IPL 2025 MI vs LSG: రికెల్టన్, సూర్య కుమార్ హాఫ్ సెంచరీలు, లక్నో ముంగిట ముంబై భారీ టార్గెట్
లక్నో సూపర్ జెయింట్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 215 పరుగులు చేసింది.

ఐపీఎల్ 2025లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో ముంబైలోని వాంఖేడేలో లక్నో, ముంబై జట్లు తలపడ్డాయి. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 215 పరుగులు చేసి లక్నో సూపర్ జెయింట్స్ కు భారీ టార్గెట్ ఇచ్చింది.
రోహిత్ త్వరగా ఔట్.. రికెల్టన్ మెరుపులు
ఫాంలో ఉన్న ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ సిక్సర్ తో ఖాతా తెరిచాడు. తరువాత బంతిని సైతం సిక్సర్ కొట్టి తన ఇంటెన్షన్ తెలిపాడు. కానీ అదే ఓవర్లో లక్నో బౌలర్ మయాంక్ యాదవ్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మను బోల్తా కొట్టించాడు. రోహిత్ శర్మ 2 సిక్సర్లు కొట్టి త్వరగానే ఔటయ్యాడు. తరువాత మరో ఓపెనర్ రికెల్టన్, విల్ జాక్స్ స్కోరు బోర్డును నడిపించారు. జాక్స్ నెమ్మదిగా ఆడగా, రికెల్టన్ మాత్రం వేగంగా పరగులు రాబట్టాడు. అతను బౌండరీలు, సిక్సర్లు బాదడంతో ముంబై ఇండియన్స్ రన్ రేట్ పెరిగింది. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ దిగ్వేష్ రాఠీ, రవి బిష్ణోయ్ బౌలింగ్ లోనూ బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. రికెల్టన్ (32 బంతుల్లో 58 పరుగులు, 6 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేసిన అనంతరం ఔటయ్యాడు. స్పిన్నర్ దిగ్వేష్ బౌలింగ్ లో షాట్ ఆడగా ఆయుష్ బదోని పట్టిన క్యాచ్ కు నిరాశగా వెనుదిరిగాడు.
రికెల్టన్ ఔటయ్యాక మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ కు వచ్చాడు. విల్ జాక్స్ కొంత దూకుడుగా ప్రదర్శించడానికి ప్రయత్నించగా స్వేచ్చగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. విల్ జాక్స్‌ను ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ బౌల్డ్ చేశాడు. విల్ జాక్స్ 21 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 29 పరుగులు చేశాడు. ఆపై లక్నో బౌలర్లు పట్టుసాధించారు. కట్టుదిట్టంగా బంతులేస్తూ సూర్యకుమార్ మినహా ఇతర ముంబై బ్యాటర్లను కట్టడి చేశారు. తెలుగు తేజం తిలక్ వర్మ 6 పరుగులు, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 5 పరుగులకే వికెట్ సమర్పించుకున్నారు.
Flexing their muscles 💪
— IndianPremierLeague (@IPL) April 27, 2025
Valuable runs added by Naman Dhir and Corbin Bosch 👏
Updates ▶ https://t.co/R9Pol9Id6m #TATAIPL | #MIvLSG | @mipaltan pic.twitter.com/CvsqjCtlds
సూర్య కుమార్ షో
ఒకవైపు వికెట్లు పడిపోతున్నా సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. మరో ఎండ్ లో నామన్ ధిర్ అతనికి సహకారం అందించాడు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 4 వేల పరుగులు పూర్తి చేసుకున్న 17 వ ఆటగాడిగా, 13వ భాతర ఆటగాడిగా నిలిచాడు. అయితే బంతుల పరంగా అతి తక్కువ బంతులు ఎదుర్కొని ఈ ఘతన సాధించిన మూడో ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. క్రిస్ గేల్, డివిలియర్స్ మాత్రమే ఈ జాబితాలో సూర్య కంటే ముందున్నారు. బాగా ఆడి అర్ధ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో సూర్య అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అవేశ్ ఖాన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 54 పరుగులు చేసి ఔటయ్యాడు.
ఆ తర్వాత, నమంతీర్ చర్య తీసుకోవడానికి ప్రయత్నించాడు. నామన్ ధిర్, అరంగేట్ర ఆటగాడు కార్బిన్ చివర్లో హిట్టింగ్ చేయడంలో ముంబై 200 పరుగులు దాటింది. కొత్త ఆటగాడు కార్బిన్ 10 బంతుల్లో 1 సిక్స్, 2 ఫోర్లతో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 215 పరుగులు చేసి లక్నోకు భారీ టార్గెట్ ఇచ్చింది. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేశ్ ఖాన్ చెరో 2 వికెట్లు తీయగా.. ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ లకు ఒక్కో వికెట్ దక్కింది. బౌలింగ్ వేసిన లక్నో బౌలర్లు అంతా 40కి పైగా పరుగుల చొప్పున సమర్పించుకున్నారు.





















