Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి షాక్ - మద్యం స్కాం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Peddireddy: పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఇప్పుడు ఆయనకు అరెస్టు ముప్పు పొంచి ఉందని భావిస్తున్నారు.

Mithun Reddy anticipatory bail: ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన లిక్కర్ స్కాంలో తనను అరెస్టు చేస్తారన్న ఆందోళనతో ముందస్తు బెయిల్ కోంస వెళ్లిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయన పిటిషన్ హైకోర్టు కొట్టి వేసింది. ముందస్తు బెయిల్ డిస్మిస్ చేయడంతో మిథున్ రెడ్డిని అరెస్టు చేయడానికి అవకాశం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద లిక్కర్ స్కాం జరిగిందని ఏపీ ప్రభుత్వం అంటోంది. ఈ మేరకు ఇప్పటికే సీఐడీ కేసులు నమోదు చేసింది. అయితే ఈ కేసుల్లో ఇంత వరకూ ఎవర్నీ అరెస్టు చేయలేదు. దర్యాప్తు సమయంలో బయటకు వచ్చిన వివరాలను బట్టి చూస్తే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డికి కీలక పాత్రని ప్రచారం
మద్యం దుకాణాల్లో నగదు రూపంలో వసూలు చేసన నగదులో చాలా వరకూ బ్లాక్ మనీగా మారిపోయి విదేశాలకు తరలిపోయాయని అలాంటి డీల్స్ కు మిథున్ రెడ్డి కీలకంగా ఉన్నారని అంటున్నారు. ఈ క్రమంలో తనను అరెస్టు చేస్తారన్న భయంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే వాదనల సమయంలో.. ఇప్పటి వరకూ మిథున్ రెడ్డిపై ఎలాంటి కేసులు పెట్టలేదని సీఐడీ చెప్పింది. నమోదు కాని కేసులో ముందస్తు బెయిల్ అడగడం సరి కాదని వాదించింది.
పలువురు అనుమానితులు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కేసులు
వైసీపీ ప్రభుత్వంలో ప్రత్యేక అధికారిగా ఉన్న సత్యప్రసాద్ ఇచ్చిన 164 స్టేట్‌మెంట్ ఆధారంగా మిథున్‌రెడ్డిని మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా చేర్చబోతున్నారని మిధున్ రెడ్డి తరపు లాయర్లు వాదించారు. అదే సమయంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ కు చాలా కాలం ఎండీగా పని చేసిన వాసుదేవరెడ్డి ఇచ్చిన 161 స్టేట్‌మెంట్‌ను పరిశీలిస్తే నచ్చిన కంపెనీలకు మద్యం ఆర్డర్లు ఇవ్వడంలో మిథున్‌రెడ్డి కీలకపాత్ర పోషించినట్లు సీఐడీకి ఆధారాలు లభించాయి. అలాగే నంద్యాలలోని ఎస్పీవై అగ్రో కంపెనీని పెద్దిరెడ్డి కుటుంబం బలవంతంగా స్వాధీనం చేసుకుని తక్కువ నాణ్యత కలిగిన మద్యం ఉత్పత్తి చేసి, ప్రభుత్వ ఖాతాలో భారీగా విక్రయించినట్లు సీఐడీ పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తారా ?
ఆ డిస్టిలరీలు, వాటికి సంబంధించిన వివరాలు తవ్వితే, మిథున్ రెడ్డి కుటుంబంతో సంబంధాలున్నట్లు తేలిందని చెబుతున్నరాు. ఇప్పటికే నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో కూడా కొన్ని కీలక పేర్లు ఉన్నాయని చెబుతున్నారు. ఇంకా ఎఫ్ఐఆర్ వెలుగులోకి రాలేదు. విచారణలో మరిన్ని వివరాలు వెల్లడి కావడంతో, కొన్ని డిస్టిలరీలకు అధికంగా ఇండెంట్లు మంజూరు చేయడం, మరికొన్నింటికి తగ్గించడం వంటి పరిణామాల వెనుక ఎంపీ మిథున్ హస్తం ఉందన్న అనుమానాలతో సీఐడీ దర్యాప్తు చేస్తోంది. అదంుకే మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. కానీ రిలీఫ్ లభించలేదు.





















