అన్వేషించండి

Mahesh Babu: ఈడీ అధికారులకు మహేష్ బాబు లేఖ - మరో డేట్ ఇవ్వాలంటూ రిక్వెస్ట్

Sai Surya Developers Case: సూపర్ స్టార్ మహేష్ బాబు ఈడీ అధికారులను సమయం కోరారు. సాయిసూర్య డెవలపర్స్, సురానా ప్రాజెక్టు కేసుల్లో ఆయనకు కొద్ది రోజుల క్రితం ఈడీ నోటీసులు జారీ చేసింది.

Mahesh Babu Seeks Time To Attend ED Investigation: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ఈడీ అధికారులకు లేఖ రాశారు. ఓ యాడ్ విషయంలో రెమ్యునరేషన్‌తో పాటు ఇతర  వివరాలకు సంబంధించి ఆయనకు ఇటీవలే ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆదివారం విచారణకు హాజరు కావాలని తెలపగా.. మహేష్ బాబు హాజరు కాలేదు. 

ప్రస్తుతం తాను మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నానని.. అందుకే విచారణకు హాజరు కాలేకపోయానని మహేష్ బాబు లేఖలో వివరించారు. సోమవారం కూడా షూటింగ్ ఉందని.. విచారణ కోసం మరో తేదీ ఇవ్వాలని ఈడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

Also Read: నాకూ బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయ్! - 'ఇతను ఎన్నో బాయ్ ఫ్రెండ్?' అని అడిగేవారన్న శ్రుతి హాసన్

అసలేం జరిగిందంటే?

సాయి సూర్య డెవలపర్స్, సురనా గ్రూప్ కంపెనీల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ‌ (Enforcement Directorate) విచారణ చేసింది. ఆ సంస్థకు మహేష్ బాబు యాడ్స్ చేశారు. ఈ 2 సంస్థలకు ఆయన అంబాసిడర్‌గా ఉన్నారు. ఇందుకోసం మహేష్ భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. 

సాయి సూర్య డెవలపర్స్ కంపెనీకి చెందిన ప్రాపర్టీలకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించగా.. ఆ యాడ్స్ చేసినందుకు రూ.5.90 కోట్ల రెమ్యునరేషన్ ఆయన తీసుకున్నారట. రూ.3.50 కోట్లు నగదు రూపంలో, రూ.2.50 కోట్లు ఆన్లైన్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఆయనకు సంస్థ అందజేసినట్లు సమాచారం. ఆ పారితోషికం విషయంలో (ఆర్థిక లావాదేవీలకు సంబంధించి) విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది. పెట్టుబడులు పెట్టేందుకు ఇన్‌ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే, షూటింగ్ ఉన్నందున మరో తేదీ ఇవ్వాలంటూ మహేష్ బాబు అధికారులకు రిక్వెస్ట్ చేశారు. దీనిపై మరి అధికారులు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

రాజమౌళి మూవీ షూటింగ్‌లో బిజీగా..

ప్రస్తుతం మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి 'SSMB29' మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. భారీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ షూటింగ్ ప్రజెంట్ హైదరాబాద్ సిటీలో జరుగుతుంది. ఓ యాక్షన్ సీన్ కోసం ప్రత్యేకంగా ఓ భారీ బోట్ సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఇందులో మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్‌తో పాటు దాదాపు 3 వేల మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొననున్నారని సమాచారం. ఈ మూవీలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నారు. మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తుండగా.. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. 2027 మార్చిలో మూవీ రిలీజ్ చేసేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రావణ్‌ లాంటి వాళ్లకు గొడ్డలిపార్టీ ఆర్థిక సాయం! చంద్రబాబు సంచలన వ్యాక్యలు
రావణ్‌ లాంటి వాళ్లకు గొడ్డలిపార్టీ ఆర్థిక సాయం! చంద్రబాబు సంచలన వ్యాక్యలు
BJP To Change Madhya Pradesh Rajasthan Chief Ministers: మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో సీఎంల మార్పు ఖాయమా? మోదీ-షా కొత్త ప్రయోగం వికటించిందా!?
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో సీఎంల మార్పు ఖాయమా? మోదీ-షా కొత్త ప్రయోగం వికటించిందా!?
Hyderabad Old City Minority Voters: పాతబస్తీలో ఓటరు సంక్షోభం - SIRపై మైనారిటీల్లో అభద్రతా భావం.. కర్ణాటక మోడల్ డిమాండ్‌పై రేవంత్ సర్కార్ సైలెన్స్!
పాతబస్తీలో ఓటరు సంక్షోభం - SIRపై మైనారిటీల్లో అభద్రతా భావం.. కర్ణాటక మోడల్ డిమాండ్‌పై రేవంత్ సర్కార్ సైలెన్స్!
Kaleshwaram Project Politics: కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
US Iran War: చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
చెప్పినట్టుగానే ఇరాన్‌పై విరుచుకుపడ్డ అమెరికా! పేల్చేసిన రైల్వే వంతెనలు వీడియో షేర్‌ చేసిన ట్రంప్! 
Truck Slogan: ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
ట్రక్కుల వెనుక రాత్రిపూట డిప్పర్ వాడండి అని ఎందుకు రాస్తారు? దానికి కండోమ్‌తో సంబంధం ఏంటి?
Nagadurga: ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
ఇడుపు కాయితానికి ముందు...  తెలుగమ్మాయి రాతను తమిళ్ సినిమా మారుస్తుందా?
TDP BJP Silence On Ravan Issue: రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
రావణ్ ఇష్యూ.. కూటమిదా, జనసేనదా? ఉపా చట్టం ప్రయోగంపై చంద్రబాబు, బీజేపీ సైలెన్స్ వెనుక మర్మమేంటి!?
Embed widget