Yellamma : 'ఎల్లమ్మ'కు సాయి పల్లవి హ్యాండ్ ఇచ్చిందా ? - నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన మరో క్రేజీ హీరోయిన్ ఎవరంటే ?
Yellamma : డైరెక్టర్ వేణు యెల్దండి రెండో సినిమా 'ఎల్లమ్మ'లో నితిన్ హీరో, సాయి పల్లవి హీరోయిన్ అన్నారు. దానిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ రాక ముందే ఆమె ఈ మూవీ నుంచి తప్పుకుందనే పుకార్లు విన్పిస్తున్నాయి.

Crazy Buzz On Yeldandi Venu's Yellamma Movie: 'బలగం' సక్సెస్‌తో డైరెక్టర్‌గా మారిన కమెడియన్ వేణు యెల్దండి తన రెండో సినిమాకు సిద్ధమవుతున్నాడు. 'ఎల్లమ్మ' అనే టైటిల్‌తో ఈ సినిమా రూపొందబోతుందని ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే ఈ మూవీ ఇంకా నటీనటుల ఎంపిక దశలోనే ఉంది. గత కొంతకాలం నుంచి ఈ సినిమా నటీనటుల సెలక్షన్, వాళ్లు తప్పుకోవడం అనే అంశం కారణంగా వార్తల్లో నిలుస్తోంది. ఇందులో హీరోయిన్‌గా ఇన్ని రోజులు సాయిపల్లవి పేరు వినిపించగా, తాజాగా ఆమె ఈ మూవీ నుంచి తప్పుకొందనే కొత్త రూమర్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అలాగే ఆమె ప్లేస్‌ని మరో స్టార్ క్రేజీ హీరోయిన్ రీప్లేస్ చేయబోతుందని రూమర్స్ మొదలయ్యాయి.
'ఎల్లమ్మ' నుంచి తప్పుకున్న సాయి పల్లవి
'బలగం' సినిమాతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా సత్తా చాటిన డైరెక్టర్ వేణు యెల్దండి. ఈ మూవీ తర్వాత 'ఎల్లమ్మ' అనే నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను తెరపైకి తీసుకురావడానికి రెడీగా ఉన్నాడు. ఈ సినిమాలో నితిన్ హీరోగా నటిస్తున్నట్టు ఇప్పటికే కన్ఫర్మ్ అయింది. అయితే ఇందులో నితిన్ సరసన సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుందని ఇప్పటివరకూ వార్తలు వచ్చాయి. కథ నచ్చడంతో ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అన్నారు. అయితే మారిన పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు సాయిపల్లవి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొందనే టాక్ నడుస్తోంది.
'ఎల్లమ్మ' మూవీ షూటింగ్ ఈ ఏడాది చివరి నాటికి స్టార్ట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి డేట్స్ క్లాష్ అవుతాయనే కారణంతో ఈ సినిమాకు నో చెప్పినట్టు ప్రచారం జరుగుతోది. దీంతో సాయిపల్లవి ప్లేస్‌ను వేరొక హీరోయిన్ రీప్లేస్ చేస్తుందని అంటున్నారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు కీర్తి సురేష్. డైరెక్టర్ వేణు ఇప్పటికే ఆమెకు స్క్రిప్ట్ చెప్పారని, తన పాత్రను నచ్చడంతో కీర్తి ఈ సినిమా చేయడానికి రెడీ అవుతుందని అంటున్నారు. కానీ అఫీషియల్‌గా ఈ ప్రాజెక్టుకు అసలు కీర్తి సురేష్ సంతకం చేసిందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియ రాలేదు.
హీరోయిన్ మాత్రమే కాదు హీరోకి ఇదే పరిస్థితి
నిజానికి ముందుగా ఈ సినిమాలో హీరోగా అనుకున్నది నితిన్‌ను కాదు. 'బలగం' మూవీ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత వేణు నేచురల్ స్టార్ నానితో 'ఎల్లమ్మ' మూవీని చేయడానికి రెడీ అయ్యాడు. కానీ సడన్‌గా నాని ఈ ప్రాజెక్ట్‌ని పక్కన పెట్టాడు. ఎట్టకేలకు అఫీషియల్‌గా నితిన్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడని కన్ఫామ్ చేశారు డైరెక్టర్ హరీష్ శంకర్. అలా నాని ప్లేస్‌ని నితిన్ రీప్లేస్ చేస్తే, సాయిపల్లవి ప్లేస్‌ని కీర్తి సురేష్ రీప్లేస్ చేస్తుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తేనే గానీ నటీనటుల విషయంపై ఒక క్లారిటీ రాదు. ఇక సాయిపల్లవి పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు నాని లైనప్‌లోనూ క్రేజీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇక నితిన్ 'రాబిన్ హుడ్'తో మార్చి 28న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

