Foods that Delay Periods : పీరియడ్స్ లేట్‌గా రావడానికి ఈ ఫుడ్సే కారణం.. సరైన టైమ్‌కి రావాలంటే తినాల్సినవి ఇవే
Period Delay : పీరియడ్స్ చాలామందికి ఇర్రెగ్యులర్గా వస్తాయి. దానికి వివిధ కారణాలు ఉన్నాయి. అయితే ఫుడ్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుందని.. కొన్ని ఫుడ్స్ పీరియడ్స్‌ని డిలే చేస్తాయని చెప్తున్నారు.

Causes of Period Delay Related to Food : ప్రతి నెల అమ్మాయిలకు పీరియడ్స్ వస్తాయి. అయితే అది టైమ్‌కి వస్తే మాత్రం మెడికల్ మిరాకిల్ అనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది అమ్మాయిలకు వివిధ సమస్యల వల్ల పీరియడ్స్ డిలే అవుతూ ఉంటాయి. టైమ్‌కి వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ.. సమయానికి రాకపోతే ఎప్పుడెప్పుడూ వస్తుందా అనే టెన్షన్లో ఉంటారు. ఈ సమస్య వల్లే చాలామంది బయటకు వెళ్లే ప్లాన్స్ కూడా వాయిదా వేసుకుంటారు. సమయానికి వస్తే పర్లేదు కానీ రాకుంటేనే ఇబ్బంది.
పీరియడ్స్ లేట్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి, లైఫ్ స్టైల్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. వీటితో పాటు ఫుడ్ కూడా పీరియడ్స్ విషయంలో మేజర్ రోల్ పోషిస్తుందని చెప్తున్నారు నిపుణులు. కొన్ని ఫుడ్స్ తింటే పీరియడ్స్ లేట్‌గా వస్తాయని.. కొన్ని ఫుడ్స్ తినడం వల్ల పీరియడ్ సమస్యలు దూరమవుతాయని చెప్తున్నారు. మరి డైట్లో చేర్చుకోకూడని ఫుడ్స్ ఏంటో.. ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూసేద్దాం.
పీరియడ్స్‌ని ఆలస్యం చేసే ఫుడ్స్ ఇవే..
ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్ తీసుకోకూడదు. చిప్స్, ఫాస్ట్ ఫుడ్, షుగర్ స్నాక్స్ హార్మోనల్ సమస్యలు పెంచి.. పీరియడ్ సైకిల్ని డిస్టర్బ్ చేయడం, ఆలస్యం చేయడం చేస్తాయి. కెఫిన్ కూడా మంచిది కాదు. ఎక్కువగా కాఫీ తాగే అలవాటు ఉన్నా.. ఎనర్జీ డ్రింక్స్ తీసుకున్నా.. బ్లాక్ కాఫీ వంటి కెఫిన్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ కార్టిసాల్‌ని పెంచి.. పీరియడ్స్‌ని ఆలస్యం చేస్తాయి.
సోయా టోఫు, మిల్క్, బీన్స్‌లలో ప్లాంట్ ఈస్ట్రోజెన్స్ ఉంటాయి. ఇవి హార్మోనల్ సమస్యలు పెంచుతాయి. రెడ్ మీట్ కూడా మంచిది కాదు. ఇన్ఫ్లమేషన్ని పెంచి పీరియడ్ సైకిల్ని డిస్టర్బ్ చేస్తాయి. ఆర్టిఫిషయల్ స్వీట్స్, చాక్లెట్లు, ఇతర స్వీట్స్‌కి దూరంగా ఉండాలి. ఇవి ఇన్సులిన్‌తో పాటు హార్మోనల్ సమస్యలు పెంచుతాయి. పీరియడ్స్‌ని ఆలస్యం చేస్తాయి. ఆల్కహాల్ కూడా మంచిది కాదు. లివర్ సమస్యలను పెంచడంతో పాటు హార్మోనల్ సమస్యలు పెంచుతుంది.
పీరియడ్‌ని రెగ్యులేట్ చేసే ఫుడ్స్ లిస్ట్..
తేటకూర, కాలే వంటి ఆకుకూరల్లో ఐరన్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది పీరియడ్ హెల్త్‌కి మంచిది. చేపల్లో ఒమేగా 3 ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ని తగ్గించి హార్మోన్స్ బ్యాలెన్స్‌గా ఉండేలా చేస్తాయి. అవిసెగింజలు, చియా సీడ్స్, బాదం, వాల్నట్స్ కూడా మంచిది. ఈస్ట్రోజన్ లెవెల్స్‌ని పెంచి పీరియడ్స్‌ని డిలే అవ్వకుండా హెల్ప్ చేస్తాయి. బొప్పాయి కూడా పీరియడ్స్ సమస్యలను దూరం చేస్తుంది. పైనాపిల్, బెర్రీలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి.
బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా కూడా బ్లడ్‌లోని షుగర్ లెవెల్స్‌ని అదుపులోకి తెచ్చి హార్మోనల్ సమస్యలు రాకుండా పీరియడ్స్ సమయానికి వచ్చేలా హెల్ప్ చేస్తాయి. పప్పులు, శనగలు, బ్లాక్ బీన్స్‌లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండి.. హార్మోన్ డీటాక్స్‌కి హెల్ప్ చేస్తాయి. అవకాడో, ఆలివ్, కొబ్బరి నూనెల్లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. హార్మోన్ ప్రొడెక్షన్కి మంచివి. పసుపు, అల్లం, దాల్చిన చెక్క కూడా PCOS సమస్యల్ని దూరం చేస్తాయి. డార్క్ చాక్లెట్ కూడా మంచిది.
హైడ్రేటెడ్‌గా ఉంటూ.. షుగర్ కంట్రోల్ చేస్తూ.. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఉంటే పీరియడ్స్ ఆలస్యంగా రావడం మానేస్తాయి. పరిస్థితి మారట్లేదు అనుకుంటే కచ్చితంగా వైద్యుల సూచనలు తీసుకోవాల్సి ఉంటుంది.






















