Arjun 𝐒/𝐎 Vyjayanthi : నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... 'అర్జున్ సన్నాఫ్ వైజయంతీ' రిలీజ్ డేట్ ఫిక్స్
Arjun 𝐒/𝐎 Vyjayanthi Release Date : కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతీ' రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్‌లో ఈ మూవీని విడుదల చేయనున్నట్టు అనౌన్స్మెంట్ వచ్చేసింది.

Nandamuri Kalyan Ram's Arjun Son Of Vyjayanthi Movie Release Date: నందమూరి హీరో కళ్యాణ్ రామ్, డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' (Arjun S/O Vyjayanthi). ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన యాక్షన్ ప్యాక్డ్ టీజర్, ఫస్ట్ సాంగ్ మూవీపై అంచనాలు పెంచాయి. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులకు తాజాగా మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీని ఏప్రిల్‌లోనే రిలీజ్ చేయబోతున్నాము అంటూ స్పెషల్ పోస్టర్ ద్వారా మూవీ రిలీజ్ డేట్‌ని అధికారికంగా అనౌన్స్ చేశారు.
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రిలీజ్ డేట్
2023లో కళ్యాణ్ రామ్ 'అమిగోస్' అనే సినిమాతో థియేటర్లలోకి వచ్చారు. కానీ ఈ మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ తర్వాత రెండేళ్ల పాటు గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలని ప్రకటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఓవైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా రాణిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కళ్యాణ్ రామ్ హీరోగా ప్రకటించిన 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ ప్రమోషన్లు జోరందుకున్నాయి. ఈ మూవీకి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తుండగా, సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా మూవీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది చిత్ర బృందం. 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీని ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతున్నట్టు అఫీషియల్‌గా అనౌన్స్ చేసి నందమూరి అభిమానుల్లో మరింత జోష్ పెంచారు. ఇక మూవీ రిలీజ్ డేట్‌కు ఎక్కువ టైం లేకపోవడంతో చిత్ర బృందం త్వరలోనే మరింతగా ప్రమోషన్లతో సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతోంది.
బజ్ పెంచిన టీజర్, మాస్ సాంగ్
సీనియర్ నటి విజయశాంతి 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ రోల్ పోషిస్తున్నారు. అలాగే శ్రీకాంత్, సొహైల్ ఖాన్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీని అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మిస్తుండగా, అజనీష్ లోక్నాథ్ సంగీతం అందించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా మరోసారి విజయశాంతి ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపించబోతుండడం సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అలాగే కళ్యాణ్ రామ్ తల్లి అంటే ప్రాణం ఇచ్చే అబ్బాయిగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ప్రమోషన్లలో వేగం పెంచారు మేకర్స్. రంజాన్ పండుగ సందర్భంగా ఈ మూవీలో నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. 'నాయాల్డి' అంటూ సాగే ఈ మాస్ సాంగ్ లో కళ్యాణ్ రామ్, సాయి మంజ్రేకర్ మాస్ స్టెప్పులతో దుమ్మురేపారు. 'బింబిసారా' తర్వాత ఆశించిన రేంజ్ లో హిట్ అందుకోలేకపోయిన కళ్యాణ్ రామ్... ఈ మూవీతో ఆ లోటు తీరుతుందనే నమ్మకంతో ఉన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

