Double Murder Case: రాజమండ్రిలో తల్లీకూతుళ్ల దారుణహత్య, వేరొకరితో ఛాటింగ్ చేస్తున్నట్ల గమనించడంతో ఘాతుకం
East Godavari Crime News | రాజమండ్రిలో తల్లీకూతుళ్లు దారుణహత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపుతోంది. తనను ప్రేమించి వేరొకరితో ఛాటింగ్ చేస్తుందని గమనించి, గొడవకు దిగి హత్య చేశాడు.

Andhra Pradesh Crime News | తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో దారుణం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరంలోని హుకుంపేట వాంబే కాలనీలో తల్లి కూతుర్లు దారుణ హత్యకు గురయ్యారు. తల్లితో ప్రేమలో ఉన్న వ్యక్తే ఆ ఇద్దర్నీ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
ఏలూరుకు చెందిన ఎండి సల్మా వయసు 38 ఏళ్ళు కాగా ఆమెకు 16 ఏళ్ల కూతురు సానియా ఉంది. వీరికి హైదరాబాద్ కు చెందిన పల్లి శివకుమార్తో ఒక ఈవెంట్లో పరిచయం ఏర్పడింది. గతంలో ఓసారి వచ్చి సల్మాను కలిసి వెళ్లాడు. గత కొన్ని రోజుల నుంచి తనతో ఛాటింగ్ చేయడం లేదని అనుమానంతో మరోసారి కలిసేందుకు వచ్చాడని తెలుస్తోంది. ఈ క్రమంలో మరో వ్యక్తితో చాటింగ్ చేయడాన్ని గుర్తించిన నిందితుడు శివకుమార్ తట్టుకోలేకపోయాడు. అసలు ఏం జరుగుతుంది అంటూ తల్లి కూతుర్లతో గొడవపడ్డాడు. మాట మాట పెరగడంతో తీవ్ర ఆవేశానికి లోనైన శివకుమార్ సల్మాతో పాటు అడ్డు వచ్చిన ఆమె కూతురు సానియాను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తనకేమీ తెలియదన్నట్లు ఇంటి తలుపు వేసి వెళ్ళిపోయాడు.
ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఇంటికి వచ్చి బంధువులు తలుపు తట్టారు. లోపల నుంచి ఎవరు స్పందించకపోవడంతో కిటికీలోంచి చూడగా ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. బంధువుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఎస్పీ నరసింహ, ఏఎస్పి సుబ్బరాజు, డిఎస్పి విద్య, బొమ్మూరు సిఐ క్లూస్ టీం తో వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడికి సల్మాతో ప్రేమలో ఉన్నాడని, తనతో కొన్ని రోజుల నుంచి తనను దూరం పెట్టడంతో వచ్చి గొడవకు దిగి ఇద్దర్నీ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు





















