By: Arun Kumar Veera | Updated at : 21 Mar 2025 11:11 AM (IST)
అభిప్రాయం వెల్లడించిన IRDAI ( Image Source : Other )
GST Relief On Health Insurance: ఆరోగ్య బీమా ప్రీమియం & జీవిత బీమా ప్రీమియంపై వస్తు & సేవల పన్ను (Goods and Services Tax) తగ్గించడంపై, 'బీమా నియంత్రణ & అభివృద్ధి ప్రాధికార సంస్థ' (IRDAI) తన అభిప్రాయాన్ని వెల్లడించింది. దీనికి సంబంధించి, బిహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి నేతృత్వంలోని మంత్రుల బృందం (GoM) ఈ ఏడాది ఏప్రిల్‌లో సమావేశం అయ్యే అవకాశం ఉంది. జాతీయ మీడియా నివేదికల ప్రకారం, మే నెలలో జరిగే కౌన్సిల్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవచ్చు.
ఏప్రిల్ నెలలో GoM సమావేశం
జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీని తగ్గించే విషయంలో ఐఆర్‌డీఏఐ కూడా తన అభిప్రాయాన్ని తెలియజేసిందని ఒక అధికారి చెప్పారు. దీంతో, ఇప్పుడు, ఐఆర్‌డీఏఐ కూడా ఈ చర్చలో చేరింది. దీనిపై, వచ్చే నెలలో మంత్రుల బృందం సమావేశం జరగవచ్చు. ఆ తరువాత, GoM తన నివేదికను GST కౌన్సిల్ (GST Council)కు సమర్పిస్తుంది. జీఎస్టీ కౌన్సిల్ తన తదుపరి సమావేశంలో జీవిత బీమా & ఆరోగ్య బీమాపై జీఎస్టీపై ఉపశమనం కల్పించవచ్చు.
జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశం (Next meeting of GST Council) ఏప్రిల్ నెల చివరిలో లేదా మే నెల ప్రారంభంలో జరుగుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లపై 18 శాతం పన్నును పూర్తిగా రద్దు చేయడంపై రాష్ట్రాలు ఇప్పటికే ఒప్పుకున్నాయి. అయితే, ఐఆర్‌డీఏఐ ఎటువంటి వ్యాఖ్య చేయకపోవడంతో ఈ నిర్ణయంపై ఇప్పటి వరకు ఏకాభిప్రాయం రాలేదు.
త్వరలోనే తుది రూపం
జీవిత బీమా, ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీని తగ్గించే మొత్తం చర్చలో IRDAI ని చేర్చడం చాలా ముఖ్యమైన అడుగు అని ఆ అధికారి చెప్పారు. తద్వారా, ఈ అంశంపై వారి నుంచి ఎలాంటి అభిప్రాయం తీసుకోలేదన్న ఆరోపణ రాకుండా ఉంటుందని వెల్లడించారు. IRDAI అభిప్రాయాలను సమీక్షించిన తర్వాత, సామ్రాట్ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రుల బృందం తన నివేదికకు తుది రూపం ఇస్తుంది & ఆ రిపోర్ట్‌ను జీఎస్‌టీ కౌన్సిల్‌కు సమర్పిస్తుంది.
జీఎస్టీ కౌన్సిల్ గత సమావేశం 2024 డిసెంబర్ 21న జరిగింది. ఆరోగ్య బీమా, జీవిత బీమా ప్రీమియంలపై జీఎస్టీ మినహాయింపు లేదా తగ్గింపు నిర్ణయం ఆ సమావేశంలోనే చర్చకు వస్తుందని అంతా భావించారు. అయితే, బీమా రంగ నియంత్రణ సంస్థ (IRDAI) నుంచి తదుపరి సమాచారం తీసుకోవడం కోసం ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు.
సుదీర్ఘకాల డిమాండ్
జీవిత బీమా, ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రీమియం ధరలు తగ్గి అవి ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తాయి. బీమా రంగం కూడా విస్త్రతమవుతుంది, అభివృద్ధి చెందుతుంది. కాబట్టి, జీవిత బీమా, ఆరోగ్య బీమాపై జీఎస్టీ మినహాయింపు లేదా తగ్గింపు కోసం పరిశ్రమ వర్గాలు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి.
GoM సభ్యులు
13 మంది సభ్యుల మంత్రుల బృందంలో.. ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా, పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య, కేరళ ఆర్థిక మంత్రి కేఎన్ బాలగోపాల్, రాజస్థాన్ ఆరోగ్య మంత్రి గజేంద్ర సింగ్, కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరే గౌడ, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సహా మరికొందరు ఉన్నారు.
Gold-Silver Prices Today 21 Mar: భారీగా పతనమైన పసిడి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
ITR filing: ఐటీఆర్ ఫైల్ చేసినవాళ్లు 9 కోట్ల మంది - కోటీశ్వరుల సంఖ్య తెలిస్తే ఆశ్చర్యపోతారు
Growth Stocks: గ్రోత్ స్టాక్స్‌ను ఎలా కనిపెట్టాలి?, ఈ విషయాలు తెలిస్తే మీ పెట్టుబడి పరిగెడుతుంది!
TDS New Rules: ఏప్రిల్ నుంచి కొత్త టీడీఎస్ రూల్స్, తగ్గనున్న పన్నుల మోత - ఏ విషయాలు మారతాయి?
Gold-Silver Prices Today 20 Mar: 10 గ్రాములు కొనేందుకు 1000 సార్లు ఆలోచించాలి- ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Pawan Kalyan: చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
Chandrababu Visits Tirumala: దేవాన్ష్ బర్త్‌డే- కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు
Hyderabad Metro Rail: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసుల ఎఫెక్ట్, హైదరాబాద్ మెట్రో ఎండీ కీలక నిర్ణయం
Ram Charan: రామ్ చరణ్ 'పెద్ది' రిలీజ్ డేట్ ఫిక్స్... నెక్స్ట్ ఇయర్ పుట్టినరోజుకు స్పెషల్ గిఫ్ట్!