IND vs NZ 3rd ODI: మూడో వన్డేలో న్యూజిలాండ్ రికార్డ్ స్కోర్.. టీమిండియా బ్యాటర్లు ఛేజ్ చేస్తారా?
India vs New zealand 3rd ODI | భారత్ vs న్యూజిలాండ్ 3వ వన్డేలో పర్యాటక జట్టు న్యూజిలాండ్ 337 పరుగులు చేసింది. ఇండోర్ హోల్కర్ స్టేడియంలో విదేశీ జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇది.

IND vs NZ 3rd ODI: ఇండోర్: సిరీస్ ఫలితం తేల్చే కీలకమైన మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 337 పరుగులు చేసింది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో విదేశీ జట్టు చేసిన అత్యధిక వన్డే స్కోరు ఇది. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుత సెంచరీలతో కివీస్ భారీ స్కోరు సాధించింది. గత వన్డే సెంచరీ హీరో డారిల్ మిచెల్ తాజాగా 137 పరుగుల శతక ఇన్నింగ్స్ ఆడాడు. సిరీస్‌లో అతనికిది రెండవ వరుస సెంచరీ.
రెండో వన్డే మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసిన విల్ యంగ్ ఈసారి విఫలమయ్యాడు. 30 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అయితే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ 219 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పి న్యూజిలాండ్ జట్టు స్కోరును 300 దాటించారు. మిచెల్ 137 పరుగులు చేయగా, ఫిలిప్స్ వేగంగా ఆడుతూ పరుగులు సాధించాడు. 83 బంతుల్లోనే సెంచరీ చేసిన ఫిలిప్స్ కెరీర్ లో ఇది రెండో శతకం. ఫిలిప్స్ 106 పరుగులు చేసి అర్షదీప్ బౌలింగ్ లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఇండోర్‌లో అత్యధిక వన్డే స్కోరు (విదేశీ జట్టు)
ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో అత్యధిక వన్డే స్కోరు సాధించిన జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. గతంలో హోల్కర్ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన విదేశీ జట్టుగా న్యూజిలాండ్ రికార్డు సృష్టించింది, 2023లో భారత్‌పై 295 పరుగులు చేసింది. అయితే, కివీస్ ఇప్పుడు తమ సొంత రికార్డును మెరుగుపరుచుకుంది, ఇక్కడ భారీ 337 పరుగులు చేయడం ద్వారా చరిత్ర సృష్టించింది.
Innings Break!
— BCCI (@BCCI) January 18, 2026
New Zealand post a formidable total of 337/8 in the series decider.#TeamIndia chase coming up shortly. Stay tuned!
Scorecard - https://t.co/Zm5KbOqvpl #TeamIndia #INDvNZ #3rdODI @IDFCfirstbank pic.twitter.com/bz6Zdlcqsw
337 పరుగులు - న్యూజిలాండ్ vs. ఇండియా (ప్రస్తుత మ్యాచ్)
295 పరుగులు - న్యూజిలాండ్ vs. ఇండియా (2023)
293 పరుగులు - ఆస్ట్రేలియా vs. ఇండియా (2017)
288 పరుగులు - ఇంగ్లాండ్ vs. ఇండియా (2006)
265 పరుగులు - వెస్టిండీస్ vs. ఇండియా (2011)
చెరో 3 వికెట్లు తీసిన అర్షదీప్, హర్షిత్ రానా
మూడో వన్డేలో జట్టులోకి వచ్చిన పేసర్ అర్షదీప్ సింగ్ 10 ఓవర్లలో 63 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో కుల్దీప్ యాదవ్ 82 పరుగులు ఇచ్చాడు. ఇండోర్‌లో అతని ప్రదర్శనలో ఎటువంటి మెరుగుదల లేదు. ఆరు ఓవర్లలో 48 పరుగులు ఇచ్చాడు. అతడి బౌలింగ్ లో కివీస్ బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడుతూ బౌండరీలు సాధించారు. హర్షిత్ రాణా ఎప్పటిలాగే కొత్త బంతితో అద్భుతంగా రాణించాడు, డెవాన్ కాన్వే, విల్ యంగ్ వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో హర్షిత్ రానా మొత్తం 3 వికెట్లు పడగొట్టాడు, కానీ 10 ఓవర్లలో 84 పరుగులు ఇచ్చాడు. భారతదేశం తరపున 6 కంటే తక్కువ ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చిన ఏకైక బౌలర్ మహమ్మద్ సిరాజ్. అతను 10 ఓవర్లలో కేవలం 43 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.
భారత జట్టు వన్డేలో 362 పరుగులు చేసి ఒక మ్యాచ్ గెలిచింది. 2013లో ఆస్ట్రేలియాపై ఇండియా ఈ ఘనతను సాధించింది. ఆ సమయంలో, భారత జట్టు 43.3 ఓవర్లలో 362 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది. భారత జట్టు ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 356 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసి నెగ్గింది. 2017లో, ఈ మ్యాచ్‌లో భారత్ 11 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.





















