Ghibli Images: చాట్‌జీపీటీలోనే కాదు - గూగుల్ జెమినీ, X గ్రోక్‌లోనూ జీబ్లీ స్టైల్ చిత్రాలు క్రియేట్ చేయొచ్చు
Ghibli-style Images: స్టుడియో జీబ్లీ స్టైల్ చిత్రాలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి, టెక్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. టెక్ ప్రియులు తమ ఊహలకు పదును పెడుతూ విభిన్న AI చిత్రాలు సృష్టిస్తున్నారు.

Creating Studio Ghibli-style AI Images: ఆధునిక జపాన్ కార్టూన్ స్టైల్‌లో ఉండే జీబ్లీ స్టైల్ చిత్రాలు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి, టెక్ ప్రపంచాన్ని ఊపేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడన్నీ ఈ ఫోటోలే కనువిందు చేస్తున్నాయి. కొందరు, తమ ఫోటోలను స్టుడియో జీబ్లీ స్టైల్ AI ఇమేజెస్‌లా మారుస్తుంటే.. మరికొందరు, తమ ఊహలతో ప్రాంప్టింగ్ చేస్తూ అద్భుతమైన AI ఇమేజ్‌లు క్రియేట్ చేస్తున్నారు.
ఇటీవల, ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీలో జీబ్లీ స్టైల్ ఫిల్టర్‌ను పరిచయం చేశారు. చాట్‌జీపీటీలో కొత్తగా యాడ్ చేసిన ఇమేజ్ జనరేటర్ ఎఫెక్ట్స్‌లో భాగంగా జీబ్లీ స్టైల్‌ను కూడా తీసుకొచ్చారు. ఓపెన్‌ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ (Sam Altman) స్వయంగా ఈ స్టైల్ గురించి వివరించడంతో పాటు, తన సహచరులతో కలిసి తీసుకున్న ఫొటోను జీబ్లీ స్టైల్ AI ఇమేజ్‌లా మార్చి చూపించారు. దీంతో, ఇది రాకెట్ కన్నా వేగంగా ప్రపంచాన్ని చుట్టేసింది. ఓ దశలో, జీబ్లీ స్టైల్ AI ఇమేజ్‌ల తాకిడిని తట్టుకోలేక ఓపెన్‌ఏఐ సర్వర్లు హ్యాంగ్ అయ్యాయి. దీంతో, ఫ్రీ యూజర్లు రోజుకు 3 కంటే ఎక్కువ జీబ్లీ స్టైల్ చిత్రాలు సృష్టించకుండా ఓపెన్‌ఏఐ పరిమితి విధించింది & ఏప్రిల్ 01, 2025న ఆ పరిమితి ఎత్తి వేసింది. ఇప్పుడు, చాట్‌జీపీటీ పెయిడ్ యూజర్లతో పాటు ఫ్రీ యూజర్ల కూడా జిబ్లీ ఫిల్టర్‌తో ఎన్ని చిత్రాలైనా సృష్టించొచ్చు.
చాట్‌జీపీటీలో జీబ్లీ స్టైల్ చిత్రాలను ఎలా జనరేట్ చేయాలి?
చాట్‌జీపీటీ వెబ్‌సైట్ లేదా యాప్ ఓపెన్ చేయండి
హోమ్ పేజీలో పైభాగంలో కనిపించే చాట్‌జీపీటీ మీద క్లిక్ చేస్తే డ్రాప్‌డౌన్ మెనూలో ఓపెన్ అవుతుంది. దానిలో చాట్‌జీపీటీ 4o మీద క్లిక్ చేయండి.
మీరు వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఉంటే, 'ప్లస్' గుర్తు కనిపిస్తుంది. యాప్‌లో 'ఇమేజ్' గుర్తు కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి.
ప్లస్ లేదా ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత అది మీ ఇమేజ్ ఫోల్డర్‌లోకి తీసుకెళ్తుంది.
జీబ్లీ స్టైల్‌లోకి మార్చాలనుకునే ఫొటోను ఆ ఇమేజ్ ఫోల్డర్ నుంచి అప్‌లోడ్ చేయాలి.
ఆ తర్వాత, మీరు అప్‌లోడ్ చేసిన ఫొటోను జీబ్లీ స్టైల్‌లోకి మార్చమంటూ చాట్‌జీపీటీలో ప్రాంప్ట్ ఇవ్వాలి (టైప్ చేయాలి).
జీబ్లీ స్టైల్‌లోకి మారిన ఇమేజ్ క్రమంగా ఓపెన్ అవుతుంది, దీనికి కొన్ని నిమిషాల సమయం పడుతుంది.
చాట్‌జీపీటీతో పాటు గూగుల్ జెమినీ, X (గతంలో ట్విట్టర్) గ్రోక్‌లోనూ స్టుడియో జీబ్లీ స్టైల్ ఇమేజ్‌లు క్రియేట్ చేయొచ్చు, మార్పులు కూడా చేయొచ్చు.
X గ్రోక్‌లో జీబ్లీ స్టైల్ చిత్రాలను ఎలా జనరేట్ చేయాలి?
గ్రోక్ వెబ్‌సైట్ లేదా యాప్ ఓపెన్ చేయండి.
మీ ఫోన్‌లో X యాప్ ఉంటే, దానిని ఓపెన్ చేసి గ్రోక్ సింబల్ మీద క్లిక్ చేయండి.
గ్రోక్ 3 మోడల్‌లోనే జీబ్లీ స్టైల్ ఫిల్టర్ ఉంటుంది కాబట్టి, మీరు ఓపెన్ చేసిన పేజీ గ్రోక్ 3 మోడల్‌లో ఉందో, లేదో చూసుకోవాలి.
గ్రోక్ 3 మోడల్ పేజీ ఓపెన్ అయిన తర్వాత, కింద వైపు ఎడమ పక్క కనిపించే పేపర్ క్లిప్ గుర్తు మీద క్లిక్ చేయాలి.
ఇప్పుడు, జీబ్లీ స్టైల్‌లోకి మార్చాలనుకుంటున్న ఫోటోను అప్‌లోడ్ చేయండి.
ఇమేజ్ అప్‌లోడ్ అయిన తర్వాత, దానిని జీబ్లీ స్టైల్‌లోకి మార్చమంటూ ప్రాంప్ట్ ఇవ్వండి.
ఆ ఫోటో జీబ్లీ స్టైల్‌లోకి మారుతుంది.
ఒకవేళ, మీరు ఆ ఫోటోలో మార్పులు చేయాలనుకుంటే, సరైన ప్రాంప్టింగ్‌తో ఆ పని చేయవచ్చు.
గూగుల్ జెమినిలో జీబ్లీ స్టైల్ చిత్రాలను ఎలా జనరేట్ చేయాలి?
గూగుల్ జెమిని వెబ్‌సైట్ (gemini.google.com) లేదా యాప్‌ను ఓపెన్ చేయండి.
టెక్ట్స్ బాక్స్‌లో కనపించే పేపర్‌క్లిప్ ఐకాన్ లేదా కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేయండి.
జీబ్లీ స్టైల్‌లోకి మార్చాలనుకునే ఫోటోను అప్‌లోడ్ చేయండి.
ఆ ఫోటోను స్టుడియో జీబ్లీ స్టైల్‌లోకి మార్చమని టైప్ చేయండి/ప్రాంప్ట్ ఇవ్వండి.
ప్రాప్టింగ్ తర్వాత ఎంటర్ బటన్ మీద క్లిక్ చేయగానే ఆ ఫోటో జీబ్లీ స్టైల్ AI ఇమేజ్‌గా మారిపోతుంది.
మీరు ఏ ఫ్లాట్‌ఫామ్ ఉపయోగించినా, జీబ్లీ స్టైల్ AI ఇమేజ్‌లను డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు & షేర్ చేయవచ్చు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

