Rajahmundry Crime News: ప్రాణం తీసిన అనుమానపు ప్రేమ- రాజమండ్రిలో సంచలనం సృష్టించిన తల్లీకూతుళ్ల హత్య
Rajahmundry Crime News: రాజమహేంద్రవరంలో సంచలనం రేకెత్తించిన తల్లి కూతుర్ల హత్యోదంతం కూతురు ప్రియుని అనుమానం తోటే జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Rajahmundry Crime News: రాజమహేంద్రవరంలో తల్లి కూతుళ్ల హత్య సంచలనం సృష్టించింది. పోలీసుల దర్యాప్తులో అసలు వాస్తవాలు బయటపడ్డాయి. ఒక లైట్ బాయ్ ప్రేమలో పడిన బాలిక చివరకు అతని చేతిలోనే తల్లితోపాటు హత్యకు గురైంది.
మూడేళ్ల కిందట భర్త మృతి చెందాడు. ఒక్కగానొక్క కుమార్తెతో జీవనం ఎలారా భగవంతుడా అని తల్లి బాధపడింది. కానీ కుమార్తె ఆ కుటుంబానికి ఆసరా అయింది. చిన్న వయసులోనే కుటుంబ బాధ్యత భుజాన వేసుకుంది. పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ కుటుంబానికి అండగా నిలిచింది.
సాఫీగా సాగుతున్న లైఫ్‌లో ప్రేమ అనే వైరస్ చేరింది. అనుకోకుండా ఓ లైట్ బాయ్ ప్రేమలో బాలిక పడింది. అదే తన ప్రాణాల మీదకు తెస్తుందని ఊహించలేకపోయింది. ప్రియుడి చేతిలో బాలిక, ఆమె తల్లి ఇద్దరూ హత్యకు గురయ్యారు. రాజమహేంద్రవరం శివారులో ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈవెంట్లో యాంకర్ గా పనిచేస్తూ తల్లికి అండగా...
బొమ్మూరు సీఐ కాశీ విశ్వనాథం వివరాల మేరకు.. ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం కూడలి వెనక మసీదు వీధికి చెందిన అబ్దుల్ మజీదుకు ఇద్దరు భార్యలు. మజీద్, రెండో భార్య ఎండీ సాల్మ (38) దంపతులకు సామ్య అలియాస్ సన(16) కుమార్తె. మజీద్ మొదటి భార్య ముగ్గురు కుమారులు రాజమహేంద్రవరంలో స్థిరపడ్డారు. మూడేళ్ల కిందట మజీద్ అనారోగ్యంతో మృతి చెందారు. నాటి నుంచి సన యాంకరింగ్ చేస్తూ తల్లితో జీవిస్తుంది.
కాలయముడిగా మారిన ప్రియుడు...
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కొత్తవీధికి చెందిన పిల్లా శివకుమార్ ఈమెకు పరిచయమయ్యాడు. హైదరాబాద్‌లో సినిమాల్లో లైట్ బాయ్‌గా చేస్తుంటాడు. ఆరు నెలల కిందట సామర్లకోట వద్ద జరిగిన ఓ ఈవెంట్‌లో సనకు పరిచయమయ్యాడు. అది ప్రేమగా మారింది. సాల్మ కుటుంబం కొద్ది నెలల క్రితం రాజమహేంద్రవరం వచ్చేశారు. హుకుంపేట పంచాయతీ పరిధిలోని డీబ్లాక్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. మొదటి భార్య కుమారుల్లోని మూడోవాడు ఉమర్ చిన్నమ్మ ఇంట్లోనే ఎక్కువగా ఉండేవాడు.
రాజమండ్రి వచ్చినప్పటి నుంచి సనపై శివకు అనుమానం మొదలైంది. తనతో కాకుండా మరో వ్యక్తితో ఫోనులో మాట్లాడతోందని నిత్యం శివ ఘర్షణ పడేవాడు. నాలుగు రోజుల కిందట సన ఇంటికి వచ్చి అక్కడే ఉన్నాడు. శనివారం రాత్రి శివ, సన మధ్య గొడవ జరిగింది. ఉమర్ సర్దిచెప్పి వెళ్లిపోయాడు.
తిరిగి ఆదివారం మధ్యాహ్నం ఉమర్ చిన్నమ్మ ఇంటికి వచ్చాడు. డోర్లు తీనే ఉన్నాయి. ఇంట్లోకి వచ్చిన ఉమర్ షాక్ తిన్నాడు. సన, ఆమె తల్లి రక్తపు మడుగులో పడి ఉన్నారు. స్థానికుల సహాయంతో పరిశీలిస్తే వాళ్లిద్దరూ చనిపోయారు.
ప్రియుడే ఈ హత్యలు చేసినట్లుగా పోలీసులు గుర్తించి, కేసు నమోదు చేశారు. నిందితుడిని కొవ్వూరు రోడ్డు-రైలు వంతెన సమీప ముళ్లపొదల్లో గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

