Vitamins For Women : ప్రతి మహిళ కచ్చితంగా తీసుకోవాల్సిన విటమిన్స్ ఇవే.. ఆ సమస్యలు దూరమవడంతో పాటు ఎన్నో లాభాలు
Nutrient Deficiency : ప్రతి మహిళ తన డైట్లో కచ్చితంగా కొన్ని విటమిన్స్ చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఇంతకీ అవి ఏంటో.. వాటి వల్ల కలిగే లాభాలు ఏంటో? తీసుకోకుంటే కలిగే నష్టాలు ఏంటో చూసేద్దాం.

Womens Health : మహిళలు ఆరోగ్యం పట్ల కచ్చితంగా శ్రద్ధ వహించారు. జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. నడక వంటి తేలికపాటి వ్యాయామాలు కూడా మంచిదే. అయితే దీనితో పాటు శరీరానికి కావాల్సిన కొన్ని విటమిన్స్ కచ్చితంగా తీసుకోవాలి. లేదంటే శక్తి ఉండదు. ఏ పని చేయకున్నా నీరసంగా ఫీల్ అవుతారు. మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవుతాయి. ఇవే కాకుండా శరీరంలో విటమిన్స్ తక్కువ అవడం వల్ల వివిధ ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
విటమిన్స్ అనేవి శరీరానికి, ఆరోగ్యానికి బూస్టర్స్ వంటివి. వాటిని తీసుకోకుంటే శారీరకంగానే కాదు మానసికంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే శరీరానికి సరైన విటమిన్స్ అందించాలని సూచిస్తున్నారు నిపుణులు. మహిళలు కచ్చితంగా తీసుకోవాల్సిన కొన్ని విటమిన్స్‌ని సూచిస్తూ.. వాటివల్ల కలిగే లాభాలు చెప్తున్నారు. మరి వాటిని తీసుకోకుంటే కలిగే ఇబ్బందులు ఏంటి? సప్లిమెంట్స్ కాకుండా ఏ ఫుడ్స్ రూపంలో వాటిని తీసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం.
విటమిన్ డి
మహిళల్లో విటమిన్ డి లోపం ఎక్కువగా ఉంటుంది. అందుకే దీనిని పొందేందుకు ఉదయాన్నే కాసేపు ఎండలో ఉంటే మంచిది. లేదా వైద్యుల సూచనల మేరకు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె సమస్యలు దూరమవుతాయి. బోన్ సమస్యలు, కండర సమస్యలు రావు. మెదడు ఆరోగ్యానికి కూడా మంచిది.
విటమిన్ డి ఫుడ్స్
సాల్మన్, ట్యూనా వంటి చేపలు తీసుకోవచ్చు. ఎగ్ ద్వారా కూడా విటమిన్ డి పొందవచ్చు. సోయా, ఆల్మండ్, ఓట్ మిల్క్స్ ద్వారా కూడా పొందవచ్చు. యోగర్ట్, ఆరెంజ్ జ్యూస్‌లలో కూడా ఉంటుంది. మష్రూమ్ కూడా విటమిన్ డికి మంచి ఎంపిక.
ఐరన్
రక్తంలో ఐరన్ తగినంత లేకుంటే త్వరగా నీరసం వచ్చేస్తుంది. శరీరంలో ఆక్సిజన్ ఫ్లో తగ్గుతుంది. ఇమ్యూనిటీ వీక్ అవుతుంది. కాబట్టి ఫటిగో సమస్యలను పోగొట్టుకోవడానికి, శక్తిని, ఎనర్జీని పొందేందుకు ఐరన్ అవసరం. వైద్యుల సూచనల మేరకు టాబ్లెట్స్, సిరప్ రూపంలో దీనిని తీసుకోవచ్చు.
ఐరన్ రిచ్ ఫుడ్స్
ఐరన్ లోపం ఉంటే.. రెడ్ మీట్, చికెన్, లివర్, తోటకూర, పప్పులు, శనగలు, కిడ్నీ బీన్స్, టోఫు వంటివి డైట్లో చేర్చుకుంటే మంచిది. గుమ్మడి గింజలు, క్వినోవా, డార్క్ చాక్లెట్ కూడా ఐరన్‌ని ఇంప్రూవ్ చేస్తాయి.
కాల్షియం
వయసు పెరిగే కొద్ది ఎముకల సాంద్రత తగ్గుతుంది. దీనివల్ల బోన్ సమస్యలు వస్తాయి. అందుకే కాల్షియంపై మహిళలు దృష్టి పెట్టాలి. కాబట్టి వైద్యుల సూచనల మేరకు వాటిని తీసుకోవాలి. ఫుడ్ ద్వారా కాల్షియం పొందాలంటే లిస్ట్ ఇక్కడ ఉంది.
కాల్షియం ఫుడ్స్
పాలు, పెరుగు, చీజ్, ఆకుకూరలు, బ్రకోలి, బాదం, చియాసీడ్స్, టోఫు వంటి వాటిని డైట్లో చేర్చుకుని రెగ్యులర్‌గా తీసుకుంటే కాల్షియం శరీరానికి అందుతుంది.
విటమిన్ బి 12
విటమిన్ బి 12 కూడా మహిళలు కచ్చితంగా తీసుకోవాలి. ఇది బ్రెయిన్ ఫంక్షన్‌ని మెరుగు చేయడంతో పాటు ఎర్ర రక్త కణాల గ్రోత్‌ని మెరుగుపరుస్తుంది.
విటమిన్ బి 12 ఫుడ్స్
చేపలు, మటన్, గుడ్లు, పాలు, సోయా, బాదం, ఓట్స్‌లలో ఇది పుష్కలంగా ఉంటుంది. లేదంటే వైద్యుల సూచనలతో సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు.
మెగ్నీషియం
ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాడనికి, మెరుగైన నిద్ర కోసం మీరు మెగ్నీషియంను డైట్లో తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని కూడా సప్లిమెంట్స్, ఫుడ్స్ రూపంలో శరీరానికి అందించవచ్చు.
మెగ్నీషియం ఫుడ్స్
బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు, చియా సీడ్స్, అవిసెగింజలు, పాలకూర, బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్, బ్లాక్ బీన్స్, శనగలు, చేపలు వంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల శరీరానికి మెగ్నీషియం కూడా అందుతుంది.
ఇవే కాకుండా హార్మోన్స్ బ్యాలెన్స్ చేసేందుకు, హెల్తీ స్కిన్ కోసం ఫోలేట్.. గుండె, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ మెరిసే చర్మాన్ని పొందడానికి ఒమేగా 3 తీసుకోవచ్చు. అయితే వీటిని తీసుకునే ముందు కచ్చితంగా వైద్యుల సూచనలు తీసుకోవాలి. వారు ఇచ్చే సప్లిమెంట్స్ తీసుకుంటూ ఫుడ్స్‌లో మార్పులు చేస్తే ఆరోగ్యంగా ఉంటారు.






















