Akshaya Tritiya 2025 : అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? ప్యూరిటీ గురించి ఆలోచించారా?
Akshaya Tritiya 2025: హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఆరు అంకెల అల్ఫాన్యూమెరిక్ కోడ్. BIS Care యాప్ లో దీన్ని నమోదు చేయాలి.

Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ ఈ ఏడాది ఏప్రిల్ 30న ఉంది. ఆ రోజున బంగారం కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. నమ్మకం ఏమిటంటే, ఆ రోజున బంగారం కొనడం వల్ల ఏడాది పొడవునా సుఖశాంతులకు ఎలాంటి లోటు ఉండదని చాలా మంది విశ్వసిస్తారు. అంతేకాకుండా, బంగారాన్ని అద్భుతమైన పెట్టుబడిగా కూడా భావిస్తారు, కాబట్టి అక్షయ తృతీయ రోజు ప్రజలను బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ప్రేరేపిస్తుంది. ఈ సందర్భంగా ప్రజలు బంగారు ఆభరణాలు, నాణేలు లేదా పాత్రలను కొనుగోలు చేస్తారు.
ఈ ఏడాది భూ-రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికన్ టారిఫ్‌లు, కేంద్ర బ్యాంకులు బంగారం అధికంగా కొనుగోలు చేయడం వల్ల పసిధరలు పగ్గాల్లేకుండా పెరిగిపోతోంది. ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. బంగారం ధరల‌్లో ఈ వేగవంతమైన పెరుగుదల మధ్యలో మీరు కూడా ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే, ఈ వార్త మీ కోసం.
బంగారం కొనుగోలు చేసేటప్పుడు ప్యూరిటీ గుర్తించండి
సాధారణంగా అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే ధోరణి ఉండటం వల్ల దుకాణాలు కస్టమర్లతో ప్యాక్ అయి ఉంటాయి. బంగార ఆభరణాల ఎంపికపై చూపిన శ్రద్ధ చాలా మంది ప్యూరిటీపై పెట్టరు. తనిఖీ చేసి బంగారం కొనుగోలు చేయడానికి సమయం కూడా సరిపోదు. మిగిలిన కస్టమర్లతో దుకాణం రష్‌గా ఉంటుంది. అలాంటి సమయంలో ప్యూరిటీ బంగారాన్ని గుర్తించడంలో ఇబ్బందులు తలెత్తుతాయి.
అయితే, బంగారం కొనుగోలు చేసేటప్పుడు మీరు కొనుగోలు చేస్తున్న బంగారం నిజమైనదో లేదో అందులో ఏదైనా మిశ్రమం ఉందో లేదో చూడటం చాలా అవసరం. కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం తమ పొదుపులను పెట్టుబడి పెట్టి బంగారం కొనుగోలు చేసేటప్పుడు వారు మోస పోకుండా ఉండేందుకు అనేక చర్యలు తీసుకుంది.
ప్యూరిటీ బంగారాన్ని ఇలా గుర్తించండి
బంగారం ఎంత ప్యూరిటీ ఉందో తెలుసుకోవడానికి కస్టమర్లు భారతీయ ప్రమాణాల బ్యూరో (BIS) BIS Care App సహాయం తీసుకోవచ్చు. ఈ యాప్ సహాయంతో మీరు ఏదైనా వస్తువు హాల్‌మార్కింగ్ లేదా ISI మార్క్‌ను సులభంగా తనిఖీ చేయవచ్చు. దీన్ని మీరు Play Store నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అనంతరం మీరు హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను నమోదు చేయాలి. దానితోపాటు మీకు హాల్‌మార్క్ స్టాటస్ సమాచారం లభిస్తుంది. దీనిలో HUID నంబర్‌ను 'verify HUID' సహాయంతో తనిఖీ చేయవచ్చు. అదేవిధంగా ఏదైనా వస్తువు ISI మార్క్ ద్వారా దాని ప్యూరిటీని తనిఖీ చేయవచ్చు.
క్యారెట్ గురించి గందరగోళం లేకుండా ఉండండి
అంతేకాకుండా, ప్రజలు క్యారెట్ గురించి కూడా అనుమానపడుతూ ఉంటారు. 24 క్యారెట్ బంగారాన్ని అత్యంత శుద్ధమైనదిగా భావిస్తారు. అయితే 22 క్యారెట్ బంగారంలో శుద్ధత 91.6 శాతం ఉంటుంది. అయితే, 99.9 శాతం ప్యూరిటీ 24 క్యారెట్ బంగారాన్ని ఆభరణాల తయారీలో ఉపయోగించరు. ఇవి మార్కెట్లో నాణేలు లేదా బార్ల రూపంలో మాత్రమే అమ్ముడవుతాయి. ఆభరణాల తయారీలో 22 క్యారెట్ బంగారాన్ని ఉపయోగిస్తారు. వీటితోపాటు, 18 క్యారెట్, 14 క్యారెట్ బంగారం కూడా ఉంటుంది, వీటి ప్యూరిటీ తక్కువగా ఉంటుంది.





















