అన్వేషించండి
Union Budget 2025: కొత్త ట్యాక్స్ స్లాబ్స్ నుంచి డిడక్షన్స్ వరకు.. కొత్త ట్యాక్స్ విధానాన్ని ఇలా మార్చే ఛాన్స్ ఉంది
ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వచ్చే ఆర్థిక సంవత్సరానికిగానూ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. పన్ను చెల్లింపుదారులు తమకు ఏ ఊరట కలిగిస్తారోనని కేంద్ర బడ్జెట్ 2025పై కొండంత ఆశలు పెట్టుకున్నారు.

ట్యాక్స్ స్లాబ్స్ నుంచి డిడక్షన్స్ వరకు.. కొత్త ట్యాక్స్ విధానాన్ని ఇలా మార్చే ఛాన్స్ ఉంది
1/6

2020 నుంచి అత్యధిక ఆదాయపు పన్ను పరిమితి 30 శాతం ఏ మాత్రం మారలేదు. అదే సమయంలో ద్రవ్యోల్బణ సూచిక 21 శాతానికి పెరిగిపోవడం కలవరపెడుతోంది. దాంతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌లో ఏమైనా మార్పులు చేస్తారా అని ట్యాక్స్ పేయర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
2/6

30 శాతం విధించే ట్యాక్స్ స్లాబ్ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 15 లక్షల పరిమితి నుంచి రూ. 18 లక్షలకు పెంచడం ద్వారా అత్యధిక పన్ను స్లాబ్ నుంచి కొంతమేర ఊరట కలగనుందని భావిస్తున్నారు.
3/6

పన్ను రహిత ఆదాయ (Tax Free Income) పరిమితులను పెంచడం ద్వారా అధిక ఆదాయం, ఎక్కువ పన్ను చెల్లించే వారిపై మరింత బారం పడనుంది. అందువల్ల ట్యాక్స్ తగ్గించుకునేందకు స్లాబ్ లలో కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
4/6

కేంద్రం తీసుకొచ్చిన కొత్త పన్ను విధానం (New Tax Regime)లో పన్ను స్లాబ్‌లతో పాటు, కొన్ని ట్యాక్స్ డిడక్షన్స్ చేర్చాలని ట్యాక్స్ పేయర్లు ఆశిస్తున్నారు. కేంద్రం తీసుకునే నిర్నయాలతో లక్షల కుటుంబాలపై మరింత ఆర్థిక బారం పడి ఇబ్బందులకు గురవుతారు.
5/6

దాదాపు రూ. 15 లక్షల వరకు ఫ్లాట్ డిడక్షన్ విధించాలని ట్యాక్స్ పేయర్లు భావిస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం మిడిల్ క్లాస్, అత్యధిక ఆధాయ వర్గాల వారికి సైతం కాస్త ఊరట కలగనుంది. దాంతో సేవింగ్స్ లేక పెట్టుబడులకు ఆ నగదు మళ్లిస్తే మార్కెట్లోకి రానుంది.
6/6

కేంద్ర ఆర్థిక శాఖ ఈ నిర్ణయాలు తీసుకుంటే ట్యాక్స్ పేయర్ల నుంచి మార్కెట్లోకి మనీ వస్తుంది. ఖర్చు చేయడానికి మిడిల్ క్లాస్ తో పాటు అధిక ఆదాయ వర్గాలకు బెనిఫిట్ అవుతుందని ఆశిస్తున్నారు.
Published at : 27 Jan 2025 01:45 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
ఐపీఎల్
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion