New Smartphone Models: మోటో నుంచి వివో వరకు - ఏప్రిల్‌లో స్మార్ట్‌ఫోన్‌ల పండుగ
Trending Smartphones 2025: మార్చి నెలలో, మన దేశ మార్కెట్‌లోకి చాలా కొత్త స్మార్ట్‌ఫోన్‌లు వచ్చాయి. ఇప్పుడు, ఏప్రిల్‌లో కూడా అనేక కొత్త స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి.

Upcoming Smartphones in April 2025: మార్చి నెలలో దేశీయ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా కొత్త స్మార్ట్‌ఫోన్‌లు టెక్ ప్రియుల మనస్సులు దోచుకున్నాయి. ఈ నెలలో (ఏప్రిల్) కూడా అనేక కొత్త స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఈ లిస్ట్‌లో మోటరోలా, పోకో, ఐకూ, వివో నుంచి వివో వరకు స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌తో ఈ నెల స్మార్ట్ ఫోన్ల లాంచింగ్ ప్రారంభం అవుతుంది.
ఏప్రిల్‌లో మార్కెట్‌లోకి రానున్న స్మార్ట్‌ఫోన్‌లు
మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ (Moto Edge 60 Fusion Smartphone)
మోటరోలా కంపెనీ, మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ స్మార్ట్ ఫోన్ ఈ రోజు (బుధవారం, ఏప్రిల్ 02, 2025) మన దేశంలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో అందుబాటులో ఉంటుంది & దీని కోసం ఆ ఫ్లాట్‌ఫామ్‌లో స్పెషల్ లైవ్ పేజీ కూడా రన్ అవుతుంది. Moto Edge 60 Fusion స్మార్ట్ ఫోన్ 1.5K ఆల్-కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లేతో ప్యాక్ అయింది. ఈ ఫోన్ ధర దాదాపు రూ. 35,000 ఉంటుందని భావిస్తున్నారు.
పోకో సి71 (POCO C71 Smartphone)
పోకో కంపెనీ, తన కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ పోకో C71 ను ఏప్రిల్ 04, 2025న భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. కంపెనీ, ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఈ కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తుంది. POCO C71 స్మార్ట్ ఫోన్ ధర రూ. 20,000 వరకు ఉండవచ్చని చెబుతున్నారు.
ఐకూ జెడ్10 5G ఫోన్ (iQOO Z10 Smartphone)
iQOO నుంచి Z10 5G మోడల్ ఫోన్ ఏప్రిల్ 11న భారతీయ మార్కెట్లోకి అడుగు పెడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అత్యంత నాజూకుగా, కేవలం 0.789 సెం.మీ. మందంతో ఉంటుంది. ఈ ఫీచర్ కారణంగా ఇది మార్కెట్లో అత్యంత సన్నని స్మార్ట్ ఫోన్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. దీనిలో అత్యంత భారీగా 7300mAh బ్యాటరీని అమర్చారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. దీనిని అమెజాన్ (Amazon)లో ప్రత్యేకంగా అమ్ముతారు, లైవ్ పేజీ ఉంటుంది. దీని ధర కూడా దాదాపు 20,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు ఉండవచ్చు.
వివో T4 5G (Vivo T4 5G Smartphone)
Vivo కంపెనీ, T3 5G మోడల్‌కు అప్‌డేటెడ్ వెర్షన్‌గా Vivo T4 5Gని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే, ఈ ఫోన్ గురించి పెద్దగా సమాచారం వెల్లడించలేదు. రిపోర్ట్స్ ప్రకారం, ఈ స్మార్ట్ ఫోన్‌ను ఈ నెలలో ఎప్పుడైనా లాంచ్ చేయవచ్చు. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ అవుతుందని భావిస్తున్నారు. కంపెనీ ఈ ఫోన్ రూ. 25,000 పరిధిలో విడుదల చేయవచ్చు.
వివో వి50e (Vivo V50e Smartphone)
వివో V50 సిరీస్‌లో రెండో స్మార్ట్‌ఫోన్ వివో V50e. దీనిని కూడా త్వరలో భారత మార్కెట్లో లాంచ్ చేయనున్నారు. అయితే, కంపెనీ ఇంకా అధికారిక లాంచ్ డేట్‌ను ప్రకటించలేదు, నివేదికల ప్రకారం, ఏప్రిల్ నెల సగానికి వచ్చిన సమయంలో దీనిని లాంచ్ చేయవచ్చు. Vivo V50e ధర రూ. 30,000 పరిధిలో ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

