అన్వేషించండి

Hyderabad Drug Racket: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం, విదేశీ లింకులతో డ్రగ్స్ నెట్‌వర్క్ - టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆర్డర్లు

Hyderabad Drugs Case | కుత్బుల్లాపూర్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేసి నిందితుడి వద్ద కొకైన్, OG కుష్ స్వాధీనం చేసుకున్నారు. ముంబై నుంచి థాయ్‌లాండ్ వరకు డ్రగ్స్ కనెక్షన్ ఉందని పోలీసులు గుర్తించారు.

Hyderabad Drug Racket: కుత్బుల్లాపూర్: మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో కుత్బుల్లాపూర్ ప్రాంతంలో భారీగా డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ (DTF) బృందం మెరుపు దాడులు నిర్వహించి నిషేధిత మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. ఈ దాడుల్లో సుమారు 76.77 గ్రాముల కొకైన్, 200 గ్రాముల ఓజీ కుష్ (హైబ్రీడ్ గంజాయి) తో పాటు రవాణాకు ఉపయోగిస్తున్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారును అధికారులు సీజ్ చేశారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న సికింద్రాబాద్ యాప్రాల్‌కు చెందిన వ్యాపారి ఇంజోత్ సింగ్ నగపాల్ (27)ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ముంబై నుంచి థాయ్‌లాండ్ వరకు డ్రగ్స్ కనెక్షన్

నిందితుడిని విచారించగా విస్తుపోయే అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్ వివరాలు బయటపడ్డాయి. ముంబైలోని డొంబివ్లికి చెందిన 'అబ్దుజు' అనే నైజీరియన్ వ్యక్తి ద్వారా కొకైన్‌ను, థాయ్‌లాండ్‌లోని పట్టాయాకు చెందిన 'నవి' అనే వ్యక్తి నుంచి ఓజీ కుష్‌ను నిందితుడు సేకరించినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు విదేశీయులు పరారీలో ఉన్నారు. నిందితుడు పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు అత్యంత రహస్యంగా వ్యవహరించినట్లు దర్యాప్తులో తేలింది. టెలిగ్రామ్ యాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ, ఎవరికీ అనుమానం రాకుండా నిర్దేశిత ప్రదేశాల్లో డ్రగ్స్ దాచి ఉంచే "డెడ్ డ్రాప్స్" పద్ధతిలో సరఫరా చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఫయాజుద్దీన్ వెల్లడించారు.

పట్టుబడిన నిందితుడు ఇంజోత్ సింగ్‌ను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ సీఐ యాదయ్య నేతృత్వంలో నిందితుడిని మంగళవారం చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ డ్రగ్స్ సరఫరా వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? కస్టమర్లు ఎవరు? అనే కోణంలో కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
BAN Defeats AUS In 1st Test: ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్ చారిత్రాత్మ‌క‌ టెస్ట్ విక్టరీ.. 9 వికెట్ల‌తో కంగారులపై ఘ‌న విజ‌యం.. ఆసియా ఆవ‌త‌ల అతిపెద్ద గెలుపు, సిరీస్ పై క‌న్ను!
Embed widget