అన్వేషించండి

Sreeleela: 'రాబిన్‌హుడ్' డిజాస్టర్ తర్వాత శ్రీలీలకు మరో షాక్... క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్ నుంచి 'కిస్సిక్' పాప అవుట్?

Sreeleela : మోస్ట్ వాంటెడ్ టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల నటించాల్సిన ఓ క్రేజీ హిందీ ప్రాజెక్ట్ చేజారినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ సినిమాలో శ్రీలీల ప్లేస్ ను స్టార్ కిడ్ రాషా తడాని రీప్లేస్ చేస్తుందని టాక్.

'పుష్ప 2'లోని 'కిస్సిక్' సాంగ్ తరువాత యంగ్ బ్యూటీ శ్రీలీల కెరీర్ మరోసారి పుంజుకుంది. ఈ సాంగ్ తో హిందీలో ఆమె మార్కెట్ బలపడింది. ఈ నేపథ్యంలోనే పలు బాలీవుడ్ సినిమా అవకాశాలు ఆమె ఇంటి తలుపు తడుతున్నాయి. ఇప్పటికే ఓ మోస్ట్ అవైటింగ్ హిందీ రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్న శ్రీలీల ఇంకో హిందీ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిందని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ శ్రీలీల చేజారగా, మరో స్టార్ కిడ్ ఆమె స్థానాన్ని రీప్లేస్ చేయనున్నట్టు తెలుస్తోంది. 
 
శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ   

శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ హోదాను ఆస్వాదిస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు అగ్ర హీరోలతో కలిసి వర్క్ చేసిన ఈ నటి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధంగా ఉంది. కార్తీక్ ఆర్యన్ సరసన హిందీలో తొలిసారిగా ఈ రొమాంటిక్ డ్రామాలో నటించనుంది. మొదట్లో ఈ మూవీని 'ఆషికి 3' అనుకున్నారు. టైటిల్ వివాదం కారణంగా ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. అనురాగ్ బసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల, కార్తీక్ ల మధ్య కెమిస్ట్రీకి సంబంధించిన ఫోటోలు బయటకు రాగా, ఇప్పటికే సినిమాపై అవి భారీ హైప్ ని క్రియేట్ చేశాయి.

మరోసారి కార్తీక్ ఆర్యన్ తో రొమాన్స్ 

ఈ నేపథ్యంలోనే కార్తీక ఆర్యన్, శ్రీలీల జంటగా మరో మూవీ పట్టాలెక్కనుంది అని వార్తలు వచ్చాయి. కొంతకాలం క్రితం కార్తీక్ ఆర్యన్, భూమి పెడ్నేకర్‌తో పాటు శ్రీలీల కూడా 'పతి పత్నీ ఔర్ వో 2'లో భాగం కానుందని రూమర్స్ వచ్చాయి. కార్తీక్ ఆర్యన్ నటించిన ''పతి పత్నీ ఔర్ వో' సినిమా 2019లో విడుదలైంది. ఆ సమయంలో అనన్య పాండే, భూమి పెడ్నేకర్ కార్తీక్ ఆర్యన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు పార్ట్ 2 కూడా చేయబోతున్నారు. కార్తీక్ ఆర్యన్ అనురాగ్ బసుతో చేస్తునా రొమాంటిక్ చిత్రం పూర్తయిన తర్వాత దీనికి సంబంధించిన పనులు ప్రారంభమవుతాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ దర్శకుడు ముదస్సర్ అజీజ్ ఈ  ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఫ్రెష్ జోడీని ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఆలోచిస్తున్నారు. అందుకే  రషా తడానీని తీసుకోవాలని యోచిస్తున్నాడు. అందుకే యంగ్ బ్యూటీ రాషా తడానిని శ్రీలీల స్థానంలో తీసుకోవాలని ఆయన అనుకుంటున్నారనే వార్త బాలీవుడ్ వర్గాల్లో విన్పిస్తోంది. 

Also Readమధుశాల రివ్యూ: ETV Winలో పొలిటికల్ క్రైమ్ డ్రామా... వరలక్ష్మి శరత్‌ కుమార్ సినిమా బావుందా? లేదా?

రాషా తడాని ఎవరు ?

అజయ్ దేవగన్, ఆయన మేనల్లుడు ఆమన్ దేవగన్‌ తో కలిసి 'ఆజాద్‌' అనే సినిమా చేశారు. ఈ మూవీతోనే బాలీవుడ్ వెటరన్ యాక్ట్రెస్ రవీనా టాండన్ కూతురు రషా తడాని సినీ రంగ ప్రవేశం చేసింది. అభిషేక్ కపూర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ రాషా ఈ సినిమాలో చేసిన 'ఉయ్ అమ్మ' పాట మాత్రం సంచలనంగా మారి, యూట్యూబ్‌లో భారీ సంఖ్యలో వ్యూస్ రాబట్టింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget