శరీరానికి విటమిన్స్ చాలా అవసరం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మహిళలు వీటిని తీసుకోవాలట.

విటమిన్స్ తీసుకుంటే శరీరంలో కార్టిసాల్ రెగ్యులేట్ అయి హార్మోన్ల సమస్యలను, ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుందట.

విటమిన్ బి 12 కూడా చాలా అవసరం. ఇది తగినంత ఎనర్జీని ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది.

థైరాయిడ్ సమస్యలను దూరం చేసుకోవాలనుకునేవారు కూడా బి 12ను తీసుకోవచ్చు. ఎర్ర రక్తణాల ఏర్పాటుకు ఇది హెల్ప్ చేస్తుంది.

విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్​గా పనిచేస్తుంది. పీరియడ్స్ సమయంలో తిమ్మిరిని తగ్గిస్తుంది.

సంతానోత్పత్తి సమస్యలను తగ్గించడంలో కూడా విటమిన్ ఇ హెల్ప్ చేస్తుంది.

విటిమిన్ డి మహిళలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎన్నో సమస్యలను దూరం చేయడంలో ఇది హెల్ప్ చేస్తుంది.

ముఖ్యంగా పీరియడ్స్ నిర్వహణకు, బోన్స్ హెల్త్​కి, మానసిక స్థితిని సరిచేయడంలో విటమిన్ డి ఉపయోగపడుతుంది.

విటమిన్స్ లోపం ఉంటే ఆరోగ్యానికి మంచిది కాదు. సమస్యలు మొదలవుతాయి. కాబట్టి ఫుడ్ రూపంలో లేదా సప్లిమెంట్ రూపంలో తీసుకోవాలి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.