Mobile Tricks to Follow : పోయిన సెల్‌ఫోన్ మళ్లీ దొరకాలంటే ముందే ఈ మూడు సెట్టింగ్స్ మార్చేసుకోండి .. కనిపించకపోయినా ఇలా దొరికేస్తుంది
Recover Your Stolen Mobile : ఫోన్ కనిపించకపోయినా లేదా ఎవరైనా కొట్టేసినా చాలా కంగారు పడిపోతాము. అయితే మీరు ఫోన్లో కొన్ని సెట్టింగ్స్ మార్చుకుంటే మొబైల్ కనిపించకపోయినా ఎలాంటి ప్రాబ్లం ఉండదట.

Settings to Help You Recover Your Stolen Mobile : ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేవరకు దాదాపు అందరూ ఉపయోగించే ఏకైక వస్తువు మొబైల్. పిల్లల నుంచి పెద్దల వరకు వివిధ అవసరాలకోసం, అవసరం లేకపోయినా దీనిని వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ మొబైల్ కాసేపు కనపడకపోయిందంటే ఏమైనా ఉందా? కొంపలు మునిగిపోయినట్టే వెతికేస్తారు. అదే దానిని ఎవరైనా కొట్టేశారు అంటే దానిలో డేటా, ఫోన్ గురించి ఏడుస్తారు. అలా జరగకుండా ఉండాలంటే మీ ఫోన్లో ఈ సెట్టింగ్స్ చేసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
స్విచ్ ఆఫ్ చేయకుండా ఉండాలంటే..
మీ ఫోన్‌ని ఎవరైనా కొట్టేస్తే దానిని ముందు స్విచ్ఆఫ్ చేయడానికి చూస్తారు కాబట్టి.. అలా కాకుండా ఉండాలంటే మీ మొబైల్లో ఈ సెట్టింగ్ మార్చుకోవాలి. అప్పుడు ఫోన్ తీసుకున్నవాళ్లు స్విచ్ ఆఫ్ చేయలేరు. పాస్ వర్డ్ ఉంటేనే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. ఈ సెట్టింగ్ కోసం.. మీ మొబైల్లో సెట్టింగ్స్‌కి(Settings) వెళ్లాలి. దానిలో మోర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీని (More Security and Praivacy) క్లిక్ చేసి.. రిక్వైర్డ్ పాస్వర్డ్ టూ పవర్ ఆఫ్ (Required Password to Power Off) క్లిక్ చేయాలి. అక్కడ పవర్ ఆఫ్ బటన్ (Power Off Button) ఆన్ చేయాలి. ఇలా చేస్తే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేముందు కచ్చితంగా పాస్వర్డ్ అడుగుతుంది.
ఫ్లైట్ మోడ్ చేయకుండా..
ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వట్లేదు కాబట్టి ఫ్లైట్ మోడ్‌లో పెట్టేస్తే ప్రాబ్లమేగా అనుకుంటున్నారా? అలా దొంగ మన మొబైల్‌ని ఫ్లైట్ మోడ్ (Flight Mode)లో పెట్టకుండా ఉండాలనుకుంటే.. కంట్రోల్ సెంటర్ లాక్ (Control Center Lock)చేయాలి. దీనిని ఎలా లాక్ చేయాలంటే సెట్టింగ్స్ (Settings)లోకి వెళ్లాలి. దానిలో నోటిఫికేషన్, స్టేటస్ బార్ని(Notification Status Bar) క్లిక్ చేయాలి. అక్కడ స్టేటస్ బార్లోకి వెళ్లి లాక్ స్క్రీన్ నోటిఫికేషన్(Lock Screen Notification)ను క్లిక్ చేయాలి. స్వైప్ డౌన్ ఆన్ లాక్ స్క్రీన్ టూ వ్యూ నోటిఫికేషన్ డ్రాయర్(Swipe Down Unlock Screen to View Notification Bar)ను బటన్‌ను ఆఫ్ చేయాలి.
ఫోన్‌ను ఎలా దొరికించుకోవాంటే..
ఫోన్‌ను ఎవరైనా కొట్టేసినా లేదా ఎక్కడైనా పెట్టి మరిచిపోయినా మళ్లీ దానిని దొరికించుకోవాలంటే మొబైల్లో ఈ సెట్టింగ్ కచ్చితంగా ఆన్‌లో ఉంచాలి. దానికోసం మొబైల్లో ఫైండ్ మై డివైస్(Find My Device)ను ఆన్ చేసుకోవాలి. మొబైల్లో ఫైండ్ మై డివైస్ ఆన్ చేసి.. దానిలో ఫైండ్ యువర్ ఆఫ్‌లైన్ డివైస్(Find Your Offline Device)ను క్లిక్ చేయాలి. దానిలో విత్ అవుట్ నెట్వర్క్(Withoit Network)ని క్లిక్ చేసి ఫీచర్‌ని ఆన్ చేసుకోవాలి. దీనివల్ల సిమ్ తీసేసినా.. ఫోన్ లొకేషన్ని ట్రాక్ చేయవచ్చు.
ఈ మూడు సెట్టింగ్స్‌ని వెంటనే మీ మొబైల్లో చేయడం వల్ల ఫోన్ పోయినా.. కనిపించకుండా పోయినా కంగారు లేకుండా ఈజీగా దానిని దొరికించుకునే అవకాశముంది. ఎలాగో అన్ని సెట్టింగ్స్ పెట్టాము కదా అని ఫోన్‌ని నెగ్లెక్ట్గా కాకుండా.. సేఫ్టిగా ఉంచుకోవడం మంచిది. లేదంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వట్లేదని, ఫ్లైట్ మోడ్‌లోకి వెళ్లట్లేదని దొంగ ఫోన్‌ని పగలగొట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

