Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ
Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌పై వైసీపీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్ షాక్ ఇచ్చింది వైసీపీ. ఆయన పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సస్పెండ్ చేసింది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గానికి చెందిన గత ఏడాది కాలంగా తీవ్ర వివాదాల్లో ఉంటూ వస్తున్నారు.
ఏడాది కాలంగా అన్ని మీడియాల్లో ఏ వైసీపీ నేత పేరైనా మారుమోగింది అంటే అది ఒక్క దువ్వాడ శ్రీనివాస్ మాత్రమే. ఫ్యామిలీ వివాదాలతో కొన్ని రోజులు, ప్రేమ వ్యవహారంతో మరికొన్ని రోజులు ఏదో మీడియాలో చర్చ జరుగుతూ వచ్చింది.
వైవాహిక జీవితం విషయాన్ని పెద్దగా పట్టించుకోని వైసీపీ ఇప్పుడు సడెన్‌గా ఎందుకు సస్పెండ్ చేసింది అనేది చాలా మందికి అంతుపట్టని విషయంగా మారింది. ఆయన ఫ్యామిలీ రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేసినా ఆయన వేరే మహిళతో ప్రేమాయనం సాగించినా పట్టించుకోని వైసీపీ ఇప్పుడు సస్పెండ్ చేయడం వెనుక పెద్ద కథ నడిచిందని అంటున్నారు.
దువ్వాడ శ్రీనివాస్ ఏడాది కాలంగా రకరకాల వివాదలతో చాలా ఫేమస్ అయిపోయారు. ఈ వివాదాల కారణంగా ఆయన్ని టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవి నుంచి తప్పించింది పార్టీ. అయినా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సభా సమావేశాల్లో కూడా అధికార పక్షంపై దూకుడుగా వెళ్తున్నారు. ఇది పార్టీకి మైలేజ్ తీసుకొచ్చేది అయినప్పటికీ ఒక్కసారిగా పార్టీ ఆయన్ని సస్పెండ్ చేయడం వెనుక ధర్మాన కృష్ణదాస్ హస్తం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే స్థానాన్ని కూడా వైసీపీ గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు అక్కడ చట్టసభలకు వెళ్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం దువ్వాడ మాత్రమే. దీన్ని తనకు అనుకూలంగా దువ్వాడ వాడుకుంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలోఉన్న సీనియర్ నేతలను పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఈ పదవికి తోడు ఈ మధ్య కాలంలో వచ్చిన ఇమేజ్‌ను బాగా వాడుకుంటున్నారని అంటున్నారు. జిల్లా నాయకత్వాన్ని కానీ, టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పేరాడ తిలక్‌ను లైట్ తీసుకుంటున్నారట. అంతే కాకుండా తన వల్లే పార్టీకి మైలేజ్ వస్తుందని ప్రచారం చేస్తున్నారని టాక్ నడుస్తోంది. సమస్యలు ఏమైనా ఉంటే తనకు చెప్పాలని మిగతా వాళ్లతో పనులు కావు అనేలా సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఓవైపు వివాదాలు పార్టీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తుంటే ఇప్పుడు ఇలా తనకు నచ్చినట్టుగానే వ్యవహరించడం జిల్లా నాయకత్వానికి, పార్టీ అధినాయకత్వానికి నచ్చడం లేదంటున్నవారు.
షాక్‌లో ఉన్న దువ్వాడ వర్గం
వైసీపీ అధినాయకత్వం తనను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై దువ్వాడ వర్గం స్పందించేందుకు నిరాకరిస్తోంది. ఇలా సస్పెండ్ చేయడాన్ని ఆ వర్గం నమ్మలేకపోతోంది. కుటుంబ వ్యవహారం రచ్చకెక్కినప్పుడు అండగా ఉన్న పార్టీ ఇప్పుడు ఎలాంటి వివాదాలు లేని సమయంలో తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు.
వ్యక్తిగత జీవితంలో వివాదాలు
రాజకీయాల్లో దూకుడుగా ఉండే దువ్వాడ శ్రీనివాస్ కేవలం జిల్లా రాజకీయాలకు మాత్రం సుపరిచితుడుగా ఉండే వాళ్లు. అయితే 2024 ఎన్నికల తర్వాత కుటుంబంలో తలెత్తిన వివాదాలు కారణంగా స్టేట్‌వైడ్ ఫేమస్ అయిపోయారు. పెళ్లి చేసుకున్న భార్యను కాదని పార్టీ నాయకురాలు మాధురితో ప్రేమాయణం నడిపించారు. దీంతో సొంత భార్య వాణి, ఆయన కుమార్తెలు ఇద్దరు రోడ్డు ఎక్కారు. తమ ఆస్తులను లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారని దువ్వాడ ఇంటి ముందే ధర్నా చేశారు. ఆ కుటుంబం మేలు కోరుకునే వాళ్లు కలుగజేసుకొని వివాదాన్ని పరిష్కరించారు. దీంతో అప్పటి నుంచి దువ్వాడ శ్రీనివాస్, మాధురితో ఉంటున్నారు. దువ్వాడ వాణి తన కుమార్తెలతో వేరుగా నివసిస్తున్నారు. మాధురి, తను పెళ్లి చేసుకుంటామని చెబుతూ మీడియా ఛానల్స్ చుట్టూ తిరుగుతూ చెబుతున్నారు దువ్వాడ శ్రీనివాస్. తనకు ఇప్పుడే స్వేచ్చ వచ్చిందని అభిప్రాయపడుతున్నారు.





















