Hyderabad Crime News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, మాయమాటలతో రప్పించి ఓయో రూములో ఇద్దరు బాలికలపై అత్యాచారం
Instagram Love | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిన బాలికలను మాయమాటలతో రప్పించి ఓయో లాడ్జిలో వారిపై అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

Hyderabad Crime News | హైదారాబాద్: సోషల్ మీడియా ద్వారా పరిచయమైన బాలికలకు మాయమాటలు చెప్పి వారిపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువకులు పిలిచారని బాలికలు ఓయో రూంకి వెళ్ళినట్టు పోలీసులు గుర్తించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఈ ఘటనలు జరిగాయి. కిడ్నాప్ సహా పోక్సో చట్టం కింద యువకులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
అసలు ఏం జరిగిందంటే..
మేడ్చల్ జిల్లా అల్వాల్ లోని ఈసీఐఎల్ ప్రాంతానికి చెందిన కర్నాటి మోహన్ చందు (28), దమ్మాయిగూడకు చెందిన ఆకుల సాత్విక్ (26) ఫ్రెండ్స్. వీరిద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వీరికి మచ్చ బొల్లారానికి చెందిన ఇద్దరు బాలికలతో పరిచయం ఏర్పడింది. ఆ బాలికలు 8వ తరగతి వరకు చదివి, చదువు మధ్యలోనే ఆపేశారు. గత కొన్ని నెలల నుంచి సాత్విక్, మోహన్ చెందులతో ఈ బాలికలు ఇన్‌స్ట్రామ్‌లో చాటింగ్ చేస్తున్నారు.
నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఎంతగానో ప్రేమిస్తున్నానంటూ మాలికలకు మాయ మాటలు చెప్పారు. వారి మాటలు నిజమని నమ్మిన బాలికలు యువకులను కలిసేందుకు బుధవారం నాడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లారు. రాత్రి అయినా కుమార్తెలు ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన బాలికల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మిస్సింగ్ కేసు ఫిర్యాదు చేశారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీలు పరిశీలించగా బాలికలు ఈసీఐఎల్ లోని ఓయో లాడ్జి రూముకు వెళ్లి గడిపినట్ల గుర్తించారు. ఓయోకు రూముకు వచ్చిన బాలికలపై ఆ యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్ కి తరలించారు.
యువకులపై బాలికల కిడ్నాప్ తో పాటు మైనర్లు కావడంతో పోక్సో చట్టం () కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఓయో లాడ్జికి వెళ్లిన ఇద్దరు బాలికలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలికలను ఓయో లాడ్జిలోకి అనుమతించిన నిర్వాహకులపై సైతం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఓయూ రూంలోకి మైనర్ బాలికలను అనుమతిస్తే లాడ్జి నిర్వాహకులు సైతం కేసుల్లో ఇరుక్కుంటారని పోలీసులు హెచ్చరించారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో రావడం లాంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే బాలికలను ఓయో లాడ్జిలోకి అనుమతించాలని సూచించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

