ఛార్జింగ్​ లేదని.. మొబైల్​ని ఛార్జ్​ పెడతారు. కానీ అది ఛార్జ్ అయ్యేలోపే వాడేస్తారు కొందరు.

ఇలా ఛార్జింగ్ పెట్టి సెల్​ఫోన్ ఉపయోగిస్తే జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.

ఇలా మొబైల్ ఛార్జింగ్​లో ఉంచి.. ఫోన్​ వాడితే.. ఓవర్ హీట్ అయిపోతుందంట.

ఇంటర్నల్​ పార్ట్స్, బ్యాటరీ ఓవర్​ హీటై.. బ్యాటరీ లైఫ్​ని తగ్గించేస్తాయట. దీనివల్ల త్వరగా ఛార్జింగ్ అయిపోతుంది.

కొన్ని సందర్భాల్లో షాక్ కొడుతుంది. లేదా మొబైల్​ నుంచి మంటలు వచ్చే అవకాశముంటుంది.

ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ ఉపయోగిస్తే అవి పేలిన ఘటనలు కూడా ఎన్నో చూశాము.

ఛార్జింగ్ పెట్టాలనుకున్నప్పుడు హై క్వాలిటీ ఛార్జర్​ని ఎంచుకోవాలి. ఇతర ఛార్జర్స్ ఫోన్​ లైఫ్​ని పాడు చేస్తాయి.

బ్యాటరీ 20 శాతం అయ్యేవరకు ఉంచకుండా ముందే ఛార్జింగ్ పెట్టుకోవాలి. అలాగే 80 శాతం ఛార్జింగ్ ఉన్నప్పుడు ఆపేయాలి.

ఫోన్ టెంపరేచర్​ని చెక్​ చేసుకోవాలి. ఫోన్​ మరీ వేడి అయిపోతే.. ఛార్జింగ్ ఆపేసి.. కూల్ చేయాలి.

వీటిని ఫాలో అయితే మొబైల్ బ్యాటరీ లైఫ్ మెరుగవుతుంది.