అన్వేషించండి

Items Expensive In India: పాక్ నుంచి దిగుమతులు బంద్, భారత్‌లో ధరలు పెరగనున్న వస్తువులు ఇవే

Pahalgam Terrorist Attack | పహల్గాం ఉగ్రదాడి భారత్, పాక్ మధ్య వాణిజ్య సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. పాక్ నుంచి దిగుమతులు నిలిపివేస్తే కొన్ని వస్తువుల ధరలు భారీగా పెరగనున్నాయి

Items Expensive After Pahalgam Terrorist Attack | జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలకు దారితీసింది. పాకిస్తాన్ ఈ దాడిని ఖండించకపోవడం, భారత ప్రభుత్వం తప్పిదాలే అందుకు కారణమని పిచ్చి కూతలు కూయడంతో కేంద్రం సీరియస్ గా తీసుకుంది. భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై పలు దౌత్య చర్యలు తీసుకుంది.

పాక్ ను ఇరుకున పెట్టేందుకు సింధు జలాల ఒప్పందంపై నిషేధం, వీసాలు రద్దు, అట్టారి, వాఘా సరిహద్దు మూసివేత నిర్ణయంతో దెబ్బకొట్టింది.  ప్రస్తుతం భారతదేశంలో ఉన్న SVES వీసాలు కలిగిన అధికారులు 48 గంటల్లోపు దేశం విడిచి వెళ్లాలని సైతం ఆదేశించారు. పాక్ పౌరులు ఏప్రిల్ 27 లోగా దేశం విడిచి వెళ్లాలి, ఎమర్జెన్సీ హెల్త్ వీసాలు కలిగిన వారు ఈ 29 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించారు. భారతదేశంలో పాకిస్తాన్ అధికారిక X ఖాతాను కూడా ప్రభుత్వం నిషేధించింది. 

మరోవైపు ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. భారత్ నిర్ణయాలు పాక్ మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపనున్నాయి. భారత్, పాక్ మధ్య వాణిజ్య సంబంధాలు దెబ్బతింటే పలు ఉత్పత్తుల ధరలపై ప్రభావం చూపుతాయి. పాకిస్తాన్ నుంచి భారతదేశం పలు ముఖ్యమైన వస్తువులను దిగుమతి చేసుకుంటుంది. సరిహద్దు మూసివేత, వాణిజ్యం రద్దు చేసుకోవడంతో మార్కెట్ పై ప్రభావం చూపి పలు ఉత్పత్తుల ధరలు హెచ్చుతగ్గులు జరుగుతాయి. 

ఆప్టికల్ లెన్స్‌లు: పాకిస్తాన్ కళ్లద్దాల లెన్సులు భారీగా ఉత్పత్తి చేస్తుంది. మన దేశంలో వీటికి భారీగా డిమాండ్ ఉండటంతో ఆప్టికల్ లెన్స్‌ల ధరలు అమాంతం పెరగనున్నాయి. 

డ్రై ఫ్రూట్స్: పాకిస్తాన్ నుంచి భారత్ పెద్ద ఎత్తున డ్రై ఫ్రూట్స్ దిగుమతి చేసుకుంటుంది. డ్రై ఫ్రూట్స్‌లో భారత్‌కు ప్రధాన ఎగుమతిదారు పాక్. డ్రై ఫ్రూట్స్ 
సరఫరా నిలిచిపోతే వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని వ్యాపారులు చెబుతున్నారు.

రాక్ సాల్ట్: భారత్ రాక్ సాల్ట్ ను పాకిస్తాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీన్ని కొన్ని రకాలా అనారోగ్య సమస్యలకు సైతం వినియోగిస్తారు. దాంతో రాక్ సాల్ట్ ధర భారీగా పెరిగే అవకాశం ఉంది. 

ఇతర ఉత్పత్తులు: భారతదేశం పాకిస్తాన్ నుంచి సిమెంట్, ముల్తానీ మట్టి, పండ్లు, పత్తి, ఉక్కు, తోలు ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకుంటుంది. దాంతో ప్రస్తుత పరిస్థితుల్లో వీటి దిగుమతి లేక ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడే అవకాశం కనిపిస్తోంది. 


పహల్గామ్ లోని పర్యాటక ప్రాంతంలో ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే లష్కరే తోయిబా ఉగ్రవాదుల దాడితో భారత్, పాక్ మధ్య వాణిజ్య, దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. ఇరు దేశాల మధ్య వివాదం దక్షిణాసియాలో వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపనుంది. కొన్ని ఉత్పత్తుల ధరలు పెరగనున్నందున భారత ప్రజలపై భారం పడనుంది. మరోవైపు పాక్ పరిస్థితి మరీ దారుణంగా ఉండనుంది. వారికి భారత్ నుంచి దిగుమతులు బంద్ అయి, ఆకలికి అలమటించే పరిస్థితులు నెలకొంటాయని నిపుణులు అంచనా వేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
మొదటి జీతం రాగానే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ? FD, RD లేదా SIP లలో ఏది బెస్ట్ ఆప్షన్?
PMFME Scheme: ఫుడ్ బిజినెస్ చేసేవారికి గుడ్ న్యూస్.. రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
ఫుడ్ బిజినెస్ చేసేవారికి రూ. 10 లక్షల రుణంపై 35% సబ్సిడీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Air India New CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?
ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ- ఎండీగా టేవోల్డే గెబ్రేమారియం.. ఎయిర్‌లైన్స్ దశ మారుతుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
ఈ నెలలో Kia కారు కొంటే రూ.లక్షల్లో ఆదా.. ఏ కారుపై ఎంత డిస్కౌంట్‌ ఉందంటే?
కియా కారు కొనేవాళ్లకు సర్‌ప్రైజ్‌ - రూ.లక్షన్నర మిగిలినట్లే!, ఈ డబ్బుతో మంచి బైక్‌ కొనొచ్చు
Mouneesha Chowdary: బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. జోరుగా ప్రచారం.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
బిగ్ బాస్ 10 తెలుగులోకి స్నో అక్క.. మౌనీషా చౌదరి రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు!
Embed widget