Adarsh Gourav Telugu Movie: బాలీవుడ్ హీరో ఆదర్శ్ గౌరవ్ మూవీకి నిర్మాతగా దానయ్య కుమార్తె - ఆ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ పేరేంటో తెలుసా?
DVV Jahnavi: బాలీవుడ్ హీరో ఆదర్శ్ గౌరవ్ తెలుగులో హీరోగా సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీతో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి డివివి జాహ్నవి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. టైటిల్ ఖరారు చేశారు.

Adarsh Gourav's Psychological Thriller Movie Named Happy Birthday Uma: ఆర్ఆర్ఆర్ సహా ఎన్నో హిట్ సినిమాలు అందించిన ప్రముఖ నిర్మాత డివివి దానయ్య కుమార్తె జాహ్నవి (DVV Jahnavi).. బాలీవుడ్ హీరో ఆదర్శ్ గౌరవ్‌తో (Adarsh Gourav) తెలుగులో ఓ మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌పై తాజా అప్ డేట్ వచ్చింది.
టైటిల్ అదేనా?
ఆదర్శ్ గౌరవ్ హీరోగా ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి 'హ్యాపీ బర్త్‌డే ఉమా' (Happy Birthday Uma) అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. సైన్స్ ఫిక్షన్ ట్విస్టులతో కూడిన సైకలాజికల్ హారర్‌గా సినిమా ఉండనున్నట్లు సమాచారం. ఈ మూవీతోనే ఆదర్శ్ టాలీవుడ్‌కు పరిచయం అవుతుండగా.. ఆయన కెరీర్‌లోనే ఓ బెస్ట్ మూవీగా నిలుస్తుందని టీం చెబుతోంది.
ప్రేక్షకులకు థ్రిల్ పంచేలా..
సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీతో తెలుగులో అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందని హీరో ఆదర్శ్ గౌరవ్ అన్నారు. 'సవాల్ చేసే పాత్రలు, స్టోరీలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. 'హ్యాపీ బర్త్ డే ఉమా' సరిగ్గా అదే చేస్తుంది. ఇది ఓ సైకలాజికల్ హారర్ సినిమా. కానీ దాని ప్రధాన భాగంలో, ఇది సైన్స్ ఫిక్షన్ గురించి కూడా ఉంటుంది. తెలుగు సినిమాలో ఇది చాలా రేర్ కాంబినేషన్. బాబా నాకు స్క్రిప్ట్ చెప్పినప్పుడే చాలా బాగా నచ్చింది. సస్పెన్స్, ఎమోషన్స్, సైన్స్ ఫిక్షన్‌లను ఒకే స్టోరీలో అల్లిన విధానం అద్భుతంగా ఉంది.
ఓ నటుడిగా, నేను నా కంఫర్ట్ జోన్ దాటి నన్ను ప్రూవ్ చేసుకునే రోల్స్ కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటాను. ఈ చిత్రం సరిగ్గా అలాంటిదే. నా మాతృభాషలో మాట్లాడడం, సైకలాజికల్ హారర్, సైన్స్ ఫిక్షన్ వంటి డిఫరెంట్ కాంబోలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు ఇంతకు ముందు చూసిన చిత్రాల కంటే ఇది భిన్నంగా ఉంటుంది.' అని ఆదర్శ్ గౌరవ్ తెలిపారు.
Also Read: 'కాంతార 2' మూవీ వాయిదా అంటూ రూమర్స్ - ఒక్క వీడియోతో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన టీం
బాలీవుడ్ హీరో ఆదర్శ్ గౌరవ్ 'ద వైట్ టైగర్' సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత హిందీలో దాదాపు 9 సినిమాల వరకూ చేశారు. ఇటీవల సూపర్ బాయ్స్ ఆఫ్ మాలెగావ్ మూవీ ద్వారా ఆడియన్స్‌ను అలరించాడు. హాస్టల్ డేస్, గన్స్ అండ్ గులాబ్స్ వంటి వెబ్ సిరీస్‌ల్లోనూ నటించారు. ఫస్ట్ మూవీ 'హ్యాపీ బర్త్ డే ఉమా'తో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.
అంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆదర్శ్.. సౌత్ సినిమా ఇండస్ట్రీ ఎన్నో ఇన్నోవేటివ్ సినిమాలు ప్రొడ్యూస్ చేసిందని, అటువంటి ఒక సినిమాలో తాను భాగం కావడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు. తాను ఇంతకు ముందెన్నడూ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ జానర్‌లో నటించలేదని ఇదే ఫస్ట్ టైం అని చెప్పారు. దీంతో సినీ ప్రియుల్లో ఈ మూవీపై ఆసక్తి నెలకొంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

