆయన ఉత్తరప్రదేశ్ చీఫ్ స్టాండింగ్ కౌన్సెల్ పదవిలో ఉన్నారు. దీని తర్వాత ఆయన సీనియర్ న్యాయవాది అయ్యారు. 2014 అక్టోబర్ 13న అలహాబాద్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 1 ఫిబ్రవరి 2016న, అంటే రెండేళ్లలోపే, ఆయనకు శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. అక్టోబర్ 11, 2021న ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

