Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
New Pattadar passbooks: ఏపీ రైతులకు రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వం జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాలను పంపిణీ చేసింది.

New Pattadar passbooks Good news for AP farmers: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి కూటమి ప్రభుత్వం నూతన సంవత్సర కానుకగా రాజముద్ర తో కూడిన కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి ఫోటోతో జారీ చేసిన పాసుపుస్తకాలపై ప్రజల్లో వ్యక్తమైన తీవ్ర అసంతృప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం, వాటి స్థానంలో అధికారిక రాజముద్ర ఉన్న పుస్తకాలను అందజేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు ఈ పంపిణీ కార్యక్రమం పండుగలా సాగాలని దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రీ-సర్వేలోని లోపాలను సరిదిద్ది, భూ యజమానులకు పూర్తి భరోసా కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. గత పాలకులు పాసుపుస్తకాలపై తమ ఫోటోలను ముద్రించుకోవడానికే ఏకంగా రూ. 22 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేశారని ముఖ్యమంత్రి మండిపడ్డారు. వివాదాలు లేని స్థలాలను కూడా అసంబద్ధ రీ-సర్వేతో వివాదాస్పదం చేశారని, అటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించి రైతులకు క్లీన్ టైటిల్స్ అందించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో 22 లక్షల కొత్త పాసుపుస్తకాలను సిద్ధం చేసి పంపిణీ ప్రారంభించారు.
ఆళ్లగడ్డ మండలం అహోబిలం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం AP రి సర్వే ప్రాజెక్టు నూతన పట్టాదారు పాసు బుక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ కోసం పాసుబుక్కుల పైన సర్వే రాళ్లపై ఎక్కడపడితే అక్కడ పబ్లిసిటీ… pic.twitter.com/81RIV2KLaz
— Bhuma Akhila Priya Reddy (@bhuma_akhila) January 2, 2026
రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ , ఇతర మంత్రులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం పలు కీలక సూచనలు చేశారు. వివాదాస్పదమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఇప్పటికే రద్దు చేయడం ద్వారా ప్రజల్లో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించామని ఆయన గుర్తు చేశారు. భూమే ప్రాణంగా బతికే రైతులకు ఎటువంటి భూ సమస్యలు లేకుండా చేయడం ప్రథమ కర్తవ్యమని, నిర్దిష్ట గడువు పెట్టుకుని రెవెన్యూ ఇబ్బందులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి కూడా ఒక రోజు పాల్గొననున్నారు.
రైతు రాజ్యంలో.. మళ్ళీ రాజముద్ర గౌరవం!
— Kinjarapu Atchannaidu (@katchannaidu) January 2, 2026
ఈరోజు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలసలో పర్యటించి, మన అన్నదాతలకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన భూమి పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరిగింది.
గత అరాచక వైసీపీ ప్రభుత్వం రైతుల భూములపై హక్కుల కంటే, తన సొంత ఫోటోల ప్రచారంపైనే… pic.twitter.com/uDNSdAwwQW
రాష్ట్రవ్యాప్తంగా వేలాది గ్రామాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా మొదలైంది. జగన్ బొమ్మ ఉన్న పుస్తకాల స్థానంలో అధికారిక రాజముద్రతో కూడిన కొత్త పుస్తకాలు అందుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకం అనేది కేవలం ఒక పత్రం మాత్రమే కాదని, అది రైతు ఆత్మగౌరవానికి, ఆస్తి హక్కుకు భరోసా అని ఈ సందర్భంగా నాయకులు పేర్కొంటున్నారు. రాబోయే వారం రోజుల్లో లక్షలాది మంది రైతులకు వీటిని అందజేయడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.





















