TG DEECET 2025: డీఈఈసెట్-2025 నోటిఫికేషన్ విడుదల - దరఖాస్తు, పరీక్ష తేదీల వివరాలు ఇలా
DElEd 2025: తెలంగాణలో డీఎల్ఈడీ, డీపీఎస్‌ఈ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన 'డీఈఈసెట్-2025' (డీఎడ్) నోటిఫికేషన్ వెలువడింది. మార్చి 24 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.

TGDEECET 2025 Notification: తెలంగాణలో ప్రాథమిక ఉపాధ్యాయ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే 'డీఈఈసెట్-2025' (డీఎడ్) నోటిఫికేషన్ మార్చి 22న విడుదలైంది. రెండేళ్ల కాలపరిమతితో ఉండే డీఎల్ఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్), డీపీఎస్‌ఈ (డిప్లొమా ఇన్ ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 24 నుంచి ప్రారంభంకానుంది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు నిర్ణీత దరఖాస్తు ఫీజు చెల్లించి మే 15 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మార్చి 24 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
వివరాలు...
* డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ - 2025 (డీఈఈసెట్-2025)
కోర్సులు..
1) డీఎల్ఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్)
2) డీపీఎస్‌ఈ (డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్)
కోర్సుల వ్యవధి: 2 సంవత్సరాలు.
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
వయోపరిమితి: 17 సంవత్సరాలు నిండి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో మొత్తం 3 విభాగాలు ఉంటాయి. వీటిలో పార్ట్-1: జనరల్ నాలెడ్జ్ & టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు, పార్ట్-2: జనరల్ ఇంగ్లిష్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు, జనరల్ తెలుగు/ఉర్దూ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. ఇక పార్ట్-3లో మ్యాథమెటిక్స్ 20 ప్రశ్నలు-20 మార్కులు, ఫిజికల్ సైన్స్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు, బయోలాజికల్ సైన్స్ నుంచి 10 ప్రశ్నలు-10 మార్కులు, సోషల్ స్టడీస్ నుంచి 20 ప్రశ్నలు-20 మార్కులు ఉంటాయి. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు..
➪ డీఈఈసెట్ 2023 నోటిఫికేషన్: 22.03.2025.
➪ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 24.03.2025.
➪ ఆన్‌లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లించడానికి చివరితేది: 15.05.2025.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

