అన్వేషించండి

Moinabad Farmhouse Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్

హైదరాబాద్‌లోని మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో సహా ముగ్గురు నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

హైదరాబాద్: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన వారిలో ముగ్గురు నిందితులకు ఉప్పర్‌పల్లి కోర్టు రిమాండ్ విధించింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, వ్యాపారి నమిత్ శర్మలకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. పోలీసులు తనిఖీల సమయంలో నమిత్ శర్మ గాలిలోకి కాల్పులు జరపడం ఈ కేసులో అత్యంత సంచలనంగా మారింది. రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకే తాను పోలీసుల వైపు కాల్పులు జరిపినట్లు నమిత్ శర్మ అంగీకరించినట్లు సమాచారం. ఈ కాల్పుల ఉదంతంపై కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి.

చంచల్‌గూడ జైలుకు నిందితుల తరలింపు
ఈ పార్టీలో పాల్గొన్న మొత్తం 11 మందిలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సహా 8 మందికి నోటీసులు ఇచ్చి పంపిన పోలీసులు, గన్ ఫైరింగ్, డ్రగ్స్ వినియోగం ఆరోపణలపై రోహిత్ రెడ్డి బృందాన్ని జడ్జి ముందు హాజరుపరిచారు. నిందితుల తరఫు న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నించినప్పటికీ, కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి వారి పిటిషన్లను తిరస్కరించారు. ముగ్గురు నిందితులను 14 రోజుల పాటు రిమాండ్‌కు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో, పోలీసులు వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మరిన్ని కీలక ఆధారాల కోసం పోలీసులు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది.

Moinabad Farmhouse Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్

రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే కాల్పులు..
మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీ, కాల్పుల ఘటన సంచలనం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు సోదాలకు వచ్చిన సమయంలో కాల్పులు జరిగినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో రోహిత్‌రెడ్డిని ప్రధాన నిందితుడిగా (A1) పేర్కొంటూ, మొత్తం 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


Moinabad Farmhouse Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్
శనివారం రాత్రి జరిగిన ఈ సోదాల్లో పోలీసులు గోడలు దూకి లోపలికి వెళ్తుండగా, నిందితుడు నమిత్ శర్మ పోలీసులపైకి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. ఘటనా స్థలంలో జర్మన్ మేడ్ తుపాకీ, లైవ్ తూటాలు, ఖాళీ షెల్స్‌తో పాటు 0.26 గ్రాముల కొకైన్, భారీగా విదేశీ మద్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పార్టీలో పాల్గొన్న వారికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా.. రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మ, కౌశిక్ రవి, అర్జున్‌రెడ్డిలతో పాటు టీడీపీ నేత, ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌కు కూడా డ్రగ్ పాజిటివ్‌గా తేలింది. ఆదివారం రాత్రి నిందితులను జడ్జి ముందు ప్రవేశపెట్టగా, రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, నమిత్‌శర్మలకు 14 రోజుల రిమాండ్ విధించగా చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఎంపీ పుట్టా మహేష్ సహా 8 మందికి స్టేషన్ బెయిల్ లభించడంతో విడుదలయ్యారు.


Moinabad Farmhouse Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్

పార్టీకి హాజరైంది వీరే..
మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌లోని తన ఫామ్‌హౌస్‌లో రోహిత్ రెడ్డి ఇచ్చిన పార్టీకి టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌, రోహిత్‌రెడ్డి సోదరుడు రితేశ్‌రెడ్డి, మణికొండకు చెందిన వ్యాపారులు మొరవినేని రమేశ్‌, వరమాచినేని శ్రవణ్‌కుమార్‌, ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్‌శర్మ, అమీర్‌పేటకు చెందిన నల్లపనేని విజయకృష్ణ,  బెంగళూరుకు చెందిన లాయర్ కౌశిక్‌ రవి, పుప్పాలగూడకు చెందిన అర్జున్‌రెడ్డి(33), వికారాబాద్‌ జిల్లాకు చెందిన సిలివేరు శరత్‌కుమార్‌, ఫిల్మ్‌నగర్‌కు చెందిన ఆర్‌.ప్రియాంకా రెడ్డి హాజురయ్యారని పోలీసులు తెలిపారు.  


Moinabad Farmhouse Case: మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసులో ముగ్గురు నిందితులకు 14 రోజుల రిమాండ్

ప్రధాన నిందితుడిగా మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి..
ఫాం హౌస్‌లో డ్రగ్స్ పార్టీ, కాల్పుల ఘటనకు సంబంధించి పోలీసులు 11 మంది నిందితుల్ని శంషాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. రోహిత్ రెడ్డి ఆదేశాలతో కాల్పులు జరిపినట్లు తేలడంతో మాజీ ఎమ్మెల్యేను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చేర్చారు. లైసెన్స్ గన్ దుర్వినియోగం చేసినందుకు రితేష్ రెడ్డి, కాల్పులు జరిపినందుకు నమిత్ శర్మలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ సహా 8 మందికి నోటీసులు ఇచ్చి పంపారు. తెలంగాణ ఎక్సైజ్‌ చట్టంతో పాటు ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని 8సి, 22ఎ, 27, 29 సెక్షన్ల కింద, ఆయుధాల చట్టంలోని సెక్షన్‌ 30, 25(1బి)(ఎ),  కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Adilabad Latest News: ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి పకడ్బందీ ఏర్పాట్లు- ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్ రాజర్షి షా కీలక ప్రకటన!
Niharika Konidela : అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
అమ్మవారికి నిహారిక కొణిదెల బంగారు బోనం - పాతబస్తీ ఆలయంలో బోనమెత్తిన మెగా డాటర్
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
Embed widget