Shruti Haasan: నాకూ బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయ్! - 'ఇతను ఎన్నో బాయ్ ఫ్రెండ్?' అని అడిగేవారన్న శ్రుతి హాసన్
Shruti Haasan Reaction On Breakup Stories: తనకు కూడా లవ్ బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయని.. బ్రేకప్ అయినంత మాత్రాన ఆ వ్యక్తిని తప్పుపట్టనని శ్రుతిహాసన్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Shruti Haasan About Love Breakups Boy Friends: సరైన లవ్ పొందడంలో తాను ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యానని హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruti Haasan) తెలిపారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. తన కెరీర్, లవ్‌తో పాటు వ్యక్తిగత విషయాలను సైతం పంచుకున్నారు. తల్లిదండ్రుల విడాకుల సమయంలో తాను ఎంతో బాధ పడినట్లు తెలిపారు.
బ్రేకప్ తర్వాత..
తన జీవితంలో ఇలాంటి పని ఎందుకు చేశానా?.. అని బాధపడిన సందర్భాలు పెద్దగా ఏమీ లేవని.. తనకెంతో ఇష్టమైన వారిని మాత్రం కొన్నిసార్లు బాధ పెట్టానని శ్రుతిహాసన్ తెలిపారు. 'ఒకరు బాధ పడే పని అనుకోకుండా జరిగినా.. అలా నేను చేయకుండా ఉండాల్సిందనే భావన ఎప్పటికీ ఉంటుంది. జీవితాంతం వారికి సారీ చెబుతూనే ఉంటాను. లైఫ్‌లో ప్రతి ఒక్కరికీ లవ్ ఫెయిల్యూర్ స్టోరీ ఉంటుంది. మాజీ భాగస్వామి వల్ల మనం ఎన్నో విషయాలు అర్థం చేసుకుంటాం. నాక్కూడా అలాంటి బ్రేకప్ స్టోరీస్ ఉన్నాయి.
బ్రేకప్ అయిన తర్వాత దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉంటా. నా లవ్ స్టోరీస్ గురించి చాలామంది మాట్లాడుతుంటారు. 'ఇతను ఎన్నో బాయ్ ఫ్రెండ్?' అని అడుగుతుంటారు. వాళ్లకు అర్థం కాని విషయం ఏంటంటే.. వాళ్ల దృష్టిలో అది కేవలం నెంబర్ మాత్రమే. కానీ.. నాకు నేను కోరుకున్న ప్రేమను పొందడంలో అన్నిసార్లు ఫెయిల్ అవుతున్నానని అర్థం. అది నన్ను చాలా బాధ పెడుతుంది. ఎందుకంటే నేను కూడా మనిషినే కదా. బ్రేకప్ అయినంత మాత్రాన ఆ వ్యక్తిని నేను తప్పుపట్టను. మనిషి మారడం సహజం. రిలేషన్ షిప్‌లో నిజాయితీగా ఉంటాను.' అని అన్నారు.
Also Read: భర్తలూ.. టీవీ ఆర్పారో ఇక అంతే! - డిఫరెంట్ రోల్‌లో సమంత.. 'శుభం' ట్రైలర్ అదిరిపోయిందిగా..
కెరీర్ ప్రారంభంలో..
కెరీర్ ప్రారంభంలో తనకు ఎన్నో అవమానాలు ఎదురైనట్లు శ్రుతిహాసన్ తెలిపారు. తాను నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయని.. దీంతో నేను అన్ లక్కీ అనే ట్యాగ్ పడింది. 'తెలుగులో 'గబ్బర్ సింగ్'కు ముందు నటించిన రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దీంతో అక్కడి వారు నేను అన్ లక్కీ అనే ట్యాగ్ వేశారు. ఆ రెండు మూవీల్లో సిద్ధార్థ్ హీరో. అతన్ని మాత్రం ఏమీ అనలేదు. ఇది నాకు అర్థం కాలేదు. 'గబ్బర్ సింగ్'తో నేను విజయాన్ని అందుకున్నా. ఆ సక్సెస్ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. నా మనసుకు నచ్చిన సినిమాల్లోనే నేను నటించాలని నిర్ణయించుకున్నా. నేను ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేయకపోవడాన్ని కూడా కొంతమంది తప్పుగా చూస్తారు.' అని అన్నారు.
తన పేరెంట్స్ కమల్ హాసన్, సారిక విడాకులు తీసుకున్న సమయంలో తాను జీవిత పాఠం నేర్చుకున్నట్లు శ్రుతిహాసన్ చెప్పారు. 'నేను ఇండస్ట్రీకి రావడానికి ముందు నా లైఫ్‌లో ఏం జరిగిందో చాలామందికి తెలియదు. నా పేరెంట్స్ విడిపోవడం నన్ను ఎంతో బాధించింది. వారిద్దరూ విడిపోయాక నేను అమ్మతో ఉన్నాను. అప్పటివరకూ ఉన్న జీవితం ఒక్కసారిగా మారిపోయింది. చెన్నై నుంచి ముంబయికి వచ్చేశాం. లగ్జరీ లైఫ్ దూరమైంది. అప్పటివరకూ మెర్సిడెస్ బెంజ్ కారులో తిరిగిన నేను.. లోకల్ ట్రైన్‌లో వెళ్లేదాన్ని.' అని చెప్పారు.





















