Mahesh Babu - Sithara Ghattamaneni: తండ్రితో సితార కొత్త యాడ్... కొత్త భాషలో మహేష్ బాబునే ఆడుకుందిగా... ఈ జెన్ జెడ్ కిడ్‌ను తట్టుకోవడం కష్టమే
Mahesh Babu - Sithara Ghattamaneni : సితార ఘట్టమనేని తన తండ్రి మహేష్ బాబుతో ఓ కొత్త యాడ్ చేసింది. ఆ యాడ్ లో ఈ జెనరేషన్ పిల్లలు ఉపయోగించే జెన్ జెడ్ భాషతో మహేష్ బాబు, సితార అదరగొట్టారు.

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఎంతటి ఫ్యాన్ బేస్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఆయన పిల్లలకి ఆల్మోస్ట్ సూపర్ స్టార్ రేంజ్ లో అభిమానగణం ఉంది. అందులోనూ సితారకి స్టార్ హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ ఉంది. సితార తెరపై హీరోయిన్ గా ఎప్పుడెప్పుడు మెరుస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పట్లో ఆమె హీరొయిన్ గా కనిపిస్తుందా లేదా అనేది ఇంకా తెలియదు. కానీ, అప్పుడప్పుడు కొన్ని యాడ్స్ తో అభిమానుల ఆశ తీరుస్తోంది. తాజాగా మరో యాడ్ లో మహేష్ బాబుతో కలిసి సితార నటించింది.
మహేష్ బాబు సితార కొత్త యాడ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు యాడ్స్ లో దర్శనమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన కూతురు సితారతో కలిసి మరో కొత్త యాడ్ చేశారు. ఆ యాడ్లో యూత్ ను బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఈ జనరేషన్ ఉపయోగిస్తున్న జెన్ జెడ్ భాషను మహేష్ బాబుకు నేర్పిస్తూ కనిపించింది సితార. ఇదొక బట్టల యాడ్. ట్రెండ్స్ కి సంబంధించిన ఈ యాడ్ వీడియోలో మహేష్ బాబు, సితార షాపింగ్ చేసి రావడం కనిపించింది.
మహేష్ కు జెన్ జెడ్ భాష నేర్పించిన సితార
ఆ తర్వాత "షాపింగ్ బాగా ఎంజాయ్ చేసాం కదా?" అని మహేష్ బాబు అడుగుతాడు. వెంటనే "అవును" అంటూ సితార ఓ డ్రెస్ ను విసరగా, మహేష్ బాబు అదిరిపోయే బ్లాక్ అవుట్ ఫిట్ లోకి మారారు. వెంటనే సితార "అదిరిందిగా డ్రిప్" అని కాంప్లిమెంట్ ఇచ్చింది. "డ్రిప్పా" అని మహేష్ బాబు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయగా, "డ్రిప్ అంటే అవుట్ ఫిట్ చాలా బాగుందని అర్థం" అని చెప్పింది సితార. ఆ తర్వాత మహేష్ బాబు ఓ డ్రెస్ ఇవ్వగా... "దిస్ ఈజ్ గ్రేట్ నాన్న... కానీ ఇప్పుడు నా వైబ్ ఇదే" అని చెప్పింది. "వైబ్ అంటే నా టైం" అని మహేష్ కు అర్థమయ్యేలా చెప్పింది. ఆ తర్వాత "దీన్ని మేమంటాము ఫామ్" అని సితార అనగానే... "అంటే ఫామ్ జామ్" అని మహేష్ బాబు అందుకున్నారు. "ఇప్పుడు అర్థమైంది మీకు" అని మహేష్ బాబును హగ్ చేసుకోవడంతో ఈ యాడ్ ముగిసింది.
ఇక తండ్రి కూతుర్లు ఇద్దరూ కలిసి చేసిన ఈ అద్భుతమైన యాడ్ తో ట్రెండ్స్ సేల్స్ పెరగడం పక్కా. అయితే ఇందులో సితారను చూసిన తర్వాత ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే బాగుంటుందని తహతహలాడుతున్నారు మహేష్ బాబు అభిమానులు. ఇక సితార ప్రస్తుతం చదువుపై దృష్టి పెట్టింది. మరోవైపు అప్పుడప్పుడు ఇలాంటి యాడ్స్ తో అభిమానులను అలరిస్తోంది. మరోవైపు సేవా కార్యక్రమాల్లో కూడా చూరుగ్గా పాల్గొంటుంది సితార.
MaheshBabu new Ad with his daughter 🥰 #RelianceTrends #MaheshBabu #Sithara pic.twitter.com/IUGbLUp98X
— The Cine Gossips (@TheCineGossips) March 20, 2025





















