అన్వేషించండి

Intermittent Fasting Diet Plan : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇలా చేస్తే వారానికి కిలో బరువు తగ్గొచ్చట.. డైట్ ప్లాన్ ఇదే

Intermittent Fasting : బరువు తగ్గడానికి ఇంటర్మిటెట్ ఫాస్టింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ ఫాల అవుతూ వారానికి ఒకటి లేదా రెండు కిలోల బరువు తగ్గవచ్చట. అదెలాగో చూసేద్దాం. 

Intermittent Fasting for Weight Loss : బరువు తగ్గడానికి చాలామంది ఇంటర్మింటెంట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. కానీ బరువు తగ్గడంలో మార్పులు సరిగ్గా కనిపించవు. దాని అర్థం ఫాస్టింగ్ అయితే చేస్తున్నారు కానీ ఎలాంటి ఫుడ్​ని డైట్​లో తీసుకోవాలో అవగాహన లేకపోవడమేనని చెప్తున్నారు. అయితే ఎంతసేపు ఫాస్టింగ్ విండ్ మెయింటైన్ చేయాలో.. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో.. డైట్​ని ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకుని ఇంటర్మింటెంట్ ఫాస్టింగ్ చేస్తే వారానికి ఓ కిలో చొప్పున బరువు తగ్గవచ్చని చెప్తున్నారు. 

బరువు తగ్గడం కోసం మీరు కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాలనుకుంటే ముందుగా వైద్యుల సలహా తీసుకోవాలి. అలాగే మీ వర్క్, మీ డైలీ యాక్టివిటీలకు అనుగుణంగా ఈ ఫాస్టింగ్ విండ్ ప్లాన్ చేసుకోవాలి. అయితే ఫాస్టింగ్ విండ్ ఎంత సేపు తీసుకోవాలో.. తినేటైమ్ ఎప్పుడు చూసుకోవాలో.. ఫాస్టింగ్ సమయంలో ఎలాంటి కేర్ తీసుకుంటే మంచిదో.. ఎలాంటి ఫుడ్​ని తీసుకోవడం వల్ల హెల్తీగా, బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుందో ఇప్పుడు చూసేద్దాం. 

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నియమాలు.. 

ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్​లో 16 గంటల ఉపవాసం.. 8 గంటలు తినడం కోసం మొత్తంగా 24 గంటలను రెండు భాగాలుగా విభజిస్తారు. కొత్తగా ప్రారంభించేవారికి 16:8 విండ్ మంచిది. ఫాస్టింగ్ సమయం అంటే 16 గంటలను రాత్రి 7.30 నుంచి ఉదయం 11.30 వరకు పెట్టుకోవచ్చు. చాలామందికి ఆ సమయంలో పెద్దగా వర్క్ ఉండదు కాబట్టి.. ఫుడ్ లేకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు. ఉదయం 11.30 నుంచి రాత్రి 7.30 వరకు తినొచ్చు. ఆ సమయంలో వర్క్ చేసేవారు ఎక్కువ. ఎనర్జిటిక్​గా వర్క్ చేసుకునే సమయంలో ఫుడ్ తీసుకోవడం మంచిది. అయితే ఫుడ్​ని ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. 

మొదటి భోజనం..(11:30 AM)

ఉదయం 11.30కి ఫస్ట్ మీల్ తీసుకోవచ్చు. కాబట్టి ఆ సమయంలో వారం అంతా ఏమి తీసుకుంటే మంచిదో చూసేద్దాం. సోమవారం బొప్పాయిని 250 గ్రాములు తీసుకోవాలి. మంగళవారం 250 గ్రాములు ఫ్రూట్ సలాడ్ తీసుకోవచ్చు. బుధవారం 1 గ్లాస్ స్మూతీ (ఓట్స్ (40గ్రాములు), పాలు, అరటిపండుతో చేసిన స్మూతీ తీసుకోవచ్చు. లేదా మీకు నచ్చిన ఫ్రూట్​తో ఈ స్మూతీ చేసుకోవచ్చు.) అలాగే 5 బాదం కూడా తీసుకోవచ్చు. గురువారం 2 బ్రెడ్ పనీర్ లేదా టోఫు శాండ్​విచ్ తినొచ్చు. శుక్రవారం 250 నుంచి 300 గ్రాముల బొప్పాయి తినొచ్చు. శనివారం కూరగాయలను కలిపి శనగపిండి దోశ వేసుకోవచ్చు. శనివారం వెజిటెబుల్ పోహా లేదా ఉప్మా తీసుకోవచ్చు. కప్పు మాత్రమే. 

సెకండ్ మీల్ (భోజనం) (02:00PM)

సోమవారం చపాతీ, పనీర్ కర్రీ, 120 గ్రాముల సలాడ్, 1 కప్పు రైతా తీసుకోవచ్చు. మంగళవారం 2 చపాతీలు, 1 కప్పు పప్పు, సలాడ్, పెరుగు తినొచ్చు. బుధవారం 130 నుంచి 150 గ్రాముల అన్నం 180 గ్రాముల రాజ్మా, సలాడ్ తీసుకోవచ్చు. గురువారం చపాతీ, పప్పు, 1 కప్పు రైతా తినొచ్చు. శుక్రవారం చపాతీ, సోయా కూర, సలాడ్, కప్పు రైతా తీసుకోవచ్చు. శనివారం 2 చపాతీ, పనీర్ కర్రీ, సలాడ్, కప్పు పెరుగు బెటర్. ఆదివారం శనగల సలాడ్ తినొచ్చు. 50 గ్రాములు ఉడికించినశనగలు, 100 గ్రాముల పనీర్, కీరదోస, టొమాటో, ఉల్లిపాయ, చాట్ మసాలా, నిమ్మరసం కలిపి సలాడ్​గా తినొచ్చు. 

మూడోవ మీల్ (స్నాక్స్ టైమ్) (05:00PM)

సోమవారు 1 గ్లాస్ నిమ్మరసం చియాసీడ్స్​తో కలిపి తీసుకోవాలి. మంగళవారం స్వీట్ కార్న్ చాట్ తినొచ్చు. బుధవారం బటర్​మిల్క్ లేదా గ్లాసు కొబ్బరినీరు తాగొచ్చు. గురువారం మఖానాను తినొచ్చు. శుక్రవారం 200 గ్రాముల పుచ్చకాయ, ఆదివారం పల్లీ చక్కీ లేదా రోస్ట్ చేసిన మఖానాను తీసుకోవచ్చు. 

నాల్గొవ మీల్ (రాత్రి భోజనం)(07:30 PM)

సోమవారం వెజిటెబుల్ కిచిడి(150 గ్రాములు), సలాడ్ కలిపి తీసుకోవచ్చు. మంగళవారు 150 గ్రాముల పనీర్ కట్​లెట్, బుధవారం వెజిటేబుల్స్​తో కూడిన దోశ, గ్రీన్ చట్నీ తీసుకోవచ్చు. గురువారం చపాతీ, 150 గ్రాముల పనీర్, సలాడ్ తీసుకోవచ్చు. శుక్రవారం సేమ్యా ఉప్మా 150 గ్రాములు తీసుకోవచ్చు.  శనివారం మసాలా ఓట్స్ 40 గ్రాములు, కూరగాయలు కలిపి తీసుకోవచ్చు. ఆదివారం చపాతీ, పనీర్ బఠాణీ కర్రీని తీసుకోవచ్చు. 

నాన్​ వెజ్ తినేవారు 

నాన్​వెజ్ తినేవారు మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనాన్ని ఇప్పుడు చెప్పేవాటితో రిప్లేస్ చేసుకోవచ్చు. సోమవారం 150 గ్రాముల గ్రిల్డ్ చికెన్, సలాడ్ తీసుకోవచ్చు. మంగళవారం 150 గ్రాముల పనీర్ కట్​లెట్, బుధవారం 2 బ్రెడ్​లు, 2 ఎగ్స్​ ఆమ్లెట్ వేసుకుని తినొచ్చు. గురువారం చపాతీ, 150 గ్రాముల పనీర్ కర్రీ, సలాడ్ తీసుకోవచ్చు. శుక్రవారం 150 గ్రాముల చికెన్ టిక్కా లేదా ఫిష్ టిక్కా, సలాడ్స్ తీసుకోవచ్చు. ఆదివారం 170 గ్రాముల గ్రిల్డ్ చికెన్ సలాడ్ తీసుకోవచ్చు.   

ఫాస్టింగ్ ఉన్న సమయంలో ఏమి తినకూడదు. కానీ శరీరాన్ని నిలవరించేందుకు కొన్ని డ్రింక్స్ తీసుకోవచ్చు. నీళ్లు లేదా గ్రీన్ టీ, లేదా బ్లాక్ కాఫీ వంటివి ఫాస్టింగ్​ వింగ్​లో తీసుకోవచ్చు. ఈ రూల్​ని మీరు ఫాలో అవుతూ.. వ్యాయామాన్ని కూడా జోడిస్తే బరువు తగ్గడంలో మంచి ఫలితాలు చూస్తారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget