అన్వేషించండి

Pawan Kalyan: పిఠాపురం రూపు మారేలా అభివృద్ధి పనులు - అధికారులుక పవన్ కల్యాణ్ దిశానిర్దేశం

Deputy CM: పిఠాపురం అభివృద్ధి పనులపై పవన్ కల్యాణ్ అధికారులతో సమీక్షించారు. ప్రజలు పరిష్కరించాలని కోరిన ప్రతి సమస్యకూ పరిష్కారం చూపాలన్నారు.

Pithapuram Development:  పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని, మౌలిక వసతుల కల్పన విషయంలో చురుగ్గా వ్యవహరించాలని అధికారులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.  పిఠాపురం నియోజక వర్గంలో ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (పాడా) డైరెక్టర్ గురువారం పర్యటించి అభివృద్ధి పనులపై సమీక్షించారు. తమ పర్యటన వివరాలను ఉప ముఖ్యమంత్రికి తెలియచేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిధులతో చేపడుతున్న రహదారి పనులు, ఉపాధి హామీ కార్యక్రమాల అమలుపై పురోగతి నివేదికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని గ్రామాలు, పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో తాగు నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ వేసవి సమయంలో నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయాలు ఉండకూడదని, సమ్మర్ స్టోరేజి ట్యాంక్స్ దగ్గర తనిఖీలు చేయాలన్నారు. 

 నియోజకవర్గం అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా నిధులు సమకూరుస్తున్నాము. వాటిని సద్వినియోగం చేసి ప్రజలకు మేలు చేసే బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని పవన్ తెలిపారు.  అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి. ప్రతి వారం ఈ పనులపై సమీక్ష చేపడతాను. అధికారులు క్షేత్ర స్థాయి పురోగతిని నిశితంగా పరిశీలించాలి. పనుల నాణ్యత ప్రమాణాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయబోతున్నామన్నారు. తన కార్యాలయ దృష్టికి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక వ్యవస్థ పని చేస్తోందని..  విద్యుత్ అంతరాయ సమస్య ఉందని తెలియగానే టిడ్కో గృహాల దగ్గర రూ.3 కోట్లతో 5 ఎం.వి.ఎ సామర్థ్యంతో కొత్త సబ్ స్టేషన్ పనులు చేపట్టామమన్నారు. 

అమృత్ 2.0 ద్వారా పిఠాపురం పట్టణంలో తాగు నీటి సమస్యలు పరిష్కరించేందుకు ఇప్పటికే పురపాలక శాఖ అధికారులతో సమీక్ష చేశామని పిఠాపురం – ఉప్పాడ రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపగలిగామమన్నారు. రూ.59.7 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఉపాధి హామీ పథకంలో రూ.40.2 కోట్లతో 444 రోడ్డు పనులు చేపట్టాము. అదే విధంగా 431 గోకులాలు పిఠాపురం నియోజకవర్గానికి ఇచ్చాము. పిఠాపురంలో ప్రభుత్వ ఆసుపత్రిని సి.హెచ్.సి. నుంచి ఏరియా ఆసుపత్రి స్థాయికి పెంచాము. అందుకు అనుగుణంగా రూ.38.32 కోట్లు నిధులు వచ్చాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంపై ప్రత్యేక శ్రద్ధ ఏ విధంగా చూపుతుందో తెలిపేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూరుస్తోంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మార్గదర్శకత్వంలో వాటిని సద్వినియోగపరుస్తున్నాము. ఈ క్రమంలో అధికారులు, ఉద్యోగులు సానుకూల దృక్పథంతో పని చేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు.

నియోజకవర్గంలో శాంతిభద్రతల అంశంపై ప్రత్యేక సూచనలు చేశారు.  పిఠాపురం నియోజక వర్గ పరిధిలో పోలీసింగ్ వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఊటంకిస్తూ, నాలుగు పోలీస్ స్టేషన్లలో ఉన్న పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదిక తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవినీతికి పాల్పడుతున్న పోలీసు అధికారుల మూలంగా శాఖ చులకన అవుతోందన్నారు. ప్రజలను ఇబ్బందిపెట్టే నేరస్తులనే కాదు, వారికి అండగా ఉండే నాయకులను, పోలీసులను కూడా ఉపేక్షించకూడదన్నారు. తన దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను వివరించి వాటిని సత్వరమే జిల్లా పోలీసు అధికారులకు తెలియచేయాలని తన కార్యాలయ అధికారులను ఆదేశించారు. 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Support CJP : CJP నేతల అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్ - ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోయిందని విమర్శలు !
CJP నేతల అరెస్ట్‌పై వైఎస్ జగన్ ఫైర్ - ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోయిందని విమర్శలు !
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు

వీడియోలు

Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
1000-Year History of Bathukamma | వెయ్యేళ్ల చరిత్ర కలిగిన బతుకమ్మ పండుగ.. ఎప్పుడు, ఎలా మొదలైంది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Sesame Seeds Benefits : నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
నువ్వులు తింటే చర్మం మెరుస్తుందా? జుట్టు బలంగా పెరుగుతుందా? నిజాలు ఇవే
High Court On Tuni Missing Case: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు
Polavaram Project: పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
పోలవరం పనులపై అంతర్జాతీయ నిపుణులు సంతృప్తి.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణంపై ఆరా!
Andhra Style Tomato Pappu : ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే
ఆంధ్రా స్టైల్ టమాటా పప్పు రెసిపీ.. రుచి పెంచే టిప్స్ ఇవే
AP Sarpanch Elections Schedule: ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
ఏపీలో 3 విడతల్లో సర్పంచ్ ఎన్నికలు.. ముఖ్యమైన తేదీలు చెక్ చేసుకోండి
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
IND VS WI Series Alive Drama: విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
Embed widget