Kantara 2: 'కాంతార 2' మూవీ వాయిదా అంటూ రూమర్స్ - ఒక్క వీడియోతో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన టీం
Rishab Shetty: కన్నడ స్టార్ రిషబ్ శెట్టి 'కాంతార 2' (కాంతార ప్రీక్వెల్) భారీ స్థాయిలో తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ వాయిదా అంటూ వస్తోన్న రూమర్లను మేకర్స్ ఖండించారు.

Kantara 2 Makers Clarified About Release Postpone Rumours: కాంతార.. ఈ పేరు వింటేనే సెన్సేషనల్ డివోషనల్ హిట్ మనకు గుర్తొస్తుంది. కన్నడలోనే కాకుండా తెలుగులోనూ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ ఒక్క మూవీతోనే రిషబ్ శెట్టి (Rishab Shetty) స్టార్ హీరోగా మారిపోయారు. ఈ మూవీకి ప్రీక్వెల్ అనౌన్స్ చేసి భారీ హంగులతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, రిలీజ్ తేదీపై వస్తోన్న రూమర్లపై మూవీ టీం తాజాగా స్పందించింది.
ఒక్క వీడియోతో రూమర్లకు చెక్
'కాంతార 2' (ప్రీక్వెల్) (Kantara 2) పాన్ ఇండియా లెవల్‌లో ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న రిలీజ్ చేస్తామని ఇప్పటికే టీం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూవీ రిలీజ్ వాయిదా పడుతుందంటూ ఇటీవల సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు హల్చల్ చేశాయి. దీనిపై స్పందించిన టీం చెప్పిన టైంకే రిలీజ్ చేస్తామంటూ పోస్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2కే 'కాంతార 2' బాక్సాఫీస్ ముందుకు వస్తుందని తెలిపింది. 'నో డౌట్స్.. నో డిలేస్' అంటూ పేర్కొంది.
𝗡𝗢 doubts. 𝗡𝗢 delays :)
— Kantara - A Legend (@KantaraFilm) April 2, 2025
The legendary saga, #KantaraChapter1 unfolds on October 2nd, 2025. pic.twitter.com/1RoD75XoTs
Also Read: నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... 'అర్జున్ సన్నాఫ్ వైజయంతీ' రిలీజ్ డేట్ ఫిక్స్
బిగ్గెస్ట్ హిట్‌గా రికార్డు
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి 'కాంతార' మూవీతో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తూనే హీరోగా నటించారు. ఫస్ట్ పార్ట్‌గా వచ్చిన 'కాంతార'ను రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధించింది. దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. తొలి కథ ఎక్కడి నుంచి ప్రారంభమైందో.. దానికి ముందు జరిగిన సంఘటనలను 'కాంతార 2'లో చూపించనున్నారు. 'పుంజుర్లి' దేవునికి సంబంధించిన సన్నివేశాలు ప్రీక్వెల్‌లోనే ఎక్కువగా ఉండనున్నాయి.
కాంతార ఫస్ట్ పార్ట్ కన్నడలో తొలుత విడుదలై రికార్డు విజయం సాధించింది. ఆ తర్వాత ఈ సినిమాను ఇతర భాషల్లోకి డబ్ చేశారు. అయితే, 'కాంతార 2' ప్రీక్వెల్‌ను మాత్రం పాన్ ఇండియా లెవల్‌లో ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు, ఈ సినిమాలో మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్నాడంటూ వచ్చిన రూమర్లపై ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ఇక రిషబ్ శెట్టి విషయానికొస్తే.. దర్శకుడు ప్రశాంత్ వర్మ 'హనుమాన్ 2'లో కీలక పాత్ర పోషించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన పోస్టర్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

