Chhattisgarh Encounters: తుపాకుల మోతతో దద్దరిల్లిన బస్తర్- ఎన్‌కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మృతి, ఓ జవాన్ వీరమరణం
ఛత్తీస్ గఢ్‌లో ఒకేరోజు రెండు వేర్వేరు చోట్ల భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. గురువారం జరిగిన ఎన్ కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మృతిచెందగా, ఓ జవాను వీర మరణం పొందాడు.

30 Naxals killed, jawan dead during encounters in Chhattisgarh | బీజాపూర్, దంతెవాడ: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్ తుపాకుల మోతతో మరోసారి దద్దరిల్లింది. గురువారం నాడు రెండు చోట్ల జరిగిన భారీ ఎన్‌కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎదురుకాల్పుల్లో ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న అండ్రీ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై నిఘావర్గాలు సమాచారం ఇవ్వడంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRI), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూషన్ యాక్షన్ (COBRA) టీమ్స్ సంయుక్తంగా ఆపరేషన్ లో పాల్గొన్నాయి.
తుపాకుల కాల్పులతో దద్దరిల్లిన బస్తర్ అటవీ ప్రాంతం
ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ డివిజన్ ఆండ్రీ అటవీప్రాంతం తుపాకుల కాల్పులతో దద్దరిల్లింది. రెండు వేర్వేరు చోట్ల ఎన్ కౌంటర్లలో 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఓ డీఆర్‌జీ జవాన్ కూడా మృతి చెందారు. మావోయిస్టుల మృతదేహాలను పోలీస్ లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఎన్‌కౌంటర్‌పై బస్తర్ ఐజీ ప్రకటన చేశారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆండ్రీ అటవీ ప్రాంతలో మావోయిస్టులు, బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు చెప్పారు. ఘటనా స్థలంలో భారీ ఎత్తున తుపాకులు, పేలుడు పదార్థాలు, ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఛత్తీస్ గఢ్‌లోని కాంకేర్, నారాయణ్ పూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. బీనగుండా, పురుష్కోడు అటవీ ప్రాంతంలో ఉత్తర బస్తర్ మాద్ డివిజన్ కమిటీ సభ్యులు ఉన్నారన్న సమాచారంతో బీఎస్ఎఫ్, డీఆర్‌జీ సంయుక్త బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందగా, డీఆర్‌జీ జవాను ఒకరు వీరమరణం పొందారని ఉన్నతాధికారులు తెలిపారు. మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టులు రెండు ప్రాంతాల్లో క్యాంపులను ఏర్పాటు చేసుకొని సమావేశం అయ్యారన్న సమాచారంతో పోలీస్ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. గురువారం ఉదయం బలగాలకు మావోయిస్టులు ఎదురుపడడంతో ఇరువైపుల నుంచి కాల్పులు కొనసాగాయి. గురువారం మధ్యాహ్నం వరకు కొనసాగిన ఎదురుకాల్పుల్లో ఓ చోట 26 మంది, మరో ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు చనిపోయినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. వెల్లడించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

