AP Cabinet decisions: మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు క్యాప్టివ్ పోర్టు - బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపు - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
Andhra Pradesh: ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం క్యాప్టివ్ పోర్టుకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. అలాగే బార్ లైసెన్స్ ఫీజులు తగ్గించారు.

AP Cabinet takes key decisions: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపి డ్రోన్ కార్పొరేషనను.. ఏపీ ఫైబర్నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. అనకాపల్లి జిల్లాలోని డీఎలపురం వద్ద క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు-2025కి ఆమోదించారు. ఇక నుంచి మీడియా అక్రిడేషన్ కు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి. ఆర్సెలార్ మిట్టల్ ఇండియా లిమిటెడ్ స్టీల్ ఉత్పత్తి ప్రతిపాదనకు కేబినెట్ అనుమతి ఇచ్చింది. ఈ స్టీల్ ప్లాంట్ వల్ల ఉద్యోగ అవకాశాలు భారీగా పెరగనున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అభివృద్ధి చేయడానికి అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని మంత్రి పార్థసారధి స్పష్టం చేశారు.
సాకారమవుతోన్న ఆర్సలర్ మిట్టల్ నిస్సాన్ స్టీల్.. అనకాపల్లిలో క్యాపిటివ్ పోర్టు కూడా నిర్మిస్తూ క్యాబినెట్ లో కీలక నిర్ణయం.. #IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/NwlLsNeyTx
— Telugu Desam Party (@JaiTDP) April 3, 2025
త్రీ స్టార్, ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజుల కుదింపునకు ఆమోదం తెలిపారు. బార్ లైసెన్స్ ల ఫీజును రూ.25 లక్షలకు కుదిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. యువజన, పర్యాటక శాఖ జీవోల ర్యాటిఫికేషన్, రూ.710కోట్ల హడ్కో రుణానికి ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. నాగార్జునసాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రతిపాదన, జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ఆమోదం. జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పకు కూడా అంగీకారం తెలిపారు. ప్రతి ఏడాది 1000 నుంచి 2000 టీఎంసీల నీరు వృధాగా పోతుండటంతో, రాయలసీమ అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ అత్యవసరమని కేబినెట్ అభిప్రాయపడింది. గ్రామీణాభివృద్ధి కోసం అధికారులు నేరుగా గ్రామాల్లో ఉండి ప్రజల సమస్యలను అర్థం చేసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.
జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం. జలహారతి కార్పొరేషన్ ద్వారా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన.#IdhiManchiPrabhutvam #ChandrababuNaidu#AndhraPradesh pic.twitter.com/7zStHDBwmc
— Telugu Desam Party (@JaiTDP) April 3, 2025
ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలు-2025కి ఆమోదించారు. ఇక నుంచి మీడియా అక్రిడేషన్ కు కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.
కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో చంద్రబాబు విడిగా మాట్లాడారు. రాజకీయ అంశాలపై మంత్రులతో మాట్లాడారు. ఇటీవల జరిగిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో రాజకీయం చేయాలని చూశారని..కానీ ప్రతి చోటా సీసీ ఫుటేజీ సాక్ష్యంగా ఉందన్నారు. ఇలాంటి తప్పుడు ప్రచారాల రాజకీయాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. సీసీ కెమెరాల అవసరం .. ఈ ఘటన ద్వారా మరింత ఎక్కువగా తెలిసి వచ్చిందని చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. మరో ఇతర రాజకీయ అంశాలపైనా మంత్రులు చెప్పిన వాటిని చంద్రబాబు విన్నట్లుగా తెలుస్తోంది.



















