Cheapest Data Plans: ఎయిర్‌టెల్, జియో, BSNLలో ఈ డేటా ప్లాన్స్ బహు చవక! హ్యాపీగా IPL చూడండి
Cheapest Internet Plans: భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగం ఏటికేడు పెరుగుతోంది. అన్ని టెలికాం కంపెనీలు సాధ్యమైనంత తక్కువ రేట్లకు డేటా ప్లాన్‌లు అందించడానికి పోటీ పడుతున్నాయి.

Cheapest Data Plans Of Airtel, Jio And BSNL: భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగం వేగంగా పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్న అన్ని టెలికాం కంపెనీలు తమ కస్టమర్లకు చవకైన ధరలకు డేటా ప్లాన్‌లను అందించడానికి, వారిని ఆకర్షించడానికి పోటీ పడుతున్నాయి. అందునా ఇది IPL సీజన్. పొట్టి క్రికెట్ మ్యాచ్‌లు కోడిపందేల్లా యమా రంజుగా సాగుతున్నాయి & ఊహించని ఫలితాలను అందిస్తున్నాయి. IPL ఫీవర్‌ను ఫేవర్‌గా మార్చుకోవడానికి ప్రభుత్వ రంగంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), ప్రైవేట్ రంగంలోని ఎయిర్‌టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio) పోటీ పడుతున్నాయి. దేశంలోని ఈ ప్రధాన టెలికాం కంపెనీలు, తమ యూజర్లకు పోటీ రేట్లకు చవకైన రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. ముఖ్యంగా, IPL మ్యాచ్‌లను చూడడానికి చాలా తక్కువ ధరలకు ఇంటర్నెట్/ డేటా ప్లాన్‌లు ఆఫర్ చేస్తున్నాయి.
తక్కువ రేటు డేటా ప్లాన్‌లు (Low rate data plans)
BSNL చవకైన ఇంటర్నెట్/డేటా ప్లాన్
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL, తక్కువ ధరలకు డేటా ప్లాన్‌లు అందించడంలో ఎప్పుడూ ముందుంటుంది. BSNL చవకైన ఇంటర్నెట్ ప్లాన్ కేవలం 16 రూపాయల నుంచి ప్రారంభం అవుతుంది. అంటే, బయట ఒక టీ తాగిన ధరకు దాదాపు సమానం. BSNL Rs 16 Data Planతో రీఛార్జ్ చేసుకున్న యూజర్లు 2 GB డేటా పొందుతారు, దాని చెల్లుబాటు గడవు (Validity) ఒక రోజు. ఇది కాకుండా, BSNL రూ. 98 ప్లాన్ (BSNL Rs 98 Data Plan)తో 22 రోజుల పాటు రోజుకు 2 GB డేటా అందిస్తోంది.
ఎయిర్‌టెల్ నుంచి తక్కువ ధరకు ఇంటర్నెట్/డేటా ప్లాన్
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీలలో ఎయిర్‌టెల్ ఒకటి. ఈ కంపెనీ తన కస్టమర్లకు తక్కువ ధరలకు & హై-స్పీడ్ ఇంటర్నెట్ ప్లాన్‌లు అందిస్తోంది. ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తున్న చవకైన డేటా ప్యాక్ రూ. 19 కి వస్తుంది. Airtel Rs 19 Data Planతో రీఛార్చ్ చేసుకుంటే 1 GB డేటా లభిస్తుంది, 1 రోజు మొత్తం చెల్లుబాటు అవుతుంది. మీకు ఇంకొంచం ఎక్కువ డేటా కావాలంటే రూ.100 ప్లాన్ (Airtel Rs 100 Data Plan)తో 5 GB డేటా మీ మొబైల్ ఫోన్‌లో యాడ్ అవుతుంది.
పోటీ రేటుతో జియో ఇంటర్నెట్/డేటా ప్లాన్
రిలయన్స్ జియో గురించి చెప్పుకుంటే, పోటీ పడడంలో ఈ కంపెనీ ప్రసిద్ధి చెందింది, ఆ విషయం మీకూ తెలుసు. అత్యంత చవకైన & ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్‌లు లాంచ్ చేసి ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపిస్తుంది & అవసరమైతే 'ఫ్రీ ఆఫర్‌లు' కూడా ఇస్తుంది. జియో ఆఫర్ చేస్తున్న అత్యంత చవకైన ఇంటర్నెట్ ప్లాన్ ధర రూ. 15. దీనిలో (Jio Rs 15 Data Plan) వినియోగదారులకు 1 GB డేటా వస్తుంది, దీనిని 1 రోజు మొత్తం వినియోగించుకోవచ్చు. అదే సమయంలో, జియో రూ. 91 ప్లాన్ (Jio Rs 91 Data Plan) 28 రోజుల వ్యాలిడిటీతో ఉంటుంది & మొత్తం 6 GB డేటా అందిస్తుంది. అంటే, ఈ 6 GB డేటాను 28 రోజుల పాటు యూజ్ చేసుకోవచ్చు. తక్కువ ఇంటర్నెట్ ఉపయోగించే వ్యక్తులకు ఇది మంచి ఆప్షన్ అవుతుంది.
BSNL, Airtel, Jio మూడు టెలికాం సంస్థలు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్‌లు లాంచ్ చేస్తున్నాయి, సాధ్యమైనంత తక్కువ ధరకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

