LSG vs DC Match Highlights IPL 2025 | లక్నో సూపర్ జెయింట్స్ పై 8వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం | ABP Desam
12 పాయింట్లు దక్కించుకోవటం..పాయింట్స్ టేబుల్ లో టాప్ 2 స్థానాన్ని మరింత పదిలం చేసుకోవటమే లక్ష్యంగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ రెండు జట్లూ ఈ రోజు ఐపీఎల్ మ్యాచ్ లో తలపడ్డాయి. అయితే రిషభ్ పంత్ ను కాదని ఈ సారి అదృష్టం అక్షర్ పటేల్ నే వరించి ఈ మ్యాచ్ లో లక్నో పై ఢిల్లీ క్యాపిటల్స్ 8వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.
1. దంచికొట్టిన మార్ క్రమ్, మార్ష్
టాస్ గెలిచి లక్నో ఎకానా స్టేడియంలో బౌలింగ్ ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. అయితే అక్షర్ పటేల్ తీసుకున్న నిర్ణయం తప్పా అనిపించేలా చెలరేగిపోయారు లక్నో ఓపెనర్లు ఏడెన్ మార్ క్రమ్ అండ్ మిచ్ మార్ష్. ఢిల్లీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ మార్ క్రమ్ 33 బాల్స్ లో 2 ఫోర్లు 3 సిక్సర్లతో వరుసగా రెండో హాఫ్ సెంచరీ ని ఈసీజన్ లో సాధిస్తూ 52 పరుగులు చేసి చమీరా బౌలింగ్ లో స్టబ్స్ కి క్యాచ్ ఇచ్చి అయిపోయాడు. ఫలితంగా మొదటి వికెట్ కే మార్ క్రమ్, మార్ష్ కలిసి 87పరుగుల పార్టనర్ షిప్ పెట్టారు. మరో వైపు మిచ్ మార్ష్ కూడా ఈ సీజన్ లో తన ఫామ్ ను కంటిన్యూ చేస్తూ 36 బాల్స్ లో 45 పరుగులు చేసి మార్ క్రమ్ కు అద్భుతంగా సపోర్ట్ చేశాడు.
2. ఆయుష్ బడోనీ అదిరే క్యామియో
మార్ క్రమ్ అవుటయ్యాక వచ్చిన పూరన్ 9, సమద్ 2, డేవిడ్ మిల్లర్ 14 పరుగులకే అవుటైపోవటంతో LSG పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈలోగా మిచ్ మార్ష్ వికెట్ కూడా కోల్పోయింది. అనూహ్యంగా కుప్పకూలిన లక్నో మిడిల్ ఆర్డర్ కారణంగా కనీసం LSG కనీసం 150 మార్క్ నైనా టచ్ చేస్తుందా అనే సందేహాలు కలిగాయి. ఆ టైమ్లో వచ్చిన ఆయుష్ బడోని మంచి క్యామియో ఆడాడు. 21 బాల్స్ ఆడి 6 ఫోర్లతో 36పరుగులు చేశాడు. పంత్ డకౌట్ అయినా ఢిల్లీ ముందు 160 పరుగుల టార్గెట్ అన్నా పెట్టగలిగేలా చేశాడు ఆయుష్ బడోనీ.
3. ముకేశ్ కుమార్ మాస్
మార్ క్రమ్, మిచ్ మార్ష్ ఓఫెనింగ్ చూసినవాడు ఎవడైనా ఈరోజు LSG ఈజీగా 200 దాటేస్తుంది అనుకుంటారు కానీ ముకేశ్ కుమార్ మాత్రం మ్యాజిక్ చేశాడు. మిచెల్ మార్ష్, అబ్దుల్ సమద్, ఆయుష్ బడోనీ, రిషభ్ పంత్ లను పెవిలియన్ కు పంపించాడు ముకేశ్. తీసుకున్న నాలుగు వికెట్లలో మూడు క్లీన్ బౌల్డ్స్..మరొకటి క్యాచ్ అండ్ బౌల్ ముకేశ్ కుమారే. అలా 4 ఓవర్లలో 33 పరుగులు మాత్రమే ఇచ్చి LSG ని ఊహించని దెబ్బ తీశాడు ముకేశ్ కుమార్.
4. రప్పా రప్పా పోరెల్
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఢిల్లీకి మంచి ఆరంభమే ఇచ్చారు అభిషేక్ పోరల్, కరుణ్ నాయర్. వేగంగా ఆడే ప్రయత్నంలో కరుణ్ నాయర్ అయిపోయినా కేఎల్ రాహుల్ తో కలిసి LSG బౌలింగ్ ను సమర్థంగా ఎదుర్కొన్నాడు అభిషేక్ పోరెల్. రాహుల్ స్ట్రైక్ రొటేట్ చేయటానికి పరిమితం అయితే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ పోరెల్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 36 బాల్స్ ఆడి 5 ఫోర్లు ఓ సిక్స్ తో 51 పరుగులు చేసి ఢిల్లీని లక్ష్యం దిశగా నడిపించాడు అభిషేక్ పోరెల్.
5. కేఎల్ రాహుల్ క్లాస్
ఈ స్లో వికెట్ మీద ఆవేశపడటం కాదు కావాల్సింది వివేకంతో ఆచి తూచి చూడాలి. అచ్చం కేఎల్ ఈ రోజు అదే పని చేశాడు. ముందంతా పోరెల్ కి స్ట్రైక్ రొటేట్ చేస్తూ గడిపిన రాహుల్..వన్స్ పోరెల్ అవుట్ అవ్వగానే ఇన్నింగ్స్ నడిపే బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నాడు. కొట్టాల్సిన స్కోరు కావటంతో కంగారు పడకుండా తనదైన శైలిలో ఆడుతూ 42బంతుల్లో 3ఫోర్లు 3సిక్సర్లతో 57పరుగులు చేసి కేఎల్ రాహుల్ తన క్లాస్ ఆటను చూపించాడు. రాహుల్ కి తోడుగా కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా 20 బంతుల్లో 4 సిక్సర్లు ఓ ఫోర్ తో 34 పరుగులు చేసి తోడ్పాటును అందించటంతో ఢిల్లీ LSG పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ విజయంతో పాయింట్స్ టేబుల్ లో తన టాప్ 2 లో స్థానాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మరింత పటిష్ఠం చేసుకోగా...LSG మ్యాచ్ ఓడినా ఐదో స్థానంలోనే కొనసాగుతోంది.





















