Supreme Court: ప్రైవేటు భాగాలపై గాయాల్లేకపోతే రేప్ జరగలేదని నిర్ధారణ కాదు - 40 ఏళ్ల నాటి కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
Historic Verdict: బాధితురాలి ప్రైవేటు పాటుపై గాయాల్లేవని అత్యాచారం చేయలేదని ఓ వ్యక్తి చేసిన వాదనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గాయాలు ఉంటేనే రేప్ చేసినట్లుగా కాదని స్పష్టం చేసింది.

Historic Verdict Against Tuition Teacher: "అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి కేసులో బాధితురాలి ప్రైవేట్ భాగాలకు గాయం ఉండాల్సిన అవసరం లేదు. అది ఆ కేసులో ఉన్న సాక్ష్యాలు, పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. బాధితురాలి ప్రైవేట్ భాగాలపై గాయాలు లేకపోవడం ఎల్లప్పుడూ అత్యాచారం జరగలేదని చెప్పడానికి కారణం కాదని " సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు 40 ఏళ్ల చరిత్ర ఉంది.
40 ఏళ్ల కిందట తన విద్యార్థినిని రేప్ చేసిన టీచర్
1984లో ఓ టీచర్.. తన వద్ద ట్యూషన్ కు వచ్చే విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడని కేసు నమోదు అయింది. ట్రయల్ కోర్టు నిందితుడిని రెండేళ్లలోపు దోషిగా నిర్ధారించింది. అయితే నిందితుడు న్యాయపరమైన ప్రక్రియను వివిధ రకాల పిటిషన్ల ద్వారా ఆలస్యం చేస్తూ వస్తున్నాయి. అలహాబాద్ హైకోర్టులో తీర్పును సవాల్ చేశాడు. అక్కడ టు తీర్పును సమర్థించడానికి 25 సంవత్సరాలు పట్టింది. పాతికేళ్ల తర్వాత దిగువ కోర్టు తీర్పు సరైనదేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే వెంటనే నిందితుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించడానికి మరో 15 సంవత్సరాలు పట్టింది. నేరం జరిగిన 40 సంవత్సరాల తర్వాత, సుప్రీంకోర్టు అత్యాచార నేరారోపణలపై స్పష్టతను ఇస్తూ కీలకమైన తీర్పు చెప్పింది.
న్యాయవ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకుని 40 ఏళ్ల పాటు న్యాయపోరాటం
బాధితురాలి ప్రైవేట్ భాగాలపై కనిపించే గాయం లేకపోవడం అంటే ఆ చర్యను అత్యాచారంగా పరిగణించలేమని నిందితుడి తరపు లాయర్ వాదించారు. ఈ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. లైంగిక సంబంధం ఏకాభిప్రాయంతో జరిగిందని నిందితుడు వాదించాడు. కానీ అతను అత్యాచారం చేశాడన్నదానికి ఇతర ఆధారాలు ఉన్నాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. బాధితరాలు లైంకి దాడికి గురైనప్పుడు మైనర్. అప్పుడు ఆమె ఇచ్చిన సాక్ష్యం కీలకమైనదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బాధితురాలి ఏకైక సాక్ష్యం ఆధారంగా శిక్ష విధించవచ్చని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది.
బాధితారులి తల్లిపైనే ఆరోపణలు చేసిన నిందితుడు - ఎట్టకేలకు జైలుకు
ఈ కేసులో బాధితురాలి తల్లిపై కూడా నిందితుడు ఆరోపణుల చేశారు. బాలిక తల్లి అనైతిక ప్రవర్తన కారణంగా నిందితుడిని తప్పుడు కేసులో ఇరికించారనే వాదన కూడా వినిపించారు. అయితే ఇందుకు సాక్ష్యాలు లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అత్యాచారం చేసిన రెండేళ్లకే దిగువ కోర్టులో శిక్ష పడిప్పటికీ 38 ఏళ్ల పాటు కేసును నడిపించుకుని ఆతను రిలీఫ్ పొందాడు. ఇప్పుడు జైలుకెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడింది. అత్యాచార కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పు ఓ కీలక మలుపుగా మారనుంది.





















