Weekly Horoscope 24 March to 30 March 2025 : ఈ రాశులవారు జీవితంలో వచ్చే మార్పులు అంగీకరించేందుకు ఈ వారం సిద్ధంగా ఉండండి
Your Weekly Horoscope For March 24 to 30 ,2025 : మార్చి 24 సోమవారం నుంచి మార్చి 30 ఆదివారం వరకూ మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశి వార ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి

Your Weekly Horoscope : మేష రాశివారు మానసికంగా బలంగా ఉండాలి, వృషభ రాశివారు అనారోగ్య సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు, మిథున రాశివారు జీవిత భాగస్వాతో ముఖ్యమైన విషయం గురించి తీవ్రంగా చర్చిస్తారు, కర్కాటక రాశివారు వివిధ రకాల ఆలోచనలకు దూరంగా ఉండడం మంచిది. ఈ వారం మీ రాశి ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి
మేష రాశి (Aries Weekly Horoscope)
ఈ వారం మేష రాశి వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. విద్యార్థులు ఉన్నత విద్యకు అద్భుతమైన అవకాశాలను పొందవచ్చు. ముఖ్యమైన వాణిజ్య ప్రయాణం వారం మధ్యలో చేయాల్సి వస్తుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఉద్యోగం కోసం చూస్తున్న యువత చాలా కష్టపడాలి. ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించకుండా ఉండండి. మానసికంగా బలంగా ఉండాలి, వైద్య విద్యార్థులకు కెరీర్‌లో సమస్యలు ఉండవచ్చు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. మీ జీవితంలో వచ్చే మార్పులను అంగీకరించండి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొత్త ప్రేమ సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. కోపంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ( మేష రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
వృషభ రాశి (Taurus Weekly Horoscope)
వృషభ రాశివారికి ఈవారం ఆదాయం బావుంటుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు బలంగా ఉంటాయి. ఇంటి పెద్దల మద్దతు మీకుంటుంది. లక్ష్యాలను సులభంగా సాధిస్తుంది. మీరు నూతన ఆస్తులు కొనగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీతో ఉండేవారు చాలా సంతోషంగా ఉంటారు. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. కుటుంబ విషయాలను బయటి వ్యక్తులతో పంచుకోవడం మానుకోండి. భవిష్యత్ ప్రణాళికలు పెండింగ్‌లో ఉంటాయి. గొంతు నొప్పి వంటి కొన్ని సమస్యలు ఉండవచ్చు. ఏ విషయానికి కూడా స్నేహితులపై ఎక్కువ ఆధారపడటం సముచితం కాదు. (వృషభ రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
మిథున రాశి (Gemini Weekly Horoscope)
మిథున రాశివారు పాత ప్రణాళికలు తిరిగి అమలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. వ్యాపారంలో లాభదాయక పరిస్థితులుంటాయి. మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం చేసే ప్రదేశంలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. గురువుల మార్గదర్శకత్వం పొందడం ద్వారా మీకు కొత్త దిశ వస్తుంది. ఇంటి బాధ్యతలతో చాలా బిజీగా ఉంటారు. మీ సలహా నుండి ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతారు. వారం ప్రారంభంలో ఏదో విషయం గురించి జీవిత భాగస్వామితో చర్చ ఉంటుంది. పాత రుణాలను తిరిగి చెల్లించడానికి ఒత్తిడి ఉంటుంది. కాలానుగుణ పరిస్థితుల కారణంగా పిల్లలు అనారోగ్యానికి గురవుతారు. డబ్బును వృధా చేయవద్దు. విలువైన వస్తువులను జాగ్రత్తచేయండి. (మిథున రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
కర్కాటక రాశి (Cancer Weekly Horoscope)
ఏప్పటి నుంచో ఆగిపోయిన ప్రాజెక్టులు ఈ వారం తిరిగి ప్రారంభమవుతాయి. ప్రేమికులు వివాహం గురించి ఆలోచిస్తారు. సృజనాత్మక రచనలపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులు ప్రమోషన్ సంబంధిత సమాచారం వింటారు. మీ సామర్థ్యాలను పెంచడానికి ప్రయత్నించండి. మీ సానుకూల స్వభావాన్ని అందరూ ప్రశంసిస్తారు. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. వివిధ రకాల ఆలోచన కారణంగా మీరు మీ పనిపై శ్రద్ధ చూపలేరు. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వవద్దు. వివాదాస్పద కేసులకు దూరంగా ఉండండి. శత్రువులు మిమ్మల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తారు..మీరు అప్రమత్తంగా ఉండండి. అనారోగ్య సమస్యలున్నాయి నిర్లక్ష్యంగా ఉండకండి. (కర్కాటక రాశి ఉగాది 2025 ఫలితాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
గమనిక:జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.





















