అన్వేషించండి

Mumbai To Dubai Train: ముంబై నుంచి దుబాయ్ - కేవలం 2 గంటల జర్నీ, విమానం కన్నా వేగం!

Mumbai To Dubai Journey Time: ముంబై-దుబాయ్ మధ్య ప్రయాణం కేవలం 2 గంటలు మాత్రమే ఉంటుంది, నీటిలో నడిచే అత్యంత వేగవంతమైన సూపర్‌ఫాస్ట్ రైలు రాబోతోంది.

Mumbai To Dubai Underwater Train Project News: మన దేశం నుంచి దుబాయ్‌ వెళ్లే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది, అందరూ విమానంలోనే వెళ్లొస్తుంటారు. ముంబై - దుబాయ్‌ మధ్య చాలా విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ముంబై నుంచి దుబాయ్‌ 1,198 మైళ్లు లేదా 1,928 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ డిస్టాన్స్‌ కవర్‌ చేయడానికి అంతర్జాతీయ విమానాలకు దాదాపు 3 గంటల 15 నిమిషాల సమయం పడుతుంది. అంటే, ముంబైలో విమానం ఎక్కితే, 3.15 గంటల్లో దుబాయ్‌లో ల్యాండ్‌ అవుతాం. ఇకపై, ఈ టైమ్‌ గణనీయంగా తగ్గబోతోంది.
 
ముంబై - దుబాయ్‌ హై స్పీడ్‌ ట్రైన్‌ ప్రాజెక్ట్‌
ముంబై - దుబాయ్‌ మధ్య నడిచే హై స్పీడ్‌ ట్రైన్‌ కోసం ఓ ప్రాజెక్ట్‌ సిద్ధం అవుతోంది. అదెలా కుదురుతుంది?, రెండు నగరాల మధ్య భూ మార్గం లేదు కదా, మధ్యలో అరేబియా సముద్రం ఉంది కదా అన్న డౌట్‌ వచ్చిందా?. మీరు సరిగ్గానే ఆలోచించారు. భూ మార్గం లేకపోయినప్పటికీ రైలు ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారు. ఈ రైలు నీటి అడుగున, అంటే అరేబియా సముద్రం లోపల నుంచి ప్రయాణిస్తుంది. అండర్‌ వాటర్‌ హై స్పీడ్‌ ట్రైన్‌ అన్నమాట.

విమానం కన్నా వేగంగా...
ముంబైలో బయలు దేరి అరేబియా సముద్రంలో దిగి, నీటి అడుగున నడిచే ఈ హై స్పీడ్ రైలు మళ్లీ దుబాయ్‌లో రోడ్డు ఎక్కుతుంది. తద్వారా, ముంబై - దుబాయ్ మధ్య ప్రయాణ సమయాన్ని చాలా ఆదా చేస్తుంది. ఈ కొత్త రైలు అందుబాటులోకి వస్తే రెండు నగరాల మధ్య దాదాపు 2000 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల్లోనే అధిగమించవచ్చు & విమానం కన్నా వేగంగా వెళ్లవచ్చు.

గంటకు 1000 కిలోమీటర్ల వేగం!
UAE నేషనల్‌ అడ్వైజర్‌ బ్యూరో ప్రణాళిక ప్రకారం, దుబాయ్ - ముంబై మధ్య నీటి అడుగున రైలు మార్గం అనుసంధానాన్ని పరిశీలిస్తున్నారు, ఇది ప్రయాణ సమయాన్ని కేవలం 2 గంటలకు తగ్గిస్తుంది. ఈ హై స్పీడ్ రైలు వేగం గంటకు 600 కిలోమీటర్ల నుంచి 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లవచ్చు. గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో వెళితేనే, ముంబై - దుబాయ్‌ మధ్య ఉన్న దాదాపు 2000 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల్లో చేరుతుంది.

వాస్తవానికి ఈ ప్రాజెక్ట్‌ కొత్తదేమీ కాదు, ముంబై నుంచి దుబాయ్ వరకు అండర్ వాటర్ రైలు ప్రాజెక్టును కొన్ని సంవత్సరాల క్రితమే ప్రతిపాదించారు. దానికి అవసరమైన ఆమోదాలు పొందడంలో పురోగతి లేక ఆ ప్రతిపాదన కోల్డ్ స్టోరేజీలోకి చేరింది. ఈ ప్రతిపాదిత రైలు నెట్‌వర్క్ విమాన ప్రయాణికులకు మరొక జర్నీ ఆప్షన్‌ను అందిస్తుంది, ఎయిర్‌ రష్‌ను తగ్గిస్తుంది. రద్దీ తగ్గితే డిమాండ్‌ కూడా తగ్గుతుంది, ఆటోమేటిక్‌గా టిక్కెట్‌ ధరలు తగ్గే అవకాశం కూడా ఉంది. మరోవైపు, ఇది భారతదేశం - UAE (United Arab Emirates) మధ్య ముడి చమురు & వస్తువుల రవాణాను మరింత సులభంగా మారుస్తుంది.

అండర్‌ వాటర్‌ రైల్‌ నెట్‌వర్క్ ద్వారా ప్రయాణీకులు మొత్తం ప్రయాణంలో నీటి అడుగున ప్రపంచంలోని ఆహ్లాదకరమైన అనుభవాన్ని ఆస్వాదించగలుగుతారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే భవిష్యత్తులో బిలియన్ల రూపాయల పెట్టుబడులు ఈ ప్రాజెక్టులోకి ప్రవహిస్తాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ముంబై - దుబాయ్‌ అండర్‌ వాటర్‌ ట్రైన్‌ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ లభిస్తే, ఈ రైలు 2030 నాటికి పరుగులు తీయవచ్చు. ప్రస్తుతం, రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. వివిధ ఆమోదాలు, ఆర్థిక పెట్టుబడులపై ఈ ప్రాజెక్టు వేగం ఆధారపడి ఉంటుంది.

టాప్ హెడ్ లైన్స్

Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget