Suryakumar Yadav Records: 4000 IPL పరుగులు పూర్తి చేసుకున్న సూర్యకుమార్ యాదవ్, ఫాస్టెస్ట్ రికార్డుతో ఎలైట్ క్లబ్‌లో చేరిక
Suryakumar Yadav IPL 2025 | సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ లో 4000 పరుగులు చేసిన 17వ ఆటగాడు. బంతులను ఎదుర్కొన్న విషయంలో మూడవ అత్యంత వేగవంతమైన ఆటగాడు.

Mumbai Indians vs Lucknow Super Giants | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో సుర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 4000 పరుగులు పూర్తి చేసిన 17వ ఆటగాడిగా నిలిచాడు. భారత్ నుంచి ఈ ఫీట్ నమోదు చేసిన 13వ ఆటగాడు సూర్య. ఏప్రిల్ 27 (ఆదివారం)నాడు జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో సుర్యకుమార్ యాదవ్ ఈ రికార్డు సాధించాడు. అయితే ఎదుర్కొన్న బంతుల పరంగా (2705) మూడవ అత్యంత వేగవంతంగా నాలుగు వేల పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (2653 బంతులు), ఏబీ డివిలియర్స్ (2658 బంతులు) మాత్రమే సూర్య కంటే ముందున్నారు.
ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లో లక్నో బౌలర్ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో సిక్స్ బాదడంతో సుర్యకుమార్ యాదవ్ 4000 ఐపీఎల్ పరుగుల మైలురాయి చేరుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు
1. విరాట్ కోహ్లీ ఆర్సీబీ – 8396 పరుగులు
2. రోహిత్ శర్మ డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్– 6868 పరుగులు
3. శిఖర్ ధావన్ – 6769 పరుగులు
4. డేవిడ్ వార్నర్ – 6565 పరుగులు
5. సురేష్ రైనా సీఎస్కే, గుజరాత్ లయన్స్– 5528 పరుగులు
6. ఎం.ఎస్ ధోని సీఎస్కే, ఆర్పీఎస్ – 5383 పరుగులు
7. ఏబీ డివిలియర్స్ – 5162 పరుగులు
8. కెఎల్ రాహుల్ – 5006 పరుగులు
9. క్రిస్ గేల్ కేకేఆర్, ఆర్సీబీ, పంజాబ్ – 4965 పరుగులు
10. రాబిన్ ఉతప్ప – 4952 పరుగులు
11. అజింక్య రహానే – 4913 పరుగులు
12. దినేష్ కార్తీక్ – 4842 పరుగులు
13. ఫాఫ్ డు ప్లెసిస్ – 4652 పరుగులు
14. సంజు శాంసన్ రాజస్తాన్ – 4643 పరుగులు
15. అంబటి రాయుడు సీఎస్కే, ముంబై– 4348 పరుగులు
16. గౌతమ్ గంభీర్ – 4217 పరుగులు
17. సుర్యకుమార్ యాదవ్ – 4011 పరుగులు*
సుర్యకుమార్ 2012లో తన ఐపీఎల్ ప్రయాణాన్ని ముంబై ఇండియన్స్ తో ప్రారంభించాడు. కానీ ఆ సీజన్లో ఒకే ఒక మ్యాచ్‌లో ఆడినా పరుగులు చేయలేదు. 2014లోనే వెలుగులోకి వచ్చాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌లో మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తూ మంచి గుర్తింపు పొందాడు. ఆ సంవత్సరం కేకేఆర్ టైటిల్ గెలుచుకోవడానికి కీలకమైన ఆటగాళ్లలో సూర్య ఒకడు. 2014 నుండి 2017 వరకు సూర్య కుమార్ యాదవ్ కేకేఆర్ తరపున 54 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 608 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 60 కాగా, ఫ్రాంచైజీ తరఫున ఒక అర్ధశతకం చేశాడు.
2018లో ముంబై ఇండియన్స్ సూర్య ప్రతిభను గుర్తించి తిరిగి తీసుకుంది. ఈ మార్పు నిజంగానే అతని కెరీర్‌కు మలుపు తిప్పింది. ముంబైకి తిరిగి వచ్చాక బ్యాటింగ్ లైన్‌అప్‌లో టాపార్డర్ కు వెళ్లాడు. మ్యాచ్ విన్నర్ గా మారాడు. ముంబై తరఫున 104 మ్యాచ్‌లలో 3319 పరుగులు చేశాడు. ఎంఐకి ఆడుతూ 25 అర్ధశతకాలు, 2 శతకాలు చేశాడు. 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఒకానొక దశలో రోహిత్ తరువాత కెప్టెన్ అవుతాడని అంతా అనుకున్నారు.





















