RCB beat KKR: బౌలర్లను వాడుకోవడంలో రహానే ఫెయిల్- కోల్‌కతాను దెబ్బతీసిన మూడు కారణాలు ఇవే
RCB beat KKR: ఐపీఎల్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్‌కతా నైట్ రైడర్స్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించింది. మంచి ఆరంభం అందినప్పటికీ కేకేఆర్ ఓటమికి 3 కారణాలు కనిపిస్తున్నాయి.

RCB beat KKR: IPL 2025 తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శుభారంభం చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఓటమితో ప్రారంభించింది. 7 వికెట్ల తేడాతో ఆర్సీబీపై కేకేఆర్ ఓడిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన KKR జట్టుకు మంచి ఆరంభమే లభించింది. కెప్టెన్ అజింక్య రహానే, సునీల్ నరైన్‌తో కలిసి రెండో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ KKR ఫినిషర్లు మాత్రం పేలవమైన ఆటతీరతో రహానే, నరైన్ ఇచ్చిన ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఆర్సీబీ ముందు కేవలం 175 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. ఈలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ తొలి వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. RCB ఇంకా 22 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను ఫినిష్ చేసింది. 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
1- మిడిల్ ఆర్డర్ విఫలమైంది
క్వింటన్ డి కాక్ 4 పరుగులు చేసిన ఔటయ్యాడు. కానీ ఆ తర్వాత కెప్టెన్ అజింక్య రహానే, సునీల్ నరైన్ కలిసి KKRకు గొప్ప ఆరంభాన్ని అందించారు. ఇద్దరూ రెండో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. రహానే 25 బంతుల్లో తన అర్ధ సెంచరీ సాధించాడు. పవర్‌ప్లేలో 16 బంతుల్లో 39 పరుగులు చేశాడు. సునీల్ నరైన్ 44 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే అజింక్య రహానే 56 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడి పెవిలియన్‌కు చేరుకున్నాడు. కానీ దీని తర్వాత KKR మిడిల్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది.
23 కోట్ల 75 లక్షలకు అమ్ముడైన వెంకటేష్ అయ్యర్ (4) ను కృనాల్ పాండ్యాకు చిక్కాడు. రింకు సింగ్ (12), ఆండ్రీ రస్సెల్ (4) వంటి బిగ్ హిట్టర్లు పూర్తిగా ఫెయిల్ అయ్యారు. రస్సెల్‌ను సుయాశ్ శర్మ అవుట్ చేయగా, రింకు సింగ్ ను కృనాల్ బోల్తా కొట్టించాడు. మొదటి 10 ఓవర్లలో 107 పరుగులు చేసిన KKR చివరి 10 ఓవర్లలో 67 పరుగులే రాబట్టంది.
2. ఆండ్రీ రస్సెల్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం
ఆండ్రీ రస్సెల్‌ను బ్యాటింగ్‌లో ముందు పంపించారు. ఇది సరైన నిర్ణయం కాదని ప్రూవ్ అయింది. అతను బిగ్ హిట్టర్ అని, ఓవైపు క్రీజ్‌లో ఉంటే మిగతా బ్యాట్స్‌మెన్‌కు ధైర్యాన్ని ఇస్తుంది. 15 ఓవర్లు ముగిసిన తర్వాత రస్సెల్ వచ్చాడు. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో పెద్ద షాట్ కొట్టడానికి యత్నించి అవుటయ్యాడు. రస్సెల్ ఔట్ తర్వాత వచ్చిన రమణ్‌దీప్ సింగ్‌ను అతని కంటే ముందే పంపించి ఉంటే బాగుండేది. ఒత్తిడిని అతను తట్టుకోలేకపోయాడు.
3. రహానే పేలవమైన కెప్టెన్సీ
అజింక్య రహానే పేలవమైన కెప్టెన్సీ కూడా ఓటమికి పెద్ద కారణమైంది. సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఆడటం విరాట్ కోహ్లీకి ఇబ్బందే. కానీ రహానే స్టార్టింగ్‌లో అతనికి బౌలింగ్ ఇవ్వలేదు. ఫలితంగా RCB ఓపెనర్లు ఇద్దరూ సులభంగా క్రీజ్‌లో నిలదొక్కుకున్నారు. పరుగులు రాబట్టారు. పవర్‌ప్లేలో వికెట్ పడకుండా 80 పరుగులు చేశారు. ఇది లక్ష్యానికి చేరువ చేసింది. పవర్‌ప్లేలో నరైన్‌కు రహానే బౌలింగ్ ఇవ్వలేదు. 8వ ఓవర్‌లో అతనికి మొదటి ఓవర్ ఇచ్చారు. అప్పటికే 7 ఓవర్లలో 86 పరుగులు చేసింది ఆర్సీబీ.
అంతర్జాతీయ క్రికెట్‌లో హర్షిత్ రాణా ప్రదర్శన అద్భుతంగా ఉంది. కానీ పవర్‌ప్లే చివరి ఓవర్‌లో కెప్టెన్ రహానే అతనితో బౌలింగ్ చేయించాడు. హర్షిత్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ ఆ తర్వాత ఓవర్ అతనుకు లభించలేదు. మళ్లీ 13వ ఓవర్‌లో బౌలింగ్ వచ్చింది. అప్పటికే చాలా ఆలస్యమైంది.
మ్యాచ్ ఎక్కడ మలుపు తిరిగింది
ఓటమిపై స్పందించిన అజింక్య రహానే, "మేము 13వ ఓవర్ వరకు బాగా ఆడాం, కానీ 2-3 వికెట్లు మ్యాచ్ గమనాన్ని మార్చాయి. తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్ చాలా ప్రయత్నించారు. కానీ పరుగులు సాధించలేకపోయారు. నేను , వెంకటేష్ అయ్యర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 200-210 మధ్య స్కోరు గురించి ఆలోచించాం. కానీ వికెట్లు వరుసగా పడటం మ్యాచ్ గమనాన్ని మార్చింది." తరువాతి ఓవర్లలో మంచు కురుస్తున్న విషయాన్ని అజింక్య రహానే ప్రస్తావించాడు. పవర్ ప్లేలో RCB బ్యాటింగ్‌ను ప్రశంసించాడు.
RCB తరపున విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అర్ధ సెంచరీలతో అదరగొట్టారు. విరాట్ 59 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడగా, సాల్ట్ 56 పరుగులు చేశాడు. కోల్‌కతా తరపున ముగ్గురు బౌలర్లు మాత్రమే ఒక్కొక్క వికెట్ తీయగలిగారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

