అన్వేషించండి

Hyderabad Crime News: ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం, భయంతో కిందకి దూకేసిన బాధితురాలు

Hyderabad MMTS Train | హైదరాబాద్‌లో దారుణం జరిగింది. ఎంఎంటీఎస్ రైలులో ఒంటరిగా కనిపించిన యువతిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు ఆమె రైలు నుంచి దూకేసింది.

Hyderabad News | హైదరాబాద్‌: మహిళలకు పబ్లిక్ ప్లేస్ లో కూడా రక్షణ లేకుండా పోతోంది. వారిపై ఎక్కడపడితే అక్కడ దాడులు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌‌లో దారుణం చోటుచేసుకుంది. ఎంఎంటీఎస్‌ రైలు (Hyderabad MMTS Train)లో యువతిపై అత్యాచారయత్నం జరిగింది. నిందితుడ్ని ప్రతిఘటించిన యువతి, అతడి బారి నుంచి తప్పించుకునే క్రమంలో కదులుతున్న ఎంఎంటీఎస్ రైలు నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో బాధితురాలికి గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు.

సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన 23 ఏళ్ల యువతి జాబ్ కోసం హైదరాబాద్ వచ్చింది. ఆమె మేడ్చల్ లోని ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. తన సెల్ ఫోన్ పాడవడంతో, రిపేర్ చేయించడానికి సికింద్రాబాద్‌కు వెళ్ళింది. రిపేర్ పని పూర్తవడంతో యువతి సికింద్రాబాద్ నుంచి ఎంఎంటీఎస్ రైల్లో మేడ్చల్ కు బయలుదేరింది. ఆ యువతి మహిళల కోచ్‌లోనే ఎక్కి ప్రయాణించగా.. అల్వాల్ స్టేషన్ రావడంతో అందులో ఉన్న ఇద్దరు మహిళలు దిగిపోయారు. అదే బోగిలోకి ఎక్కిన 25 ఏళ్ల యువకుడు ఆమెపై ఒంటరిగా ఉండటం అదనుగా భావించి లైంగిక దాడికి ప్రయత్నించాడు. తనపై యువకుడు అత్యాచారయత్నం చేయడంతో ప్రతిఘటించిన బాధితురాలు తప్పించుకునేందుకు రైలు నుంచి దూకేసింది. కొంపల్లి సమీపంలోని రైలు బ్రిడ్జి వద్ద కిందపడిన యువతీకి గాయాలు కాగా చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలను అడిగి నిందితుడు గురించి వివరాలు ఆరా తీశారు. నిందితుడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Hyderabad Crime News: పెళ్లిబట్టలతో హోటల్ రూంలో యువకుడు ఆత్మహత్య.. లవర్ వచ్చేలోపే విషాదం- కేపీహెచ్‌బీలో ఘటన
పెళ్లిబట్టలతో హోటల్ రూంలో యువకుడు ఆత్మహత్య.. లవర్ వచ్చేలోపే విషాదం- కేపీహెచ్‌బీలో ఘటన
Hyderabad Drugs Party: హైదరాబాద్ రిసార్ట్‌లో పార్టీ.. డ్రగ్స్ టెస్టులో బాలీవుడ్ నటుడు, ఓ జంటకు పాజిటివ్
హైదరాబాద్ రిసార్ట్‌లో పార్టీ.. డ్రగ్స్ టెస్టులో బాలీవుడ్ నటుడు, ఓ జంటకు పాజిటివ్
Hyderabad Crime News: ఫేస్‌బుక్‌లో పరిచయంతో హైదరాబాద్ టెకీ నుంచి రూ.2.36 కోట్లు కొట్టేసిన కిలేడీ!
ఫేస్‌బుక్‌లో పరిచయంతో హైదరాబాద్ టెకీ నుంచి రూ.2.36 కోట్లు కొట్టేసిన కిలేడీ!

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Sathankulam Custodial Deaths Case: మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
మధురై జిల్లా కోర్టు సంచలన తీర్పు - 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఏం చేశారంటే ?
Hardik Pandya Returns: ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్  - రాజస్థాన్ రాయల్స్‌తో బిగ్ ఫైట్ కు రెడీ!
Car Maintenance Guide: తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
తక్కువ పెట్రోల్, డీజిల్‌తో వాహనాన్ని ఎలా నడపాలి? పాటించాల్సిన చిట్కాలు ఏంటీ?
Organ Transplant Green Channel: ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
ప్రాణం కాపాడేందుకు ఒక్కటైన జనం, పోలీసులు - గ్రీన్ చానల్ ద్వారా ఆస్పత్రి ఆర్గాన్ తరలింపు
Car SafetyTips in Summer : ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
ఎండకాలంలో కారులో ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి.. ఏమరుపాటుగా ఉంటే కారు పేలిపోయే ప్రమాదం!
Embed widget