LIC Health Insurance: హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు విసిగిస్తున్నాయా? ఎల్‌ఐసీ నుంచి హెల్త్ పాలసీ కొనొచ్చు!
LIC To Acquire Stake: ఆరోగ్య బీమా రంగంలో LIC ఆధిపత్యం చెలాయించే రోజు రాబోతోంది. ఒక స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థలో ఈ ప్రభుత్వ రంగం కంపెనీ వాటా కొనుగోలు చేయవచ్చు.

LIC To Enter In To Health Insurance Sector: మన దేశంలో, ప్రస్తుతం, ఆరోగ్య బీమా రంగంలో ప్రైవేట్ కంపెనీలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అడ్డగోలు నిబంధనలు చూపుతూ, క్లెయిమ్‌ల విషయంలో వినియోదార్లకు చుక్కలు చూపిస్తున్నాయి. జీవిత బీమా రంగం లీడర్ పొజిషన్‌లో ఉన్న ప్రభుత్వం రంగ సంస్థ "లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా" (Life Insurance Corporation of India), ఆరోగ్య బీమా రంగంలోకి కూడా అడుగు పెట్టేందుకు సన్నాహాల్లో ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ సెక్టార్‌లోనూ తన పరిధిని విస్తరించడానికి ఒక స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థలో 'కీలక' వాటా కొనుగోలు చేయడానికి చర్చలు చివరి దశలో ఉన్నాయని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. అయితే, ఈ వాటా మెజారిటీ వాటా కాదు.
LIC ఏం చెప్పింది?
స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థలో వాటా కొనుగోలు కోసం జరుగుతున్న చర్చలు త్వరలో ఓ కొలిక్కి వస్తాయని, ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ ఒప్పందం ప్రకటిస్తామని LIC మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ((MD & CEO) సిద్ధార్థ్ మొహంతి ఒక కార్యక్రమంలో చెప్పారు. ఇంకా ఎటువంటి బైండింగ్ అగ్రిమెంట్ కుదరలేదని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం LIC డైరెక్టర్ల బోర్డు ఆమోదం, బీమా రంగ నియంత్రణ సంస్థ ఆమోదం, వాటాదార్ల ఆమోదం సహా ఇతర ఆమోదాలపై ఆధారపడి ఉంటుంది.
LIC ఏ కంపెనీలో వాటా కొనబోతోందో, ఆ కంపెనీ పేరును మొహంతి కంపెనీ పేరును వెల్లడించలేదు. అయితే, ఏ కంపెనీలోనూ 51 శాతం కంటే ఎక్కువ వాటాను కొనుగోలు చేయదని స్పష్టం చేశారు.
"మా దగ్గర నిర్దిష్ట ప్రణాళికలు ఉన్నాయి. చర్చలు చివరి దశలో ఉన్నాయి. ఆరోగ్య బీమా రంగంలోకి ప్రవేశించడం LICకి సహజమైన అడుగు. నియంత్రణ సంస్థ ఆమోదం పొందడానికి సమయం పడుతుంది కాబట్టి, ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి నిర్ణయం తీసుకోవచ్చని ఆశిస్తున్నా" - సిద్ధార్థ్ మొహంతి
ప్రస్తుతం, మన దేశంలో ఏడు స్వతంత్ర ఆరోగ్య బీమా సంస్థలు ఉన్నాయి. అవి:
-- స్టార్ హెల్త్ & అలైడ్ ఇన్సూరెన్స్
-- నివ బూప ఆరోగ్య బీమా
-- కేర్ హెల్త్ ఇన్సూరెన్స్
-- ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సూరెన్స్
-- మణిపాల్ సిగ్నా ఆరోగ్య బీమా
-- నారాయణ హెల్త్ ఇన్సూరెన్స్
-- గెలాక్సీ హెల్త్ ఇన్సూరెన్స్
100 సంవత్సరాల బాండ్లకు ఆర్‌బీఐ అనుమతి కోరిన ఎల్‌ఐసీ
100 సంవత్సరాల కాల పరిమితి బాండ్లు సహా అదనపు దీర్ఘకాలిక బాండ్లను జారీ చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ను ఎల్ఐసీ కోరిందని మొహంతి తెలిపారు. 2023 నవంబర్‌లో, RBI, 50 సంవత్సరాల బాండ్‌ను జారీ చేసింది. దీనికి బీమా సంస్థలు, పెన్షన్ ఫండ్స్ నుంచి మంచి ప్రతిస్పందన వచ్చింది.
భారత్‌లో ఆరోగ్య బీమా రంగం పరిస్థితి
ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, 2021లో, భారతదేశంలో దాదాపు 514 మిలియన్ల మంది ప్రజలు ఆరోగ్య బీమా పరిధిలోకి వచ్చారు. ఇది దేశ జనాభాలో కేవలం 37 శాతం మాత్రమే. అదే సమయంలో, దాదాపు 400 మిలియన్ల మందికి ఎటువంటి ఆరోగ్య బీమా సౌకర్యం లేదు. మొత్తం జనాభాలో 70 శాతం మంది ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆరోగ్య బీమా పరిధిలో ఉన్నారు. మిగిలిన 30 శాతం మందికి ఎలాంటి ఆరోగ్య బీమా లేదు.
2021లో భారతీయ ఆరోగ్య బీమా పరిశ్రమ గ్రాస్ రిటెన్ ప్రీమియం రూ. 637 బిలియన్లకు పైగా ఉంది. రాష్ట్రాల విషయానికొస్తే... మహారాష్ట్ర 32 శాతం వాటాతో రూ. 183 బిలియన్ల ప్రీమియంతో అగ్రస్థానంలో ఉంది. 2022-23 ఆర్థిక సర్వే ప్రకారం, భారత ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణపై చేస్తున్న వ్యయం GDPలో 2.1 శాతం. 2019లో, మొత్తం ఆరోగ్య సంరక్షణ ఖర్చుల్లో 48 శాతం ప్రజల జేబుల నుంచి చెల్లింపులు జరిగాయి. 2014లో 64.2 శాతం నుంచి ఇది తగ్గింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

