అన్వేషించండి

Bhu Bharati Portal: భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం

TG Minister Ponguleti Srinivas Reddy | ఒకే గొడుగు కిందకు రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్‌, స‌ర్వే విభాగాలు తీసుకొచ్చి భూభారతి పోర్టల్ తో అనుసంధానం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Telangana News | హైదరాబాద్: రాష్ట్రంలో భూ పరిపాలన వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా ప్రజలకు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రెవెన్యూ, స్టాంప్స్ & రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకువస్తూ, వాటిని భూభారతి పోర్టల్‌ (Bhu Bharati Portal)తో అనుసంధానం చేస్తున్నట్లు తెలంగాణ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు. ఆధునీకరించిన ఈ నూతన వ్యవస్థను వచ్చే ఏడాది జనవరి నెలలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు.

సీసీఎల్ఏ కార్యాలయ పనితీరుపై అసంతృప్తి
 నాంపల్లిలోని భూ పరిపాలన ప్రధాన కార్యాలయాన్ని (CCLA) మంత్రి పొంగులేటి సోమవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయ నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, ప్రభుత్వ కార్యాలయాలు కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ఆధునిక హంగులతో ఉండాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో తాను మళ్లీ తనిఖీ చేసే సమయానికి ఆఫీసులో స్పష్టమైన మార్పు కనిపించాలని హెచ్చరించారు. అలాగే, ప్రతి విభాగంపై వరుస సమీక్షలు నిర్వహిస్తామని, అధికారులు పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు.Bhu Bharati Portal: భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం

పెండింగ్ కేసులు, రికార్డుల ప్రక్షాళన
దశాబ్దాల క్రితం ప్రభుత్వం సేకరించిన భూములు ఇప్పటికీ రికార్డుల్లో ప్రైవేటు వ్యక్తుల పేరిటే ఉండటంపై మంత్రి సీరియస్ అయ్యారు. వెంటనే భూ రికార్డులను సవరించాలని, అసైన్డ్ మరియు భూదాన్ భూములపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. వీటితో పాటు, ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల విజిలెన్స్ కేసులు మరియు కోర్టు కేసులపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి, త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు స్పష్టం చేశారు.Bhu Bharati Portal: భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం

ఒకే క్లిక్‌తో రైతులకు పూర్తి సమాచారం
భూభారతి పోర్టల్ ద్వారా రైతులకు, సామాన్యులకు అవసరమైన అన్ని సేవలను సులభతరం చేయడమే ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తెలిపారు. కేవలం ఒక్క క్లిక్‌తో ఏ వివరాలు మీకు కనిపిస్తాయంటే..

-  భూముల పూర్తి సమాచారం, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ వివరాలు.
-  మార్కెట్ విలువ, విలేజ్ మ్యాప్, ప్రతి సర్వే నెంబర్‌కు సంబంధించిన మ్యాప్.
-  నాలా ఆర్డర్లు, ROR (Record of Rights), గ్రామాల నక్షా.

ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్ ద్వారా లాగిన్ అయ్యి ఈ సమాచారాన్ని పొందవచ్చని మంత్రి పొంగులేటి వివరించారు. భూ క్రయవిక్రయాల్లో ఇబ్బందులు కలగకుండా ప్రతి సర్వే నంబర్‌కు మ్యాప్ రూపొందించే ప్రక్రియను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

నూతన తహశీల్దార్ కార్యాలయాలకు మోడల్ డిజైన్
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నిర్మించబోయే తహశీల్దార్ కార్యాలయాలన్నీ ఒకే రకమైన నమూనాలో ఉండాలని మంత్రి పొంగులేటి సూచించారు. రెవెన్యూ వ్యవస్థ ఆధునీకరణలో సామాన్యుడి ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని, సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో ఎలాంటి తారుమారుకు లేదా లోపాలకు తావు లేకుండా అత్యంత పటిష్టంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Saudi Arabia Snowfall: సౌదీ అరేబియాలో వింత దృశ్యం.. ఏడారిలో మంచు దుప్పటి, భారీ వర్షాలు.. కారణం ఏంటి?
సౌదీ అరేబియాలో వింత దృశ్యం.. ఏడారిలో మంచు దుప్పటి, భారీ వర్షాలు.. కారణం ఏంటి?
Hyderabad Metro Rail: మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
GHMC Property Tax: గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
Advertisement

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Saudi Arabia Snowfall: సౌదీ అరేబియాలో వింత దృశ్యం.. ఏడారిలో మంచు దుప్పటి, భారీ వర్షాలు.. కారణం ఏంటి?
సౌదీ అరేబియాలో వింత దృశ్యం.. ఏడారిలో మంచు దుప్పటి, భారీ వర్షాలు.. కారణం ఏంటి?
Hyderabad Metro Rail: మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
మెట్రో ప్రయాణంలో సరికొత్త మలుపు; ఎల్ అండ్ టీ నుంచి హైదరాబాద్ మెట్రో టేకోవర్ ప్లాన్ సిద్ధం!
GHMC Property Tax: గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్- 90శాతం మిగిలే ఆఫర్ ప్రకటించిన జీహెచ్ఎంసీ  
VB–G RAM G Bill: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసేయడంపై కమ్యూనిస్టుల విమర్శలు -ఘాటు కౌంటర్ ఇచ్చిన ఏపీ బీజేపీ
Rowdy Janardhana Title Glimpse : ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
ఇంటిపేరునే రౌడీగా మార్చుకున్న 'రౌడీ జనార్దన' - విజయ్ దేవరకొండ బ్లడ్ బాత్ నట విశ్వరూపం
GHMC Delimitation: జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు మార్గం సుగమం - అభ్యంతరాలపై అన్ని పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు
TTD adulterated ghee case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
టీటీడీ కల్తీ నెయ్యి కేసులోనూ చెవిరెడ్డి - జైల్లో ప్రశ్నించిన సీబీఐ అధికారులు
Hyderabad Crime: మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
మేడ్చల్ లెక్చరర్ అశోక్‌ను చంపింది భార్యే - నమ్మకంగా విషం పెట్టేసింది !
Embed widget