Best Selling Car: పంచ్, క్రెటా, బ్రెజ్జాను మించిన కార్, అమ్మకాల్లో నంబర్ 1, ధర రూ.6 లక్షలు కూడా కాదు
Best Selling Maruti Car: మారుతి వ్యాగన్ ఆర్ అత్యధిక మైలేజ్ ఇచ్చే కార్లలో ఒకటి. ఫేవరబుల్ ఫీచర్లు &మేలైన మైలేజీ కారణంగా ప్రజల అభిమాన కార్‌ల లిస్ట్‌లోకి ఎక్కింది.

Maruti Wagon R Sales Report 2025: భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్‌లలో మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఒకటి. ఈ కారు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో (FY25), భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ కారుగా నిలిచింది. ఈ రికార్డ్ దీనికి కొత్తేమీ కాదు. ధర, ఫీచర్లు, మైలేజ్ వంటివి వ్యాగన్ఆర్‌ను కార్ కొనుగోలుదార్ల ఫస్ట్ ఆప్షన్‌గా నిలిపాయి.
మారుతి వ్యాగన్ఆర్ మీద ప్రజల ప్రేమ నిరంతరం పెరుగుతోంది. ఈ సంవత్సరం 1,98,451 యూనిట్ల వ్యాగన్ఆర్ అమ్మకాలు జరిగాయి, అమ్మకాల రేస్‌లో ఇది దేశంలో నంబర్-1 పొజిషన్‌లో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2,00,177 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ సంవత్సరం కూడా, మారుతి సుజుకికి చెందిన 7 కార్లు టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలోకి చేరాయి.
కస్టమర్లు WagonR ను ఎందుకు ఇష్టపడుతున్నారు?
దీనికి ఒకటో, రెండో కారణాలు చెప్పలేం, చాలా కారణాల వల్ల వినియోగదారులు మారుతి సుజుకి వ్యాగన్ఆర్‌ను ఇష్టపడుతున్నారు. మొదటి కారణం దాని అఫర్డబుల్ ప్రైస్. మధ్య తరగతి ప్రజలు కూడా కొనేలా, వ్యాగన్ఆర్ ధర కేవలం రూ. 5.54 లక్షల (ఎక్స్ షోరూమ్ ధర) నుంచి ప్రారంభం అవుతుంది. గొప్ప మైలేజీకి కూడా పాపులర్ అయిన కార్ ఇది. పెట్రోల్ & CNG ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది, ఇంధనాన్ని అద్భుతంగా ఆదా చేసే కార్ (Fuel-efficient car)గా నిలిచింది. ఈ కార్‌లో సౌకర్యవంతమైన క్యాబిన్ & అత్యాధునిక సాంకేతికతలు వంటివి ఎవరైనా దీనిని ఇష్టపడేలా చేస్తాయి.
వాగన్ఆర్ ధర, ఫీచర్లు (WagonR Price and Features)
వాగన్ఆర్ బేసిక్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.54 లక్షలు కాగా, టాప్-ఎండ్ మోడల్ రూ. 7.33 లక్షల వరకు ఉంది. 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 4 స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో & ఫోన్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు అదనపు ఆకర్షణలు. 14 అంగుళాల అల్లాయ్ వీల్స్ మీద వాగన్ఆర్ కారు స్టైల్‌గా నిలబడుతుంది & స్మూత్‌గా పరుగులు తీస్తుంది. ముందు కూర్చున్నవాళ్ల సేఫ్టీ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు సిద్ధంగా ఉంటాయి. రివర్స్ పార్కింగ్ చేసేప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెనుక వైపు సెన్సార్లు కూడా ఉన్నాయి. మొత్తంగా, ఇది ఒక పరిపూర్ణమైన ఫ్యామిలీ కారు అన్నది ఇండస్ట్రీ నిపుణుల మాట.
పవర్‌ట్రెయిన్, ఇంజిన్ (WagonR Powertrain and Engine)
వాగన్ఆర్ కొనే వాళ్ల ముందు రెండు ఇంజిన్ ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఇది 67bhp పవనర్‌ను & 89Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రెండోది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, ఇది 90bhp శక్తిని & 113Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. రెండు ఇంజన్లు 5-స్పీడ్ మాన్యువల్ & 5-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో లింక్ అయి ఉంటాయి.
2024-25 ఆర్థిక సంవత్సరంలో, ఇతర బ్రాండ్లను బీట్ చేసి, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ బెస్ట్ సెల్లింగ్ కార్‌గా స్పీడ్ ట్రాక్ మీద ఉంది. అందుబాటు ధర, మంచి మైలేజ్, సూపర్ ఫీచర్లు, శక్తిమంతమైన ఇంజిన్ ఈ కార్‌కు పరిపూర్ణతను ఆపాదించాయి. మీరు రూ. 6 లక్షల కంటే తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన కార్ కొనాలనుకుంటే, వ్యాగన్ఆర్ గురించి ఆలోచించవచ్చని ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

