Gautham Ghattamaneni: మహేష్ తనయుడి నటనకు అభిమానులు ఫిదా... గౌతమ్‌లో ఈ యాంగిల్ కూడా ఉందా, హాలీవుడ్ ఎంట్రీ ప్లాన్?
Gautham Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని నటించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో గౌతమ్ నటనను చూసిన మహేష్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ చిన్నప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అతి కొద్దిరోజుల్లోనే ఆయన హీరోగా అడుగు పెట్టడం ఖాయం అనుకున్నారు. కానీ గౌతమ్ మాత్రం చదువుపై దృష్టి పెట్టాడు. ప్రస్తుతం గౌతమ్ అమెరికాలో చదువుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన యాక్టింగ్ చేసిన ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో గౌతమ్ యాక్టింగ్ స్కిల్స్ చూసి మహేష్ బాబు అభిమానులు ఫిదా అవుతున్నారు.
గౌతమ్ యాక్టింగ్ వీడియో వైరల్
ఈ వైరల్ వీడియోలో గౌతమ్ తన అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ ను చూపించాడు. గౌతమ్ ఎన్వైయు టిష్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ (NYU Tisch School of the Arts)కు సంబంధించిన ఒక స్కిట్ లో తన కో స్టూడెంట్ తో నటించి అదరగొట్టాడు. ఓ అమ్మాయి తో కలిసి అతడు చేసిన ఈ స్కిట్ అందరినీ ఆకట్టుకుంటుంది. వీడియో మొదట్లో చిరునవ్వుతో కనిపించిన గౌతమ్ కొద్ది క్షణాల్లోనే ఆగ్రహావేశాలతో ఊగిపోతాడు. దీనిని చూసి ఆ అమ్మాయి టెన్షన్ పడుతుంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ వీడియో అవైలబుల్ గా లేదు. గౌతమ్ నటించిన ఈ వీడియో క్లిప్ గురించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కానీ గౌతమ్ ని ఇప్పటిదాకా సైలెంట్ గా చూసిన అభిమానులు ఆయనలోని ఈ వైలెంట్ సైడ్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక గౌతమ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి కంప్లీట్ గా సిద్ధం అయ్యాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిన్న సింహం డైరెక్ట్ హాలీవుడ్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నాడు అంటూ ఆ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.
Chinna 🦁 #GautamGhattamaneni
— Akshay Sai (@Akshay050989) March 21, 2025
Direct #Hollywood entry ki plan chesthunnadu 🔥❤️🔥
pic.twitter.com/tbpJbHBuLs
విదేశాల్లో యాక్టింగ్ పాఠాలు
గౌతమ్ ఇప్పటికే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. న్యూయార్క్ లో ఉన్న ఒక ప్రముఖ యూనివర్సిటీలో యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు లాగే ఆయన తనయుడు గౌతమ్ కూడా నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అందులో భాగంగానే యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా, కొన్నాళ్ళ క్రితమే లండన్ లో ఫస్ట్ స్టేజ్ పర్ఫామెన్స్ కూడా ఇచ్చాడు. "గౌతమ్ ఫస్ట్ థియేటర్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. ఈ సమ్మర్ ప్రోగ్రాం చిన్నారుల్లోని టాలెంట్ ను బయటకు తీయడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది" అంటూ నమ్రత ఇన్స్టా లో పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. కాగా గౌతమ్ ఇప్పటికే బాల నటుడిగా తెరపై మెరిసాడు. మహేష్ బాబు హీరోగా నటించిన "1 నేనొక్కడినే" సినిమాలో యాక్ట్ చేశాడు. ఇదే గౌతమ్ ఫస్ట్ మూవీ. ఇక మరోవైపు సితార ప్రస్తుతం కమర్షియల్ యాడ్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఓ నగల దుకాణానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన సితార, తాజాగా తండ్రితో కలిసి ఒక బట్టల బ్రాండ్ యాడ్లో నటించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

